సాక్షి లైఫ్ : శారీరకంగా దృఢంగా ఉండటం ఎంత ముఖ్యమో, మానసికంగా దృఢంగా ఉండటం కూడా అంతే ముఖ్యం. మానసికంగా దృఢంగా ఉంటే ఎలాంటి క్లిష్ట పరిస్థితులనైనా సులభంగా ఎదుర్కోవచ్చు. ఒక వేళ మానసికంగా బలంగా లేకపోతే, జీవితంలో వచ్చే సమస్యలను పరిష్కరించుకోలేక ఎవరికీ చెప్పుకోలేక డిప్రెషన్ కు గురవ్వాల్సి వస్తుందని ప్రముఖ సైకాలజిస్టు హిప్నో పద్మాకమలాకర్ వెల్లడిస్తున్నారు. అసలు మానసికంగా మనం బలంగా ఉన్నామని చెప్పడానికి ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి. అవి ఏమిటి..? అనేది ఇప్పుడు తెలుసుకుందాం..
ఇది కూడా చదవండి..తాజా పరిశోధన : ఫ్యాటి లివర్ నివారణకు మందులతో పనిలేకుండా ఏం చేస్తే సరిపోతుంది..?
ఇది కూడా చదవండి..ఫ్లూ నుంచి రక్షించుకోవడానికి టీకాలు తప్పనిసరిగా తీసుకోవాలి..
ఇది కూడా చదవండి..విటమిన్ "డి" తగ్గిపోవడానికి ఆరు కారణాలు..
మానసిక బలాన్ని ఎలా గుర్తించాలి..?
ఒక వ్యక్తి మానసికంగా ఎంత బలంగా ఉన్నాడో కనుక్కోవడం అంత సులభం కాదు, దానిని కనుగొనడానికి ఎటువంటి కొలమానం లేదు. అయితే, వారి ప్రవర్తన, ఆలోచనలలో కొన్ని ప్రత్యేక లక్షణాలు ఉంటాయి. అవి వారిని ఇతరుల కంటే భిన్నంగా ఉండేలా చేస్తాయి. మానసికంగా బలమైన వ్యక్తులు సవాళ్లను ఎదుర్కోవడమే కాకుండా, భావోద్వేగాలను అర్థం చేసుకుని వాటిని సరైన దిశలో నడిపించే నైపుణ్యాన్ని కలిగి ఉంటారు.
భావోద్వేగాలను నియంత్రించే సామర్థ్యం..
మానసికంగా బలమైన వ్యక్తులు తమ భావోద్వేగాలను గుర్తిస్తారు. వాటిని ఎలా నియంత్రించాలో తెలుసుకుంటారు. వారు కోపం, భయం లేదా ఒత్తిడి కారణంగా పెద్దగా స్పందించకుండా ప్రశాంతంగా ఉంటారు. ఈ సామర్థ్యం క్లిష్ట పరిస్థితుల్లో కూడా సరైన నిర్ణయం తీసుకోవడానికి వారికి సహాయపడుతుంది.
వైఫల్యం నుంచి నేర్చుకోవడం..
మానసికంగా బలంగా ఉన్నవారు వైఫల్యాన్ని ఓటమిగా చూడరు. కానీ నేర్చుకునే అవకాశంగా చూస్తారు. వారు ఎక్కడ తప్పులు జరిగాయి..? వాటిని సరిచేసుకుంటూ.. తద్వారా ముందుకు సాగుతారు. ఈ సానుకూల ఆలోచనా విధానం నిరంతరం అభివృద్ధి చెందడానికి సహాయపడుతుంది.
మార్పును స్వీకరించడం..
జీవితంలో మార్పు సర్వసాధారణం, కానీ మానసికంగా బలమైన వ్యక్తులు దానిని భయంతో కాకుండా, ఛాలెంజ్ తో స్వీకరిస్తారు. వారు కొత్త పరిస్థితులకు అనుగుణంగా మారడానికి లేదా వాటి నుంచి నేర్చుకోవడానికి ప్రయత్నిస్తారు. ఇవన్నీ వారిని ఎలాంటి కష్టాన్ని అయినా ఎదుర్కోగల సామర్థ్యాన్ని కలిగిస్తాయి.
ఇతరుల అభిప్రాయాల ద్వారా ప్రభావితం కాకూడదు..
మానసికంగా బలంగా ఉన్న వ్యక్తులు ఇతరుల అభిప్రాయాలను మరీ అంతగా పరిగణలోకి తీసుకోరు. కానీ అనుకూలంగా ఉంటే అవి స్వీకరిస్తారు. తమ లక్ష్యాల కోసం తమ సొంత ఆలోచనా విధానాల పట్ల చాలా స్పష్టత కలిగి ఉంటారు. ఇతరుల ప్రతికూల వ్యాఖ్యలను అస్సలు పట్టించుకోరు.
ఆత్మవిశ్వాసం..
మానసికంగా బలంగా ఉన్నవారికి వారి బలహీనతలు, బలాలు బాగా తెలుసు. వారు తమపై నమ్మకాన్ని కలిగి ఉంటారు. కేవలం వారి సామర్థ్యాన్నే నమ్ముతారు. ఈ ఆత్మవిశ్వాసం వారిని ఎలాంటి సవాలునైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంచుతుంది.
అసూయపడ కూడదు..
మానసికంగా బలంగా ఉన్న వ్యక్తులు ఇతరుల విజయాలను చూసి అసూయపడరు.. ఆయా విజయాలను స్ఫూర్తిగా తీసుకుంటారు. ప్రతి ఒక్కరి ప్రయాణం భిన్నంగా ఉంటుందని, సొంత మార్గంపై దృష్టి పెట్టడం చాలా ముఖ్యమని గ్రహిస్తారు. ఈ ఆలోచన వారిని ప్రతికూలత నుంచి దూరంగా ఉంచుతుంది.
ఓపిక..
మానసికంగా బలమైన వ్యక్తులకు విజయం రాత్రికి రాత్రే జరగదని తెలుసు. వారు ఓపికగా ఉంటారు. విజయం కోసం నిరంతరం ప్రయత్నిస్తూనే ఉంటారు. మార్గం ఎంత కష్టతరమైనా, వారు వదులుకోరు. వారి లక్ష్యం వైపు వెళ్తూ ఉంటారు.
ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..?
ఇది కూడా చదవండి..వేగంగా బరువు తగ్గించే ఓట్జెంపిక్ డ్రింక్ ట్రెండ్.. డైటీషియన్లు ఏమంటున్నారంటే..?
ఇది కూడా చదవండి..మైక్రోసైటిక్ అనీమియా అంటే ఏమిటి..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..
Tags :Please subscribe for more updates...!
గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.
Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034
040 2325 6000
life@sakshi.com
© News. All Rights Reserved. by sakshi.com