Online Shopping Addiction : ఆన్‌లైన్ షాపింగ్ వ్యసనం వెనుక దాగి ఉన్న సీక్రెట్ సైకాలజీ ఏం చెబుతోంది..?

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : ఈరోజుల్లో మార్కెట్‌కు వెళ్లి వస్తువులు కొనుగోలు చేయడం కంటే, చాలామంది ఆన్‌లైన్ షాపింగ్‌కే మొగ్గు చూపుతున్నారు. కిరాణా సామాను నుంచి బట్టలు, గాడ్జెట్‌ల వరకు ప్రతిదీ ఇప్పుడు ఒక్క క్లిక్‌తో ఇంటికే వచ్చేస్తోంది. ఆకర్షణీయమైన డిస్కౌంట్లు, కావలసిన వస్తువు సకాలంలో ఇంటికే డెలివరీ కావడం వంటి సౌకర్యాల వల్ల ఆన్‌లైన్ షాపింగ్‌కు ప్రజాదరణ రోజురోజుకూ పెరుగుతోంది. అయితే, ఎలాంటి అవసరం లేకపోయినా ప్రతిరోజూ ఏదో ఒకటి ఆన్‌లైన్‌లో కొనుగోలు చేసే వారి సంఖ్య కూడా అంతే వేగంగా పెరుగుతోంది. అవసరం కోసం కాకుండా, కేవలం కొనాలనే బలమైన కోరికతో చేసే ఈ ప్రవర్తన వెనుక ఉన్న మానసిక కారణాలను నిపుణులు విశ్లేషిస్తున్నారు.

 

ఇది కూడా చదవండి..కాలేయ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారా..? మౌనంగా పెరుగుతున్న ఈ వ్యాధి గురించి తెలుసా..?

ఇది కూడా చదవండి..లవ్ హార్మోన్ అంటే ఏమిటి..?

ఇది కూడా చదవండి..మందులతో పని లేకుండా బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గేదెలా..?

 

ట్రెండ్ మాయలో పడిపోతున్నారా..?

మనస్తత్వశాస్త్రం ప్రకారం..ఆన్‌లైన్ షాపింగ్‌కు తీవ్రంగా అలవాటు పడిన వ్యక్తులు కొత్త గాడ్జెట్‌లు, ట్రెండీ దుస్తులు, సౌందర్య ఉత్పత్తులు (cosmetics) వంటి వాటిపై ప్రత్యేక ఆసక్తి కనబరుస్తారు. మార్కెట్‌లో వచ్చే ప్రతి కొత్త ట్రెండ్‌కు వీరు త్వరగా ఆకర్షితులవుతారు. ఆ ట్రెండ్‌లో భాగంగా వచ్చే వస్తువుల్లో సగానికిపైగా అవసరం లేకపోయినా కొనేస్తుంటారు.

మెదడులో 'ఫీల్ గుడ్' రసాయనం.. 

ఈ ప్రవర్తనకు కారణం మెదడులో విడుదలయ్యే ఒక రసాయనం అని పరిశోధకులు చెబుతున్నారు.

డోపమైన్ కిక్..

ఒక వ్యక్తి తనకు నచ్చిన వస్తువును చూసినప్పుడు లేదా కొనుగోలు ప్రక్రియను ప్రారంభించినప్పుడు మెదడులో 'డోపమైన్' (Dopamine) అనే రసాయనం విడుదలవుతుంది. దీన్నే 'ఫీల్ గుడ్ హార్మోన్' అని పిలుస్తారు.

నిరీక్షణలో ఆనందం..  

ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసిన క్షణం నుంచి, ఆ పార్శిల్ చేతికి అందే వరకు ఉండే నిరీక్షణలో మెదడు అత్యధికంగా డోపమైన్‌ను ఉత్పత్తి చేస్తుంది. కేవలం వస్తువును ఉపయోగించడం కంటే, ఆ వస్తువును ఆర్డర్ చేయడం, బాక్స్ ఓపెన్ చేయడంలోనే ప్రజలు ఎక్కువ ఆనందం అనుభవించడానికి ఇదే ప్రధాన కారణమని పరిశోధనలు వెల్లడిస్తున్నాయి.

ఒత్తిడికి తాత్కాలిక విరుగుడుగా..

ఈ డోపమైన్ ప్రభావం వల్లే కొందరు పదే పదే షాపింగ్ చేయాలనే తీవ్రమైన కోరికను (Urge) అనుభవిస్తారు. నిత్య జీవితంలో ఒత్తిడి, ఆందోళన, ఒంటరితనం లేదా బోర్‌గా అనిపించినప్పుడు మానసిక స్థితిని (Mood) మార్చుకోవడానికి చాలామంది ఆన్‌లైన్ షాపింగ్‌ను ఒక సులువైన మార్గంగా ఎంచుకుంటున్నారు. దీనివల్ల తాత్కాలికంగా ఆనందం లభించినప్పటికీ, క్రమంగా ఇది ఒక వ్యసనంగా (Compulsive Shopping) మారే ప్రమాదం ఉందని మానసిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.

నియంత్రణ ఎలా అంటే..?

ఆన్‌లైన్ షాపింగ్ అనేది కేవలం ఒక సౌకర్యం మాత్రమే కాదు, అది మెదడులోని రసాయనిక ప్రక్రియలతో ముడిపడి ఉన్న అలవాటు. దీనిని నియంత్రించుకోవడానికి కొన్ని సులువైన మార్గాలు..

24 గంటల నియమం..

ఏదైనా వస్తువు కొనాలనిపిస్తే వెంటనే 'బై నౌ' (Buy Now) కొట్టకుండా, దానిని 'కార్ట్' (Cart) లో వేసి 24 గంటలు ఆగండి. ఆ తర్వాత కూడా అది అవసరం అనిపిస్తేనే కొనండి.

నోటిఫికేషన్లు ఆఫ్ చేయండి..

షాపింగ్ యాప్స్ పంపే ఆఫర్ల నోటిఫికేషన్లను నిలిపివేయడం ద్వారా అనవసర ఆకర్షణలకు దూరంగా ఉండవచ్చు.

క్రెడిట్ కార్డ్ వివరాలు సేవ్ చేయొద్దు..

యాప్స్‌లో పేమెంట్ వివరాలను సేవ్ చేయకుండా ఉంచితే, ప్రతిసారీ వివరాలు ఎంటర్ చేసే లోపు కొనే ఆలోచన మారే అవకాశం ఉంటుంది. అనవసర కొనుగోళ్ల వల్ల ఆర్థిక ఇబ్బందులతో పాటు మానసిక ఒత్తిడి కూడా పెరుగుతుంది. కాబట్టి మన షాపింగ్ అలవాట్లను ఎప్పటికప్పుడు గమనించుకుంటూ, వివేకంతో వ్యవహరించడం ఆరోగ్యానికి, జేబుకూ ఎంతో మేలు.!

 

ఇది కూడా చదవండి..Don’t Ignore Fever : సాధారణ జ్వరమే కదా అని నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలకే ముప్పు..! ఈ 5 లక్షణాలపై అవగాహన అవసరం.. 

ఇది కూడా చదవండి..రోజూ బెల్లం తింటే బరువు పెరుగుతారా..? 

ఇది కూడా చదవండి..ఆరోగ్యప్రయోజనాలు పొందాలంటే సలాడ్ ను ఏ టైమ్ లో తినాలి..?

 ఇది కూడా చదవండి..లవ్ హార్మోన్ అంటే ఏమిటి..?

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.