Exercise : ఒత్తిడి, అలసటతో వ్యాయామం చేయలేకపోతున్నారా..? చురుగ్గా ఉండేందుకు ఈ సులభమైన మార్గాలు పాటించండి..!

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : ఆఫీసు పని ఒత్తిడి, ఇంటి బాధ్యతలు, నిత్యం ఉరుకులు పరుగుల జీవితం వల్ల శరీరం, మనసు బాగా అలసిపోతుంటాయి. ఇలాంటి సమయాల్లో రోజువారీ వ్యాయామం (workout) చేయడం చాలా కష్టంగా అనిపిస్తుంది. అయితే, వ్యాయామాన్ని పూర్తిగా పక్కన పెట్టేయకుండా, మీ దినచర్యలో చిన్నచిన్న మార్పులు చేసుకోవడం ద్వారా శరీరాన్ని చురుగ్గా ఉంచుకోవడంతో పాటు మనసుకు ప్రశాంతతను అందించవచ్చు.

ఒత్తిడి సమయాల్లో వ్యాయామ తీరు ఎందుకు మార్చుకోవాలి..?

మనసు ఇప్పటికే పని ఒత్తిడి, ఇతర ఆందోళనలతో సతమత మవుతున్నప్పుడు, కఠినమైన వ్యాయామాలు చేయడం వల్ల శరీరం మరింత అలసిపోతుంది. అందుకే చాలామంది ఆ రోజుల్లో వ్యాయామానికి పూర్తిగా విరామం ఇచ్చేస్తుంటారు. కానీ, అలా చేయాల్సిన అవసరం లేదని ఫిట్‌నెస్ నిపుణులు సూచిస్తున్నారు. మీ శక్తి సామర్థ్యాలకు తగ్గట్టుగా వ్యాయామ సమయాన్ని, వేగాన్ని తగ్గించుకుంటే సరిపోతుంది. ఒత్తిడి, అలసట వేధిస్తున్న రోజుల్లోనూ మిమ్మల్ని యాక్టివ్‌గా ఉంచే సులభమైన చిట్కాలు మీ కోసం..

ఇది కూడా చదవండి.. మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..? 

ఇది కూడా చదవండి.. చల్లని వాతావరణం వల్ల సైనస్ సమస్యలు పెరుగుతాయా..? 

ఇది కూడా చదవండి.. చల్లని వాతావరణం వల్ల సైనస్ సమస్యలు పెరుగుతాయా..? 

ఇది కూడా చదవండి.. నోటి దుర్వాసనను తగ్గించే చిట్కాలు 

 

కఠిన వ్యాయామాలకు బదులు తేలికపాటి నడక..

ఏదైనా ఒక రోజు మీరు విపరీతమైన అలసటతో ఉంటే, బరువైన వ్యాయామాలు చేయాల్సిన అవసరం లేదు. వాటి స్థానంలో ప్రశాంతంగా నడవడం (walk), సైక్లింగ్ లేదా తేలికపాటి స్ట్రెచింగ్ వ్యాయామాలు చేయండి. రోజుకు కనీసం 20 నిమిషాల పాటు నడిచినా శరీరం చురుగ్గా ఉంటుంది. దీనివల్ల ఎక్కువగా అలసిపోకుండానే రోజువారీ శారీరక శ్రమ అందుతుంది.

వ్యాయామ సమయాన్ని తగ్గించండి..

సాధారణ రోజుల్లో మీరు రోజూ గంటసేపు వ్యాయామం చేస్తుంటే, ఒత్తిడి ఎక్కువగా ఉన్న రోజుల్లో ఆ సమయాన్ని కుదించుకోండి. అలాంటి సమయాల్లో 20 నుంచి 30 నిమిషాల పాటు వ్యాయామం చేసినా సరిపోతుంది. ఇందుకోసం కొన్ని సులభమైన వ్యాయామాలను ఎంచుకుని, వాటిని సరైన పద్ధతిలో చేయడంపై దృష్టి పెట్టండి. తద్వారా మీ అలవాటు కొనసాగడంతో పాటు శరీరంపై అదనపు భారం పడకుండా ఉంటుంది.

మధ్యమధ్యలో విరామం తీసుకుంటూ చేయండి.. 

ప్రతిరోజూ భారీ బరువులు ఎత్తడం లేదా ఎక్కువ సేపు కసరత్తులు చేయడం తప్పనిసరి కాదు. అలసటగా ఉన్న రోజుల్లో తక్కువ బరువులతో, తక్కువ రౌండ్లు మాత్రమే వ్యాయామం చేయండి. ప్రతి సెట్ మధ్యలో కాసేపు విశ్రాంతి తీసుకోండి. ఒకవేళ మీరు కార్డియో వ్యాయామాలు చేస్తుంటే, వ్యాయామం చేస్తూనే పక్కవారితో సులభంగా మాట్లాడగలిగేంత వేగంతో మాత్రమే చేయండి.

శరీరం ఇచ్చే సంకేతాలను గమనించండి..  

కొన్నిసార్లు మనసులో వర్కవుట్ పూర్తి చేయాలనే లక్ష్యం ఉన్నప్పటికీ, శరీరం అందుకు సహకరించదు. అలాంటప్పుడు మిమ్మల్ని మీరు బలవంతపెట్టుకుని వ్యాయామం చేయకండి. విపరీతమైన నీరసంగా అనిపిస్తే కఠినమైన వ్యాయామాలను ఆపేసి, కాసేపు నడవడం లేదా స్ట్రెచింగ్ చేయడం మేలు. మీ శరీర అవసరాలను అర్థం చేసుకోవడం కూడా ఫిట్‌నెస్‌లో ఒక ముఖ్య భాగమే.

విశ్రాంతి, నిద్రకు ప్రాధాన్యత ఇవ్వండి..  

ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉండాలంటే కేవలం వ్యాయామం చేస్తే సరిపోదు.. శరీరానికి తగినంత విశ్రాంతినివ్వడం కూడా అంతే ముఖ్యం. ఒకవేళ మీకు నిరంతరం అలసటగా అనిపిస్తున్నా, కండరాల నొప్పులు రోజుల తరబడి వేధిస్తున్నా, లేదా మునుపటి కంటే వ్యాయామం చేయడం చాలా కష్టంగా అనిపిస్తున్నా మీ శరీరం విశ్రాంతి కోరుకుంటోందని అర్థం చేసుకోవాలి. అలాంటప్పుడు ఒక రోజు విరామం (break) తీసుకోండి. ప్రశాంతంగా కూర్చోవడం, కంటినిండా నిద్రపోవడం వల్ల శరీరం తిరిగి శక్తిని పుంజుకుంటుంది.

ఫిట్‌నెస్ అంటే ప్రతిరోజూ కఠినమైన వ్యాయామాలు చేయడం కాదు. కొన్ని రోజులు శరీరం ఎంతో ఉత్సాహంగా ఉంటే, మరికొన్ని రోజులు విశ్రాంతిని కోరుకుంటుంది. కాబట్టి ఒత్తిడి, అలసట వేధించే సమయాల్లో మీ వ్యాయామ నియమాలను కాస్త సులభతరం చేసుకోవడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.

ఇది కూడా చదవండి.. ఎలాంటి ఆసనాలు, ముద్రలు వేస్తే జ్ఞాపకశక్తి పెరుగుతుంది..?

ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..? 

ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..? 

ఇది కూడా చదవండి.. మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..? 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.