Sleep Disorders : ఇండియాలో "సైలెంట్ ఎపిడెమిక్’గా మారుతున్న నిద్ర రుగ్మతలు..!
సాక్షి లైఫ్ : నేటి ఆధునిక జీవనశైలిలో నిద్ర అనేది ఒక విలాసంగా మారిపోతోంది. రక్తపోటు, మధుమేహం వంటి పరీక్షలు చేయించుకునే మనం.. 'రాత్రి సరిగ్గా నిద్రపోతున్నామా..?' అనే విషయాన్ని మాత్రం విస్మరిస్తున్నాం. మార్చి 13న 'ప్రపంచ నిద్ర దినోత్సవం' (World Sleep Day) సందర్భంగా వైద్య నిపుణులు వెల్లడించిన గణాంకాలు భారతీయుల ఆరోగ్య స్థితిగతులపై ఆందోళన కలిగిస్తున్నాయి. దేశంలో లక్షలాది మంది నిద్ర రుగ్మతలతో బాధపడుతున్నారని, ఇది గుండె జబ్బులు, మధుమేహం, డిప్రెషన్‌కు దారితీస్తోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఇది కూడా చదవండి..సిండ్రోమ్ Xకు ప్రారంభ దశలో ఎలాంటి చికిత్సను అందిస్తారు..?
ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..?
ఇది కూడా చదవండి..మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..?
నిద్రలేమి.. సైలెంట్ ఎపిడెమిక్..
ఇండియన్ జర్నల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ నిర్వహించిన తాజా అధ్యయనం ప్రకారం.. భారతీయుల్లో నిద్ర సమస్యలు తీవ్రరూపం దాల్చుతున్నాయి.
25.7 శాతం మంది నిద్రలేమి(Insomnia) సమస్యతో సతమతమవు తున్నారు. సుమారు 37.4 శాతం మందిలో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయి. 10.6 శాతం మంది ఈ రుగ్మత బారిన పడ్డారు.
వైద్య సహాయం పొందడానికి బదులు 62 శాతం మంది ఆన్‌లైన్ చిట్కాలపై ఆధారపడుతుండటం గమనార్హం.
హైదరాబాద్ ఐటీ నిపుణుల్లో తీవ్ర ప్రభావం..
హైదరాబాద్ లాంటి నగరాల్లో ఈ పరిస్థితి మరింత దారుణంగా ఉంది. ఐటీ నిపుణులపై నిర్వహించిన సర్వేలో 97 శాతం మంది పడుకునే ముందు కనీసం గంటపాటు ఎలక్ట్రానిక్ పరికరాలను వాడుతున్నారని తేలింది. దీనివల్ల నిద్ర పట్టకపోవడం లేదా మధ్యలో మెలకువ రావడం వంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు.
వయస్సు, నిద్ర అవసరమైన సమయం..
నిద్ర అనేది కేవలం విశ్రాంతి మాత్రమే కాదు, మెదడు, శరీర విధులను పునరుద్ధరించే కీలక ప్రక్రియ అని వైద్యనిపుణులు చెబుతున్నారు.
18 నుంచి 45 ఏళ్ల వయస్సు వాళ్లకు 6 నుంచి 8 గంటల నిద్ర తప్పనిసరి.
45 నుంచి 70 ఏళ్ల వయస్సువాళ్లకు 5 నుంచి 7 గంటల నిద్ర అవసరం.
70 ఏళ్లు పైబడిన వారికి కనీసం 5 గంటల నిద్ర అవసరం ఉంటుంది.
రోడ్డు ప్రమాదాలకు కారణం..
నిద్రలేమి కేవలం వ్యక్తిగత ఆరోగ్యానికే కాదు, ప్రజా భద్రతకు కూడా ముప్పుగా మారుతోంది. ఆగ్రా-లక్నో ఎక్స్‌ప్రెస్‌వేపై జరుగుతున్న ప్రమాదాల్లో 40 శాతం డ్రైవర్ల అలసట,నిద్రలేమి వల్లే జరుగుతున్నాయని సెంట్రల్ రోడ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ అధ్యయనంలో తేలింది. ఇతర దేశాల్లో మాదిరిగా డ్రైవర్లకు నిద్ర రుగ్మతల స్క్రీనింగ్‌ను భారత్‌లోనూ తప్పనిసరి చేయాల్సిన అవసరం ఉందని వైద్యనిపుణులు అభిప్రాయపడుతున్నారు.
నిద్ర సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా నివారణ ఆరోగ్య సంరక్షణలో భాగంగా గుర్తించాలి. క్రమబద్ధమైన సమయపాలన, నిద్రకు ముందు గ్యాడ్జెట్లకు దూరంగా ఉండటం ద్వారా అనేక దీర్ఘకాలిక వ్యాధులను దూరం చేసుకోవచ్చని వైద్యులు సూచిస్తున్నారు.
ఇది కూడా చదవండి..నోటి దుర్వాసనను తగ్గించే చిట్కాలు
ఇది కూడా చదవండి..ఒత్తిడిని ఫుడ్ చేంజెస్ చేయడం ద్వారా తగ్గించవచ్చా..?
ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..
