డిస్లెక్సియా అంటే ఏమిటి..? లక్షణాలు..?  

షేర్ చేయండి:
డిస్లెక్సియా అంటే ఏమిటి..? లక్షణాలు..?  

సాక్షి లైఫ్ : డిస్లెక్సియా అనేది ఒక మానసిక వ్యాధి. ఈ వ్యాధి నేరుగా మెదడుపై ప్రభావం చూపిస్తుంది. అయితే చాలామందిలో ఇది పుట్టుకతో వచ్చే వ్యాధి. ముఖ్యంగా డిస్లెక్సియాలో వివిధ దశలు ఉన్నాయి. ప్రాథమిక దశలో బాధితులకు చదవడం, రాయడం రాదు. డిస్లెక్సియా బారీన పడినవారిలో చాలామంది కోలుకున్నారు. దీనిని నయం చేయడానికి ప్రస్తుతం అనేక రకాల థెరపీలు, ఇతర చికిత్సలు సైతం అందుబాటులో ఉన్నాయి. 


డిస్లెక్సియా అనేది పిల్లల్లో ఎక్కువగా కనిపించే మానసిక వ్యాధి. ఈ వ్యాధిలో, రోగి పదాలను చదవడం, రాయడం, మాట్లాడటం అలాగే వాటిని గుర్తుంచుకోవడంలో ఇబ్బందిని ఎదుర్కొంటారు. డైస్లెక్సియా ఏ వయసు వ్యక్తికైనా రావచ్చు. కొందరు పిల్లలు అక్షరాలను తిరగేసి రాస్తుంటారు. మరికొందరు తిరగేసి పలుకుతుంటారు. డిస్లెక్సియాతో ఎక్కువగా బాధపడుతున్నవారిలో పిల్లలే ఎక్కువగా ఉన్నారు.

ఇది కూడా చదవండి..లవ్ హార్మోన్ అంటే ఏమిటి..?

ఇది కూడా చదవండి..ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ అంటే ఏమిటి..?  

ఇది కూడా చదవండి..టాటూ వేయించుకున్న వాళ్లు రక్తదానంచేయకూడదా..? 

 

లెర్నింగ్ డిజెబిలిటీస్.. 

ప్రపంచ వ్యాప్తంగా ఉన్న చాలా మంది గొప్ప వ్యక్తులు సైతం చిన్నప్పుడు ఈ వ్యాధి బారిన పడినవారే. సరిగా రాయడం రాకపోవడాన్నిడిస్ గ్రాఫియా, చదవడం రాకపోవడాన్ని డిస్లెక్సియా అని, లెక్కలు చేయలేకపోవడాన్ని డిస్ కాలిక్లియా అని అంటారు. డిస్లెక్సియా సమస్య అనేది ప్రతి ఐదుగురిలో ఒకరికి వచ్చే అవకాశం ఉంటుందని డాక్టర్లు చెబుతున్నారు. ఇలాంటి వాటిని లెర్నింగ్ డిజెబిలిటీస్ అంటారు. అన్నివేళలా ఇలాంటి డిజార్డర్స్ ను వ్యాధులుగా పరిగణించలేమని వైద్యనిపుణులు చెబుతున్నారు. ఇలాంటి సమస్యలు జన్యుపరంగా కూడా వచ్చే అవకాశం ఉందని వారు అంటున్నారు. 

 

ఎంతోమంది మహాగొప్ప వ్యక్తులు..


అటువంటివారిలో టెలిఫోన్ ను కనుగొన్నఅలెగ్జాండర్ గ్రాహం బెల్, ప్రముఖ శాస్త్రవేత్త ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ కూడా డిస్లెక్సియాతో బాధపడ్డారు. ఇలాంటి ఎంతోమంది మహాగొప్ప వ్యక్తులు డిస్లెక్సియాను ఓడించి అనేక గొప్ప విజయాలను సాధించారు. భారతదేశంలో 3 కోట్ల మందికి పైగా పిల్లలు డిస్లెక్సియాతో బాధపడుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. డైస్లెక్సియా ఆధారంగా అనేక బాలీవుడ్, హాలీవుడ్ చిత్రాలు రూపొందించారు. 

 

ఇది కూడా చదవండి..కొలెస్ట్రాల్ ను తగ్గించే బెస్ట్ ఫుడ్..

ఇది కూడా చదవండి..శిరోజాల సంరక్షణలో అద్భుత ప్రయోజనాలు అందించే చిలగడదుంప..

ఇది కూడా చదవండి..బాణాసంచా కాల్చడం వల్ల ఎలాంటి వారిపై ఎక్కువగా ఎఫెక్ట్ కనిపిస్తుంది..?

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.