కాగ్నిటివ్ డిక్లైన్ (అభిజ్ఞా క్షీణత) అంటే ఏమిటి..?
సాక్షి లైఫ్ : కాగ్నిటివ్ డిక్లైన్ (అభిజ్ఞా క్షీణత) అంటే మెదడు క్రమంగా బలహీనపడుతుంది. దీని కారణంగా ఆలోచించే, నేర్చుకునే , గుర్తుంచు కునే సామర్థ్యం తగ్గుతుంది. అంతేకాదు దృష్టి సామర్థ్యం కూడా తగ్గుతుంది. అభిజ్ఞా క్షీణత ప్రారంభ సంకేతాలను గుర్తించడం ద్వారా ఈ సమస్య నుంచి బయట పడొచ్చు. సబ్జెక్టివ్ కాగ్నిటివ్ డిక్లైన్ (ఎస్సిడీ) అనేది తరచుగా గందరగోళానికి గురికావడం, జ్ఞాపకశక్తి కోల్పోవడం వంటి పరిస్థితి. ఇది ఒక రూపం అల్జీమర్స్ వ్యాధి, సంబంధిత డిమెన్షియా ప్రారంభ లక్షణాలలో ఒకటి. మెదడుకు సంబంధించిన సాధారణ సమస్యలలో బలహీనమైన జ్ఞాపకశక్తి ,ఆలోచించే సామర్థ్యం, అర్థం చేసుకునే సామర్థ్యం తగ్గడం.
ఇది కూడా చదవండి.. ఆరోగ్యంగా ఉన్నవాళ్లకు ప్రోటీన్ సప్లిమెంట్లు అవసరంలేదంటున్న వైద్యులు..
ఇది కూడా చదవండి.. ఫ్యాటీ లివర్ అంటే ఏమిటి..?
మెదడు అనేది మన శరీరంలో అత్యంత ముఖ్యమైన అవయవం. కానీ దానిని జాగ్రత్తగా చూసుకునే విషయానికి వస్తే, మనం దానిని పట్టించుకోలేకపోతున్నాం. అయితే, దానిని జాగ్రత్తగా చూసుకోవడం చాలా అవసరం. నరాల సంబంధిత రుగ్మతలు, మెదడు సంబంధిత సమస్యల గురించి ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తెలుసుకోవాలి..
వయస్సు పెరుగుతుండడంతో జ్ఞాపకశక్తి , ఆలోచనా సామర్థ్యం క్రమంగా తగ్గుతాయి. కొన్నిసార్లు తలకు గాయం లేదా ఏదైనా వైద్య పరిస్థితి కారణంగా, మెదడు పని సామర్థ్యం కూడా ప్రభావితమవుతుంది. అటువంటి పరిస్థితిలో సబ్జెక్టివ్ కాగ్నిటివ్ డిక్లైన్ (ఎస్సిడీ) లక్షణాలను గుర్తించడం చాలా ముఖ్యం. దీనికి వీలైనంత త్వరగా చికిత్స అందించాలి.
ఇది కూడా చదవండి.. క్షయవ్యాధి ఏయే అవయవాలపై ప్రభావం చూపుతుంది..?
ఇది కూడా చదవండి.. లివర్ సంబంధిత సమస్యలను ఎలా గుర్తించాలి..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
