ఫ్లూ నుంచి రక్షించుకోవడానికి టీకాలు తప్పనిసరిగా తీసుకోవాలి..
సాక్షి లైఫ్ : ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం ఫ్లూ లక్షలాది మందిని ప్రభావితం చేస్తూ, వారి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఏటా వన్ బిలియన్ ఫ్లూ కేసులలో, 3 నుంచి 5 మిలియన్ల కేసులు తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. దీని వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తడమేకాకుండా రోజువారీ పనులను ప్రభావితం చేస్తుంది. ఈ వ్యాధి నుంచి రక్షించుకోవడానికి టీకాలు తీసుకోవడం అత్యంత ప్రభావవంతమైన మార్గమని వైద్యనిపుణులు చెబుతున్నారు. అవగాహన లోపం, అపోహల కారణంగా చాలా మంది ఫ్లూ టీకాలు తీసుకోవడం లేదు.
ఇది కూడా చదవండి.. గుండె నొప్పిని ఎలా గుర్తించవచ్చు..?
ఇది కూడా చదవండి..చెడు కొలెస్ట్రాల్ ను నియంత్రించే పనస పండు..
అబోట్ ఇండియా మెడికల్ డైరెక్టర్ డా. జెజో కరంకుమార్ .. "ఫ్లూ పనిలో ఉత్పాదకతను తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. ఇప్పటికే దేశం మొత్తం అనేక వైరస్‌లు, బాక్టీరియా వంటి సంక్షోభాల మధ్య ఉన్నప్పుడు, ఫ్లూ టీకాను తీసుకోవాలి. టీకాలు తీసుకోవడం ద్వారా శరీరానికి రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అలాగే ఫ్లూ వ్యాప్తి వల్ల కలిగే ఆర్థిక,సామాజిక ప్రభావాలను తగ్గించవచ్చు." అని అన్నారు.
భారతదేశంలో ఫ్లూ టీకాలను తీసుకోవడం ఇంకా ప్రారంభ దశలో ఉన్నప్పటికీ, ప్రజలకు వీటిపై అవగాహన కల్పించడం ద్వారా మరిన్ని ప్రయోజనాలు అందించవచ్చు.
ఇన్ఫెక్షియస్ డిసీజ్ స్పెషలిస్ట్ డాక్టర్ పి. విష్ణురావు మాట్లాడుతూ.. "ఫ్లూ టీకాలు తీసుకోవడం ఫ్లూ నుంచి రక్షించుకోవడానికి అత్యంత ప్రభావవంతమైన మార్గం. ఈ టీకాలు ప్రతి సంవత్సరం ప్రపంచ ఆరోగ్య సంస్థ వార్షికంగా వీటిని అప్‌డేట్ చేస్తూ, వాటిని సమర్థవంతంగా రూపొందిస్తుంది. ఫ్లూ టీకా సురక్షితమైనది. ప్రతి సంవత్సరం ఒకసారి తీసుకోవడం ద్వారా, ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు." అని తెలిపారు.
ఇది కూడా చదవండి.. ప్రీమెన్ స్ట్రువల్ సిండ్రోమ్ వచ్చేముందు లక్షణాలు ఎలా ఉంటాయి..?
ఇది కూడా చదవండి.. శరీరంలో ప్లేట్‌లెట్స్ కౌంట్ ఎంత ఉండాలి..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
