ఒత్తిడి, ఆందోళనను తగ్గించడంలో ఈ పదార్థానిది కీలక పాత్ర..
సాక్షి లైఫ్ : పనీర్ శరీర పెరుగుదలకు సహాయపడే ఆరోగ్యకరమైన ఆహారం. రోగనిరోధక శక్తిని పెంచడంలో అత్యంత కీలకంగా పనిచేస్తుంది. పనీర్‌లో ఉండే విటమిన్ "బి" వృద్ధాప్య చర్మం వల్ల వచ్చే ముడతలను తగ్గించడానికి ,జుట్టు పెరుగుదలకు ఎంతోబాగా ఉపయోగపడుతుంది. తక్కువ కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు అధికంగా ఉండే పనీర్ బరువు తగ్గాలనుకునే వారికి మంచి ఆహారం. అనారోగ్యకరమైన చిరుతిళ్లు తినే అలవాటును నివారించడంలో పనీర్ ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఇది ఎక్కువసేపు కడుపు నిండుగా ఉన్నట్లుగా అనిపిస్తుంది.
ఇది కూడా చదవండి.. గోరువెచ్చని నీళ్లు తాగితే వెయిట్ లాస్ అవుతారా..? నిజమేనా..?
ఇది కూడా చదవండి.. పనీర్ తినడం వల్ల ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలున్నాయో తెలుసా..?
ఇది కూడా చదవండి.. అవకాడోతో కలిపి తినకూడని ఆహారపదార్థాలు ఏమిటి..?
రక్తంలో చక్కెర..
పనీర్‌లో ట్రిప్టోఫాన్ అనే అమినో యాసిడ్ ఉంటుంది. ఇది ఇన్సులిన్ ఉత్పత్తికి ఉపకరిస్తుంది. రక్తంలో చక్కెర అకస్మాత్తుగా పెరగకుండా నిరోధించడంలో కూడా ఇది ఉపయోగపడుతుంది. పనీర్‌లో ఉండే అధిక స్థాయి జింక్ రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది. ఇది జలుబు, ఫ్లూ, ఇన్ఫెక్షన్ల ప్రమాదాన్ని తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. ముఖ్యంగా అనారోగ్యంగా ఉన్నప్పుడు పనీర్‌లోని ప్రోటీన్ శరీరానికి శక్తినిస్తుంది.
నాడీ వ్యవస్థ పనితీరు..
మెదడు ఆరోగ్యానికి అవసరమైన విటమిన్ బి12 పనీర్‌లో పుష్కలంగా ఉంటుంది. విటమిన్ B12 నాడీ వ్యవస్థ సరైన పనితీరులో సహాయపడుతుంది. జ్ఞాపకశక్తి సామర్థ్యాలను ప్రభావితం చేసే సమస్యలను కూడా నివారిస్తుంది. శాకాహారులలో విటమిన్ బి12 లోపం తరచుగా కనిపిస్తుంది. కాబట్టి అటువంటివారు తమ డైట్‌లో పనీర్‌ను చేర్చుకోవడం వల్ల దీనికి పరిష్కారం లభిస్తుంది. పనీర్‌లోని ట్రిప్టోఫాన్ న్యూరోట్రాన్స్‌మిటర్ సెరోటోనిన్ ఉత్పత్తిని కూడా ప్రేరేపిస్తుంది. ఇది ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి, మానసిక స్థితిని మెరుగుపరచడానికి ఉపయోగపడుతుంది.
ఇది కూడా చదవండి..క్షయవ్యాధి ఏయే అవయవాలపై ప్రభావం చూపుతుంది..?
ఇది కూడా చదవండి..డయాబెటీస్ కు ప్రధాన కారణాలు ఏంటి..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
