పిల్లలలో థైరాయిడ్ సమస్యలు వస్తాయా..?
సాక్షి లైఫ్ : హషిమోటో థైరాయిడిటిస్ వంటి ఆటో ఇమ్యూన్ వ్యాధులు కూడా థైరాయిడ్‌కు కారణం కావచ్చు. అయోడిన్ లోపం వల్ల కూడా థైరాయిడ్ ప్రోబ్లమ్స్ తలెత్తుతాయని వైద్యనిపుణులు వెల్లడిస్తున్నారు. ఆటోఇమ్యూన్ డిసీజ్ అనేది శరీరం రోగనిరోధక వ్యవస్థ థైరాయిడ్ గ్రంధిని దెబ్బతీయడం ప్రారంభించే పరిస్థితి. తల్లి కడుపులో పెరుగుతున్న బిడ్డకు సరైన పోషకాహారం అందకపోతే థైరాయిడ్ సమస్యలు రావచ్చు.
ఇది కూడా చదవండి..పీఎం నరేంద్ర మోడీ ఆరోగ్య రహస్యాలు..
ఇది కూడా చదవండి..ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఎలాంటి ఆహారాల నుంచి పొందవచ్చు..?
ఇది కూడా చదవండి..తేనెను ఫ్రిజ్‌లో ఉంచుతున్నారా..? ఈ విషయాలు తెలుసుకోండి..
ఇది కూడా చదవండి..మార్నింగ్ వాక్ చేసేటపుడు ఈ ఆరు విషయాలు గుర్తుంచుకోండి..ఎందుకంటే..?
ఇటీవల చాలా మంది చిన్నారుల్లో థైరాయిడ్ సమస్య పుట్టుకతోనే వస్తోంది. అంతే కాకుండా బిడ్డ నెలలు నిండకుండా పుడితే కూడా కొందరిలో థైరాయిడ్ సమస్య తలెత్తే అవకాశం ఉంటుంది. ఈ సమస్యను నివారించడానికి, తల్లి గర్భం నుండే బిడ్డకు సరైన పోషకాహారాన్ని అందించాలి.
థైరాయిడ్ లక్షణాలు..
- పిల్లల శారీరక, మానసిక ఎదుగుదల తగ్గుతుంది
-పిల్లలు అలసిపోయినట్లు అనిపిస్తుంది
-త్వరగా అనారోగ్యానికి గురవుతారు
- పిల్లల చర్మం పొడిగా, నిర్జీవంగా కనిపిస్తుంది
ఎముకలు, జుట్టు, దంతాలు బలహీనమవుతాయి
-మలబద్ధకం, అజీర్ణం వంటి సమస్యలు తలెత్తుతాయి.
- ఊబకాయం సమస్య.
-థైరాయిడ్ గ్రంధి పరిమాణం పెరగడం.
-కళ్ల వాపు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా అనిపించడం.
నివారణ ఎలా..?
-మొదట పిల్లలలో థైరాయిడ్ లక్షణాలను గమనించిన వెంటనే తల్లిదండ్రులు ఖచ్చితంగా సంబంధిత వైద్యుడిని సంప్రదించాలి.
-హైపోథైరాయిడిజం ఉన్న పిల్లలకు, హార్మోన్ రీప్లేస్‌మెంట్ థెరపీ చికిత్స చేస్తారు. అంతే కాకుండా కొన్ని మందుల ద్వారా కూడా ఈ సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు.
-హైపర్ థైరాయిడిజంతో బాధపడుతున్న పిల్లల చికిత్స కోసం, మందులు, శస్త్రచికిత్సలు చేస్తారు.
-థైరాయిడ్ కారణంగా పిల్లల శారీరకంగానే కాకుండా మానసిక ఎదుగుదలపై కూడా ప్రభా వం చూపిస్తుంది.
-దీన్ని నివారించాలంటే సరైన వైద్యంతో పాటు పౌష్టికాహారంపై కూడా శ్రద్ధ పెట్టాలి.
-పుట్టుకతో వచ్చే థైరాయిడ్ వ్యాధిని గుర్తించేందుకు, పుట్టిన కొద్ది రోజుల్లోనే పిల్లల టీ.ఎస్.హెచ్ పరీక్ష చేయించాలి.
ఇది కూడా చదవండి..రక్తంలో ఆక్సిజన్ తగ్గినప్పుడు ఎలాంటి సమస్యలు వస్తాయి..?
నల్ల బియ్యం వల్ల కలిగే ప్రయోజనాలు..
ఫర్ హార్ట్ హెల్త్ : జిమ్‌కు వెళ్లినప్పుడు ఈ విషయాలను గుర్తుంచుకోండి.
ఆరోగ్యకరమైన బ్రేక్ ఫాస్ట్ ఎలా ఉండాలి..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
