నిద్ర నాణ్యతను మెరుగుపరుచుకోవాలంటే.. ఏమిచేయాలి..?
సాక్షి లైఫ్ : హెల్తీగా ఉండాలంటే మనిషికి పోషకాహారంతోపాటు అత్యంతగా అవసరమైంది నిద్ర. ఆరోగ్యంగా ఉంచడంలో నిద్ర పాత్ర చాలా కీలకమైంది. ముఖ్యంగా ఆరోగ్యకరమైన శరీరానికి, మంచి ఆహారపు అలవాట్లు, శారీరక శ్రమ మాత్రమే కాదు. 7 నుంచి 8 గంటల నిద్ర తప్పనిసరి అని అనేక పరిశోధనలు వెల్లడిస్తున్నాయి.
ఇది కూడా చదవండి.. హైపోథైరాయిడిజం-హైపర్ థైరాయిడిజం..?
నాణ్యమైననిద్ర మానసికంగా, శారీరకంగా హెల్తీగా ఉంచుతుంది. అయితే బిజీ లైఫ్‌స్టైల్, అనారోగ్యకరమైన ఆహారం, గాడ్జెట్‌ల వాడకం, పడకగదిలో ఉండే కాలుష్యం వంటి అనేక ఇతర అంశాలు నిద్రకు ఆటంకంగా మారుతున్నాయి. దీంతో నిద్రలేమి సమస్యలు తలెత్తి పలురకాల అనారోగ్య సమస్యల బారీన పడుతున్నారు. నిద్ర నాణ్యతను ఎలా మెరుగుపరచుకోవచ్చు..? అందుకోసం ఏమేం చేయాలి అనేది ఇప్పుడు తెలుసుకుందాం..
పరిశుభ్రత తప్పనిసరి..
బెడ్ షీట్లు, పిల్లోస్, బ్లాంకెట్స్ ను కనీసం 140 డిగ్రీల ఫారెన్‌హీట్ వేడి నీటిలో ఉతకాలి. ఇలా చేస్తే అలర్జీ కారకాలు చాలా వరకు తొలగిపోతాయి. అలాగే, ప్రతి నెలా కాకుండా ప్రతి వారం బెడ్‌రూమ్ బెడ్‌షీట్‌లు , పిల్లో కవర్‌లను శుభ్రం చేయడం అలవాటు చేసుకోండి. తద్వారా అలెర్జీ కారకాలకు దూరంగా ఉండవచ్చు. హాయిగా నిద్ర పోవచ్చు.
దుమ్ము, దూళి..
దుమ్ము కణాలు చాలా చిన్నవిగా ఉంటాయి. పరుపులోకి లోతుగా వెళ్లి ఫైబర్‌లకు అంటుకుంటాయి. దీని కారణంగా వాటిని తొలగించడం చాలా కష్టమవుతుంది. కాబట్టి బెడ్ రూమ్ ను డీప్ క్లీనింగ్ చేయడానికి వాక్యూమ్ క్లీనింగ్ ఉత్తమమైన ఎంపిక. నిద్రించే గదిలో దుమ్మును సులభంగా శుభ్రం చేయడానికి వాక్యూమ్ క్లీనింగ్ చాలాబాగా ఉపయోగపడుతుంది.
వాక్యూమ్ క్లీనర్..
బెడ్ షీట్లు, దిండ్లు, పరుపులు శుభ్రం చేయడంతోపాటు, మంచం మూలలు ,పగుళ్లను విస్మరించవద్దు. ఎందుకంటే అలెర్జీలకు కారణమయ్యే దుమ్ము పురుగులు అలాంటి ప్రదేశాల్లోనే ఎక్కువగా ఉంటాయి. వాటిని శుభ్రపరచడానికి వాక్యూమ్ క్లీనర్ ఉత్తమమైంది. దీనికి బదులు మీరు తడి గుడ్డను కూడా ఉపయోగించవచ్చు.
ఇలాంటి కచ్చితమైన ఆరోగ్య సమాచారాన్ని అనుభవజ్ఞులైన వైద్య నిపుణులు అందించే మరిన్ని విషయాలను గురించి మీరు తెలుసుకోవాలంటే సాక్షి లైఫ్ ను ఫాలో అవ్వండి..
ఇది కూడా చదవండి.. టెలి మనస్ కు అనూహ్య స్పందన 1 మిలియన్ దాటిన కాల్స్..
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
