మహిళల మానసిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే అంశాలు..?

సాక్షి లైఫ్ :మానసిక ఆరోగ్యపరమైన సమస్యలకు హద్దులు ఉండవు లింగం భేదం, వయస్సుతో కూడా సంబంధం ఉండదు. మెంటల్ ప్రోబ్లమ్స్ ఎలాంటి వారినైనా ప్రభావితం చేయగలవు. ముఖ్యంగా మహిళల విషయంలో అల్లకల్లోలంగా ఉన్న వారి మానసిక ఆరోగ్యస్థితిగతుల వల్ల ఎదురయ్యే సమస్యల గురించి మాట్లాడేవారుండరు.

ఇది కూడా చదవండి.. ఒక వారంలో ఎన్ని గంట‌లు వ్యాయామం చేస్తే ఆరోగ్యానికి మంచిది..? 

మానసిక ఆరోగ్యంతో సంబంధం ఉన్న అపవాదులను రూపుమాపడమనేది ఇలాంటి ఆటంకాల అడ్డు తొలగించుకోవడంలో ఎంతో కీలకమైనది. అంతేకాకుండా మహిళలు వారి సంపూర్ణారోగ్యం ఇంకా ఎదుగుదలకు అవసరమైన మద్దతు, ఉపాయాలను అందిపుచ్చుకోగలిగే అవకాశాలను కూడా కల్పించగలగాలి.

డిప్రెషన్, ఆందోళన

ప్రపంచ వ్యాప్తంగా మహిళలు అనేక రకాల మానసిక ఆరోగ్య సమస్యలతో సతమతవావుతున్నారు. ఇలాంటి వాటిలో కొన్ని పరిస్థితులు పురుషుల కంటే మహిళల్లోనే ఎక్కువగా చూడవచ్చు. డిప్రెషన్, ఆందోళన కలిగించే రుగ్మతలు ఇంకా తినే రుగ్మతలు మహిళలపై విపరీతమైన ప్రభావాన్ని చూపుతాయి. అంతేకాకుండా, పెరినాటల్ డిప్రెషన్, పెరి-మెనోపాసల్ డిప్రెషన్ , ప్రీమెన్‌స్ట్రువల్ సిండ్రోమ్ (పీఎంఎస్) వంటి స్త్రీత్వపు ప్రత్యేకమైన మానసిక ఆరోగ్య సమస్యలను మహిళలు ఎదుర్కొంటారు.

హార్మోన్‌ల మార్పుల హెచ్చుతగ్గుల కారణంగా

మహిళలు తమ జీవితాంతం జరిగే శారీరక, భావోద్వేగ, హార్మోన్‌ల మార్పుల హెచ్చుతగ్గుల కారణంగా మానసిక ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవడం ముఖ్యమైన సవాలుగా ఉంటుంది. యుక్తవయస్సు, వివాహం, గర్భం, ప్రసవం, అలాగే రుతుక్రమం ఆగిపోయే ముందు, ఆగిపోయిన తర్వాతి దశలతో సహా జీవినంలో ఎదురయ్యే అనేక మార్పుల వల్ల ఈ ఇబ్బందులు మరింత తీవ్రమవుతాయని ప్రాణ్ వెల్‌నెస్ కు చెందిన సీనియర్ కౌన్సెలర్, అంచు కృష్ణ చెబుతున్నారు. 

ఇది కూడా చదవండి.. బరువు తగ్గించే నల్ల ఉప్పు.. 

ఒత్తిడి..

మహిళలు ఎదుర్కొనే ఈ మానసిక ఆరోగ్య సంఘర్షణలకు అనేక అంశాలు కారణాలవుతాయి. పని సంబంధిత ఒత్తిడి, సంబంధాలలో సమస్యలు ఇంకా సంతానోత్పత్తి వల్ల కలిగే ఆరోగ్య సమస్యలు అన్నీ కూడా మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. అంతేకాకుండా, చాలాకాలంగా ఉన్న అనారోగ్యం, వైకల్యం వంటి శారీరక ఆరోగ్య సమస్యలు మానసిక ఆరోగ్య సమస్యలను తీవ్రతరం చేస్తాయి, ఫలితంగా ఒంటరితనం, స్వేచ్ఛ లేకపోవడం, చిరాకు ఇంకా ఒత్తిడి వంటి భావనలు కలుగుతాయి. కాబట్టి మానసిక ఆరోగ్య సమస్యలను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు సమగ్ర విధానాన్ని అవలంభించడం చాలా అవసరమని సీనియర్ కౌన్సెలర్, అంచు కృష్ణ వెల్లడిస్తున్నాన్నారు.

మానసిక ఇబ్బంది వల్ల మహిళల మానసిక ఆరోగ్యం తీవ్రంగా ప్రభావితమవుతుంది. గృహ హింస, లైంగిక వేధింపులు, ఇతర బాధాకరమైన సంఘటనలను ఎదుర్కోవడం వలన పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్ (PTSD) వేగంగా అభివృద్ధి చెందుతుంది, ఇది సంపూర్ణ మద్దతు , సహాయం పొందే కీలకమైన అవసరాన్ని తెలియజేస్తుందని అంచు కృష్ణ అంటున్నారు. 

మానసిక ఆరోగ్య సమస్యలకు..

