క్లాపింగ్ థెరపీ హెల్త్ బెనిఫిట్స్..?  

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : పొద్దున్నే చప్పట్లు కొట్టడం వల్ల అనేక శారీరక, మానసిక సమస్యలు తొలగిపోతాయని మీకు తెలుసా..? అవును.. ఒత్తిడి, డిప్రెషన్ నుంచి  దూరంగా ఉంచడమే కాకుండా సిరల్లో రక్త ప్రవాహాన్ని మెరుగుపరచడం ద్వారా అనేక ఇతర అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలను అందించే వ్యాయామంచప్పట్లు కొట్టడం. క్లాప్స్ కొట్టడం వల్ల ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చనేది ఇప్పుడు తెలుసుసుకుందాం..   

 ఇది కూడా చదవండి.. క్షయవ్యాధి ఏయే అవయవాలపై ప్రభావం చూపుతుంది..? 

 ఆరోగ్య ప్రయోజనాలు.. 

ఉదయాన్నే చప్పట్లు కొట్టడం వల్ల మానసిక ప్రశాంతత చేకూరి ఉత్సాహంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. చప్పట్లు కొట్టడం వల్ల శరీరంలోని అనేక ఎనర్జీ పాయింట్లపై ప్రభావం పడుతుంది. ఇది ఒక రకమైన చికిత్సగా పరిగణిస్తారు. దీని ద్వారా అనేక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించవచ్చని పరిశోధనలు చెబుతున్నాయి. చప్పట్లు కొట్టడం ద్వారా  శారీరక, మానసిక ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరచుకోవచ్చు.

మానసిక స్థితి.. 

మానసిక స్థితిని మెరుగుపరచడానికి చప్పట్లు కొట్టడం మంచిదని వైద్యనిపుణులు అంటున్నారు. చప్పట్లు కొట్టడం ద్వారా శరీరం, మనస్సు రెండింటిపైనా అనుకూల ప్రభావం పడుతుంది. తద్వారా రోజంతా ఉత్సాహంగా, ఉల్లాసంగా ఉండడానికి వీలవుతుంది. దీనివల్ల ఎనర్జీ పాయింట్లు కూడా యాక్టివేట్ అవుతాయి. ఇది వ్యాయామం లేదా యోగా వంటివి చేయడం ద్వారా కలిగే ప్రయోజనాలను అందిస్తుంది.

 ఇది కూడా చదవండి.. ఆరోగ్యంగా ఉన్నవాళ్లకు ప్రోటీన్ సప్లిమెంట్లు అవసరంలేదంటున్న వైద్యులు..  

 

 ఇది కూడా చదవండి.. యునాని వైద్యానికి అల్లోపతి వైద్యానికి ఏంటి లింక్..?

ఇలాంటి కచ్చితమైన ఆరోగ్య సమాచారాన్ని అనుభవజ్ఞులైన వైద్య నిపుణులు అందించే మరిన్ని విషయాలను గురించి మీరు తెలుసుకోవాలంటే సాక్షి లైఫ్ ను ఫాలో అవ్వండి.. 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి. 

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.