సాక్షి లైఫ్ : మంచి ఆహారం శారీరక ఆరోగ్యాన్నే కాకుండా మానసిక ఆరోగ్యంపై కూడా లోతైన ప్రభావాన్ని చూపుతుంది. ఇదే విషయాన్ని తాజా అధ్యయనం ఒకటి స్పష్టం చేసింది. కొన్నిరకాల ఆహార పదార్థాలు డిప్రెషన్‌కు కారణమవుతాయని తెలిపింది.
డిప్రెషన్ అండ్ డైట్..
ఇటీవలి ఒక అధ్యయనం ఆహారం, మానసిక ఆరోగ్యానికి మధ్య ఉన్న సంబంధాన్ని కనుక్కుంది. చక్కెర పానీయాలు, ప్రాసెస్ చేసిన మాంసాలు, శుద్ధి చేసిన కార్బోహైడ్రేట్లు అధికంగా ఉన్న ఆహారాలు వంటి ఇన్ఫ్లమేటరీ ఆహార పదార్థాలు ఫ్యాటీ లివర్ సమస్యకు కారణమవుతాయని, అంతేకాదు ఇది లివర్ వాపునకు దారితీస్తుందని ఈ పరిశోధనలో వెల్లడైంది. కాలేయంలో మంట, డిప్రెషన్ వంటి అనేక అనారోగ్య సమస్యలకు దారి తీస్తుంది. అయితే, ఫ్యాటీ లివర్ విషయంలో, కొవ్వు పేరుకుపోవడం వల్ల కాలేయం దెబ్బతింటుంది, దీనివల్ల మంట వస్తుంది.
ఆహారానికి - మానసిక ఆరోగ్యానికి కనెక్షన్..ఏంటి..?
సెరోటోనిన్ అనే హార్మోన్ మానసిక స్థితిని నియంత్రిస్తుంది. ముఖ్యంగా శరీరంలోని హార్మోన్లు మానసిక, శారీరక ఆరోగ్యం విషయంలో కీలక పాత్ర పోషిస్తాయి. మెదడుపై ఒత్తిడి పడినప్పుడు సెరోటోనిన్ హార్మోన్ తీవ్ర ప్రభావం చూపిస్తుంది. ఇది నిరాశకు దారితీస్తుంది.
మానసిక రుగ్మతలు..
ఈ విధంగా, ఆహారంలో ఇన్ఫ్లమేటరీ ఆహారాలను చేర్చడం వల్ల డిప్రెషన్ ప్రమాదాన్ని పెంచుతుంది. అదనంగా, ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు, విటమిన్ "బి", యాంటీఆక్సిడెంట్లు వంటి ముఖ్యమైన పోషకాలు లేని ఆహారం తీసుకోవడం వల్ల మెదడు పనితీరుపై ప్రభావం చూపుతుంది. తద్వారా మానసిక రుగ్మతలు తలెత్తే ప్రమాదం ఉందని పరిశోధకులు వెల్లడిస్తున్నారు.
అనారోగ్యకరమైన ఆహారం, ప్రాసెస్ చేసిన ఆహారాలు, ఫైబర్ లేకపోవడం గట్ బ్యాక్టీరియా, సమతుల్యతను దెబ్బతీస్తుందని, ఇది డైస్బియోసిస్ అనే పరిస్థితికి దారితీస్తుందని ఈ అధ్యయనం వెల్లడించింది. డిప్రెషన్, యాంగ్జయిటీ వంటి మూడ్ డిజార్డర్స్‌తో డైస్బియోసిస్ ముడిపడి ఉంటుందని ఇందులో తేలింది.
ముఖ్యంగా ఈ అధ్యయనంలో ఏది తిన్నా అది ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది లేదా మరింత దిగజార్చుతుందని స్పష్టమైంది. ఇది శారీరక ఆరోగ్యానికి మాత్రమే కాకుండా మానసిక ఆరోగ్యానికి కూడా వర్తిస్తుంది.
ఈ ఆహారాలు మిమ్మల్ని డిప్రెషన్ నుంచి కాపాడతాయి.
ఈ అధ్యయనం ఆధారంగా, మానసిక ఆరోగ్యానికి ఎలాంటి ఆహారం హానికరం ..? అది డిప్రెషన్‌కు ఎలా గురి చేస్తుందో తెలుసుకున్నాం కదా..! ఇప్పుడు డిప్రెషన్ ప్రమాదాన్ని తగ్గించే ఆహార పదార్థాల గురించి కూడా తెలుసుకుందాం. డిప్రెషన్ ప్రమాదాన్ని తగ్గించడానికి, ఈ కింది ఆహారాలను చేర్చుకోవల్సిఉంటుందని వైద్య నిపుణులు వెల్లడిస్తున్నారు.
పండు..
కూరగాయలు
బీన్స్
తృణధాన్యాలు
చేప
అధిక ఫైబర్ ఫుడ్స్..
ఇది కూడా చదవండి.. బ్రెయిన్ ఫుడ్ : బ్రెయిన్ హెల్త్ కోసం ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..
Please subscribe for more updates...!
గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.
Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034
040 2325 6000
life@sakshi.com
© News. All Rights Reserved. by sakshi.com