స్కిజోఫ్రెనియాకు కారణాలేంటి..?

షేర్ చేయండి:
స్కిజోఫ్రెనియాకు కారణాలేంటి..?

సాక్షి లైఫ్ : ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం మే 24న ప్రపంచ స్కిజోఫ్రెనియా దినోత్సవం జరుపుకుంటారు. ఇది తీవ్రమైన మానసిక అనారోగ్య సమస్య. దీని కారణంగా బాధితులు భ్రాంతులకు గురవుతూ,  భయానక ఆలోచనలు కలిగిఉంటారు. అటువంటి పరిస్థితిలో ఆలోచన, ప్రవర్తనలో అసాధారణ మార్పులు సంభవిస్తాయి. స్కిజోఫ్రెనియాకు సంబంధించిన కొన్ని ప్రధాన కారణాల గురించి తెలుసుకుందాం.

 ఇది కూడా చదవండి.. క్షయవ్యాధి ఏయే అవయవాలపై ప్రభావం చూపుతుంది..? 

స్కిజోఫ్రెనియా..

స్త్రీలు, పురుషులు లేదా ఏ వయసు వారైనా ఈ మానసిక వ్యాధి అయిన స్కిజోఫ్రెనియా బారిన పడే అవకాశం ఉంది. ఈ వ్యాధితో బాధపడుతున్న వ్యక్తులు వారి స్వంత ప్రపంచంలో మునిగిపోతారు. సమాజం నుంచి  తమను తాము వేరు చేసుకుని బతుకుతారు.

ఇది కూడా చదవండి.. లివర్ సంబంధిత సమస్యలను ఎలా గుర్తించాలి..?  
 
సాధారణంగా, దాని లక్షణాలు కౌమారదశలోనే కనిపిస్తాయి. అంటే చదువుపై ఆసక్తి లేకపోవడం, చిరాకు, నిద్ర సమస్యలు, ఒంటరిగా జీవించడం, నవ్వడం లేదా ఏడవడం, దేనిపైనా దృష్టి పెట్టలేకపోవడం కొందరిలో జరుగుతుంటాయి. మంరికొందరిలో ఇలాంటి లక్షణాలు కాకుండా వేరే లక్షణాలు కనిపించవచ్చు. 

మానసిక..

అటువంటి పరిస్థితిలో రోగి తనను తాను చూసుకోలేడు. కాబట్టి ఇలాంటి బాధితులకు కుటుంబం,సమాజం మద్దతు చాలా అవసరం. దీనికోసమే   ప్రజలలో అవగాహన పెంచడానికి ప్రపంచ వ్యాప్తంగా ప్రతి సంవత్సరం ప్రపంచ స్కిజోఫ్రెనియా దినోత్సవాన్ని జరుపుకుంటారు. సమతుల్య ఆహారం, క్రమం తప్పకుండా శారీరక శ్రమ, తగినంత నిద్ర ,ఒత్తిడిని తగ్గించడం ద్వారా ఈ వ్యాధి ప్రమాదాన్ని కొంతమేర తగ్గించడానికి,మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి వీలవుతుంది.

ఇది కూడా చదవండి.. బ్యాడ్ కొలెస్ట్రాల్ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు అవసరం..?  

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.