హైపోథైరాయిడిజం-హైపర్ థైరాయిడిజం..?

షేర్ చేయండి:
హైపోథైరాయిడిజం-హైపర్ థైరాయిడిజం..?

సాక్షి లైఫ్ : హైపోథైరాయిడిజమ్‌ వల్ల గుండె రక్తాన్ని సరఫరా చేసే శక్తి తగ్గుతుందని పరిశోధనలు చెబుతున్నాయి. అంతేకాదు.. కొలెస్ట్రాల్‌, రక్తపోటును కూడా పెంచుతుంది. గుండె కొట్టుకునే వేగం తగ్గిపోవడం, రక్తనాళాల సాగే లక్షణం తగ్గుతుంది. ఫలితంగా శరీరం మొత్తానికి రక్తాన్ని సరఫరా చేసేందుకు గుండెపై భారం ఎక్కువ పడి రక్తపోటు పెరుగుతుంది.

ఇది కూడా చదవండి.. గుండెకు హైపర్‌ థైరాయిడిజమ్‌ కు మధ్య లింక్ ఏంటి..?  

కొలెస్ట్రాల్‌ ఎక్కువ కావడం వల్ల రక్తనాళాలు సన్నబడిపోతాయి. హైపర్‌ థైరాయిడిజమ్‌ ఉంటే గుండె వేగంగా కొట్టుకుంటుంది. తద్వారా గుండె పనిచేయకుండా ఆగిపోయే ‍ప్రమాదం ఎక్కువ అవుతుంది. రక్త నాళాల గోడలపై గార లాంటి పదార్థం పేరుకుపోయే సమస్యను పెంచుతుంది, ఈ గార లాంటి పదార్థం రక్తనాళాలలో గడ్డ కట్టడం వల్ల రక్త ప్రసరణలో అవరోధం ఏర్పడుతుంది.


హైపర్ థైరాయిడిజం లక్షణాలు.. 

బరువు తగ్గడం
ఆకలి ఎక్కువగా అనిపించడం
హార్ట్ అరిథ్మియా (గుండె కొట్టుకునే వేగంలో మార్పులు)
అధికంగా చెమట పట్టడం
క్రమరహిత రుతుస్రావం
కండరాల బలహీనత
నిద్ర లేమి 

హైపోథైరాయిడిజం లక్షణాలు.. 

బరువు పెరుగుతోంది
ఆయాసం. 
చల్లగా అనిపిస్తుంది
జ్ఞాపకశక్తి తగ్గుతుంది
హార్ట్ రేట్ తగ్గుతుంది
కండరాల నొప్పి
కండరాలు బలహీన పడతాయి.. 

థైరాయిడ్‌ సమస్యను ఎలా గుర్తించాలంటే..


-తల కొంచెం వెనక్కు వాల్చి గ్లాసులోని నీళ్లు గుటక వేయండి.
-గుటక పడే సమయంలో థైరాయిడ్‌ గ్రంధి ఉన్న ప్రాంతాన్ని అద్దంలో గమనించండి.
-బయటకు పొడచుకువచ్చినట్లు, వాపులాంటివి ఏవైనా కనిపిస్తే వైద్యులను సంప్రదించండి.
-థైరాయిడ్‌ గ్రంధి వాపు సమస్య మీకు ఉండే అవకాశం ఉంది. వైద్యులు మరిన్ని పరీక్షలు చేసి ధ్రువీకరిస్తారు.
-గ్లాసెడు నీళ్లు... చేత్లో పట్టుకోగల ఒక అద్దం దగ్గరుంచుకోండి.
-గొంతు కింది భాగంపై దృష్టి పెట్టండి. స్వరపేటికకు దిగువన, మన కాలర్‌బోన్‌కు పై భాగంలో థైరాయిడ్‌ గ్రంధి ఉంటుంది.

 ఇది కూడా చదవండి.. దీర్ఘకాలిక వ్యాధులు రాకుండాఉండాలంటే..? ఏమి చేయాలి..?

ఇలాంటి కచ్చితమైన ఆరోగ్య సమాచారాన్ని అనుభవజ్ఞులైన వైద్య నిపుణులు అందించే మరిన్ని విషయాలను గురించి మీరు తెలుసుకోవాలంటే సాక్షి లైఫ్ ను ఫాలో అవ్వండి..  

ఇది కూడా చదవండి.. నోటి దుర్వాసనను తగ్గించే చిట్కాలు 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.