విటమిన్ "డి" తగ్గిపోవడానికి ఆరు కారణాలు.. 

సాక్షి లైఫ్ : శరీరానికి అవసరమైన విటమిన్-డి అందకపోతే ఎముకల బలహీనత, ఇమ్యూనిటీ తగ్గడం, అలసట వంటి అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి. కొన్ని మందులు, అనారోగ్యకరమైన అలవాట్లు కారణంగా సప్లిమెంట్స్ తీసుకున్నా విటమిన్-డి స్థాయి పెరగకపోవచ్చు.

 

ఇది కూడా చదవండి..టాటూ వేయించుకున్న వాళ్లు రక్తదానంచేయకూడదా..?

ఇది కూడా చదవండి..ఓరల్ క్యాన్సర్ కు కారణాలు..? 

ఇది కూడా చదవండి..సహజంగా ఆక్సిటోసిన్ పెంచడానికి మార్గాలు.. 

 

  పేగు శోషణ సమస్యలు (Gut Absorption Issues).. 

 కొంతమందిలో పేగు శోషణ సమస్యలు (ఇర్రిటేబుల్ బౌల్ సిండ్రోమ్) ఐ బీఎస్ ఉన్నట్లయితే శరీరం విటమిన్-డి సరిగ్గా గ్రహించలేదు. ఐబీఎస్ కూడా విటమిన్-డి లెవల్స్ తగ్గడానికి ప్రధాన కారణం.

 సూర్యకాంతి కొరత (Lack of Sunlight Exposure)..  

 ఐటీ ఉద్యోగులు, ఇంట్లో ఎక్కువగా ఉండేవారికి సూర్యకాంతి తక్కువగా  ఉంటుంది. రోజూ కనీసం 20 నుంచి 30 నిమిషాలు ఉదయం 8 ఎనిమిది గంటల నుంచి 10 గంటల లోపల సూర్యరశ్మి లో ఉండాలి. తద్వారా కొంతమేర ఆయా సమస్య నుంచి బయట పడొచ్చు. 

మూత్రపిండాలు, కాలేయ సంబంధిత సమస్యలు (Liver & Kidney Issues)..
  లివర్ ఫ్యాటీ లేదా కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్నవారిలో విటమిన్-డి లెవల్స్ తక్కువగా ఉంటాయి.

 కొన్ని మందుల ప్రభావం (Effect of Certain Medications).. 


 స్టెరాయిడ్లు, బరువు తగ్గించే మందులు, చక్కెర, గుండె సమస్యల మందులు విటమిన్-డి గ్రహణ శక్తిని తగ్గిస్తాయి. పలు రకాల మందులు ఎక్కువ కాలం వాడే వారిలో విటమిన్-డి డెఫిషియెన్సీ ఎక్కువగా ఉంటుంది.

 తగినంత మెగ్నీషియం లేకపోవడం (Magnesium Deficiency).. 

 శరీరం విటమిన్-డి ని యాక్టివ్ చేయాలంటే మెగ్నీషియం అవసరం. ఇది తగినంతగా లేకపోతే "డి" విటమిన్ తగ్గుతుంది.  

 అధిక బరువు (Obesity & Fat Storage Issues).. 

 అధిక బరువు ఉన్నవారిలో విటమిన్-డి కొవ్వు కణాల్లో నిల్వ అవుతుంది. శరీరానికి సరిగ్గా అందదు. బరువు తగ్గించుకోవడం వల్ల విటమిన్ "డి" మెరుగవుతుంది.

 

ఇది కూడా చదవండి..మానసిక ప్రశాంతతనిచ్చే సంగీతం..

ఇది కూడా చదవండి.. మైక్రోసైటిక్ అనీమియా అంటే ఏమిటి..?  

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..

Tags : vitamin-d vitamins d-vitamin vitamin-d-levels-test vitamin-d-deficiency vitamin-d-deficiency-symptoms vitamin-deficiency vitamin-d-deficiency-causes vitamin-d-deficiency-treatment vitamin-d-deficiency-signs vitamin-d-deficiency-and-depression vitamin-d3 vitamin-d-benefits vitamin-deficiency-symptoms vitamins-for-skin vitamins-for-men what-are-vitamins vitamin
Newsletter

Please subscribe for more updates...!

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.

Get In Touch

Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034

040 2325 6000

life@sakshi.com

Follow Us

© News. All Rights Reserved. by sakshi.com