సాక్షి లైఫ్ : నేటి ఆధునిక జీవనశైలిలో మనిషికి అన్నీ అమరాయి.. కానీ 'మనశ్శాంతి' మాత్రం కరువవుతోంది. రంగుల ప్రపంచంలా కనిపించే సోషల్ మీడియా వెనుక, కార్పొరేట్ కొలువుల ఒత్తిడి మధ్య నేటి యువత నిశ్శబ్దంగా కుంగిపోతోంది. మానసిక వైద్య నిపుణుల విశ్లేషణ ప్రకారం.. యువతలో ఆందోళన (Anxiety), విషాదం (Depression) కేసులు మునుపెన్నడూ లేని విధంగా పెరుగుతున్నాయి. దీనికి ప్రధాన కారణాలు, లక్షణాలు, పరిష్కార మార్గాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
ఇది కూడా చదవండి..లవ్ హార్మోన్ అంటే ఏమిటి..?
ఇది కూడా చదవండి..The ‘3-F’ Formula for Digestive Health : గట్ హెల్త్ బాగుంటేనే సంపూర్ణ ఆరోగ్యం.. వైద్యనిపుణులు చెబుతున్న రహస్యాలివే!
ఇది కూడా చదవండి..ఆరోగ్యప్రయోజనాలు పొందాలంటే సలాడ్ ను ఏ టైమ్ లో తినాలి..?
మనశ్శాంతి లేకపోవడానికి కారణాలివే..
కార్పొరేట్ రంగంలో టార్గెట్లను అందుకోవాలనే తపన, ఎప్పుడు ఉద్యోగం ఊడుతుందోనన్న భయం యువతను మానసిక అలసటకు గురిచేస్తున్నాయి. దీనివల్ల 'బర్న్ అవుట్' (Burnout) సమస్య తలెత్తుతోంది. ఇంటర్నెట్‌లో ఇతరులు పెట్టే కొన్ని ఫోటోలను చూసి, మన జీవితాలను వారితో పోల్చుకోవడం పెద్ద తప్పు. ఈ పోలిక మనలో అసంతృప్తిని, న్యూనతా భావాన్ని (Inferiority Complex) పెంచుతుంది.
పట్టణీకరణ మనకు విలాసాలను ఇచ్చింది కానీ, మనుషుల మధ్య దూరాన్ని పెంచింది. ఉమ్మడి కుటుంబాలు కనుమరుగై, నాలుగు గోడల మధ్య ఒంటరితనం డిప్రెషన్‌కు రాజమార్గం అవుతోంది. అర్ధరాత్రి వరకు మొబైల్ స్క్రీన్లకు అతుక్కుపోవడం, సరైన నిద్ర లేకపోవడం మెదడు పనితీరుపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి.
ఈమార్పులు కనిపిస్తే వెంటనే అప్రమత్తం కావాలి.. కనీసం రెండు వారాలకు పైగా ఎడతెగని విచారం లేదా లోపల శూన్యత ఆవరించడం. చిన్న చిన్న విషయాలకే విపరీతమైన ఆందోళన చెందడం. మునుపు ఇష్టంగా చేసిన పనులపై ఆసక్తి తగ్గిపోవడం.నిద్రలేమి లేదా అతిగా నిద్రపోవడం. ఎప్పుడూ నీరసంగా, శక్తిహీనంగా అనిపించడం.
భయం వద్దు..!
మన దేశంలో మానసిక సమస్యను ఒక 'వ్యాధి'గా కాకుండా 'బలహీనత'గా చూడటం దురదృష్టకరం. 'నలుగురు ఏమనుకుంటారో' అన్న భయంతో చాలామంది చికిత్సకు దూరంగా ఉంటున్నారు. కానీ గుర్తుంచుకోండి.. శారీరక రోగం లాగే మానసిక సమస్య కూడా చికిత్సతో నయమవుతుంది.
పరిష్కార మార్గాలు..
ప్రతిరోజూ కనీసం 30 నిమిషాల వ్యాయామం లేదా యోగా చేయడం వల్ల శరీరంలో 'హ్యాపీ హార్మోన్లు' విడుదలవుతాయి. సోషల్ మీడియా వాడకాన్ని తగ్గించి, ప్రకృతితో సమయం గడపడం ద్వారా మెంటల్ హెల్తీ ను కాపాడుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.
ఆత్మీయులతో పంచుకోండి..మనసులోని బాధను కుటుంబ సభ్యులతోనో, ప్రాణ స్నేహితులతోనో పంచుకోవడం వల్ల సగం భారం తగ్గుతుంది. సమస్య తీవ్రంగా ఉంటే నిపుణులైన కౌన్సెలర్ లేదా సైకియాట్రిస్ట్‌ను సంప్రదించడానికి ఏమాత్రం సంకోచించకండి. మానసిక ఆరోగ్యం అనేది విలాసం కాదు.. అదొక అవసరం. సమస్యను గుర్తించి, సరైన సమయంలో కౌన్సెలింగ్ తీసుకుంటే హ్యాపీగా ఉండొచ్చు.
ఇది కూడా చదవండి..Ban Paraquat : ప్రాణాంతక గడ్డి మందు "పారాక్వాట్" ను నిషేధించాల్సిందే..! : వైద్య నిపుణులు
ఇది కూడా చదవండి..ఆరోగ్యప్రయోజనాలు పొందాలంటే సలాడ్ ను ఏ టైమ్ లో తినాలి..?
ఇది కూడా చదవండి.. క్షయవ్యాధి ఏయే అవయవాలపై ప్రభావం చూపుతుంది..?
ఇది కూడా చదవండి..మంచి కొలెస్ట్రాల్ ను పెంచే దానిమ్మ..
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
Tags :Please subscribe for more updates...!
గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.
Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034
040 2325 6000
life@sakshi.com
© News. All Rights Reserved. by sakshi.com