ఉద్యోగం చేస్తున్న వివాహిత మహిళలు అనేక కారణాల వల్ల మానసిక ఆరోగ్య సమస్యలకు గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి, వాటిలో నిర్ణయాధికారంలో కనీస ప్రమేయం ఉండటం, ఆర్థిక స్థిరత్వం కోసం ఇతరులపై ఆధారపడడం వంటివి ఉన్నాయి. అంతేకాకుండా, లింగం భేదం, వైవాహిక స్థితి ఆధారంగా తలెత్తే సామాజిక ఇబ్బందులలో వివక్షతతో కూడిన విధానాలు, నిరాకరించిన అవకాశాలు, అసమాన ఆదాయ పంపిణీ వంటివి మహిళలను సామాజికంగా అణగారేలా చేయవచ్చు. పని చేసే వివాహిత మహిళలలో ఈ కారణాల ఫలితంగా స్వగౌరవం కోల్పోయేలా, అమితామైన ఆందోళన కలగడం వంటి భావాలు తలెత్తవచ్చు.

కుటుంబ చరిత్ర.. 

డిప్రెషన్ లేదా ఇతర మానసిక ఆరోగ్య రుగ్మతలకు సంబంధించిన కుటుంబ చరిత్ర కలిగి ఉండటం వంటి జన్యుపరమైన కారకాలు మహిళలను ఈ పరిస్థితులకు సంబంధించిన దుర్బలత్వానికి తీసుకురావచ్చు. విడాకులు, సమాజపు ఒత్తిడి, అభద్రత ,ఒత్తిడిని పెంచే భావాలను ప్రేరేపించగలవు, తద్వారా అది మానసిక ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావాన్ని చూపుతుంది.  

ఇది కూడా చదవండి.. New study : మీ బెడ్ రూమ్ ఎంత సేఫ్ ..? పిల్లో కవర్‌లో మిలియన్ల కొద్దీ బ్యాక్టీరియాలు..  

ఇది శారీరక ఆరోగ్యంలో మరింత క్షీణతకు దారితీసి అది మానసిక శ్రేయస్సుపై పడే ఇతరాత్ర ప్రభావాలకు దారితీస్తుంది. సామాజిక ఇంకా సాంప్రదాయపరమైన ఒత్తిళ్లు సాధారణంగా స్త్రీ సౌందర్యాన్ని ఆమె శారీరక రూపంతో పోల్చి చూస్తాయి, ఇది శరీరక సౌష్టవం, ఆందోళన ఇంకా ఆహారం తీసుకొనే రుగ్మతలకు సంబంధించిన సమస్యలను తెచ్చిపెడతాయి. అదనంగా, నిరుద్యోగం లేదా తక్కువ ఆదాయం వంటి సామాజిక ఆర్థిక సవాళ్లు అసమర్థత, దీర్ఘకాలిక ఒత్తిడికి ఆజ్యం పోస్తాయి, మహిళలకు మానసిక ఆరోగ్య పోరాటాలను మరింత దిగజార్చుతాయి.

సహాయం పొందడంలో.. 

మహిళల్లో మానసిక ఆరోగ్య సమస్యలు సాధారణంగా వస్తునప్పటికీ, వారు అవసరమైన సహాయ సహకారాలను పొందేందుకు అనేక అడ్డంకులు ఏర్పడుతున్నాయి. అవగాహన, మద్దతు వనరుల లేమి, చికిత్శాపరమైన ఖర్చులు, సామాజిక-ఆర్థిక కారకాలు, ఇలాంటి సమస్యలతో ఎదురయ్యే అవమానాలకు గురి కావడంతో పాటుగా, మానసిక ఆరోగ్యపరమైన సమస్యలకు సహాయం కొరేందుకు కూడా ఆటంకాలు కలిగిస్తున్నాయి.

అపోహలను అదిగమించడం

మహిళలకు అవసరమైన సరైన మద్దతు, చికిత్స పొందేందుకు వారికి అవకాశం కల్పించడం ఇంకా మానసిక ఆరోగ్యాన్ని చుట్టుముట్టిన సమస్యలను ఎదుర్కొనేలా వారిని సన్నద్ధం చేయడం ఎంతో అవసరం. ఇది మానసిక ఆరోగ్యం గురించి మనసు విప్పి నిజాయితీగా మాట్లాడటంతో మొదలవుతుంది, వ్యక్తులు వారి అనుభవాలు ,సంఘర్షణల గురించి అందరికీ తెలిసేలా మాట్లాడేందుకు వారిని ప్రోత్సహిస్తుంది. మానసిక అనారోగ్యం చుట్టూ ఉన్న అపోహలను తొలగించడంలో విద్య, అవగాహన అవసరమని సీనియర్ కౌన్సెలర్ అంచు కృష్ణ చెబుతున్నారు. 

సంఘీభావాన్ని..

సపోర్ట్ గ్రూపులలో పాల్గొనడం, మహిళల అవసరాలకు అనుగుణంగా మానసిక ఆరోగ్య విధానాలను సమర్థించడం వలన ఇలాంటి సమస్యలను ఎదుర్కొనే మహిళల్లో సమాజం వారిపట్ల తమ సంఘీభావాన్ని కనబరిచేలా చేయొచ్చు. చాదస్త పద్ధతులకు దూరంగా ఉండటం, మానసిక అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తులు వివక్షకు గురికాకుండా చూడటం ద్వారా, ప్రతి ఒక్కరికీ మరింత సహాయక ఇంకా పక్షపాతరహిత వాతావరణాన్ని సృష్టించవచ్చు.

 ఇది కూడా చదవండి.. సైనసైటిస్ కు కారణాలు..? లక్షణాలను ఎలా గుర్తించాలి..?  


గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

Tags : women-health mental-health depression mental-tensions stress women-health-problems mental-problems mental-issues women-health-tips

Related Articles

Newsletter

Please subscribe for more updates...!

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.

Get In Touch

Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034

040 2325 6000

life@sakshi.com

Follow Us

© News. All Rights Reserved. by sakshi.com