స్కిజోఫ్రెనియా అంటే ఏమిటి..?

షేర్ చేయండి:
స్కిజోఫ్రెనియా అంటే ఏమిటి..?

సాక్షి లైఫ్ : స్కిజోఫ్రెనియా అనేది తీవ్రమైన మానసిక రుగ్మత. ఇది కొందరిలో ఒక్కసారి వస్తే జీవితాంతం పోరాడుతూనే ఉండాల్సి ఉంటుంది. దీనితో బాధపడుతున్న వ్యక్తి తన ఊహలే వాస్తవమని నమ్ముతాడు. తరచుగా గందరగోళ స్థితిలో ఉంటాడు. మెదడులో డోపమైన్ అనే న్యూరోట్రాన్స్మిటర్ ఉంటుంది. ఇది మెదడు, శరీరాన్ని సమన్వయం చేయడానికి పనిచేస్తుంది, కానీ కొన్ని కారణాల వల్ల డోపమైన్ పరిమాణం పెరుగుతుంది. ఈ పరిస్థితినే స్కిజోఫ్రెనియా అంటారు.

ఇది కూడా చదవండి.. కల్తీ ఆహారాన్ని గుర్తించడం ఎలా..?  

ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం ప్రపంచ జనాభాలో సుమారు 1 శాతం మంది స్కిజోఫ్రెనియాతో బాధపడుతున్నారు. అయితే భారతదేశంలో ఈ వ్యాధి బారీన పడిన రోగుల సంఖ్య దాదాపు 40 లక్షలు.

మానసిక నిపుణులు ఏమంటున్నారంటే..?

సరైన జీవనశైలి, సరైన పోషకాహారం తీసుకోకపోవడం వల్ల కూడా స్కిజోఫ్రెనియాకు దారితీయవచ్చు. "తక్కువ ఆహారం, వ్యాయామం లేకపోవడం, మాదకద్రవ్య దుర్వినియోగం, నిద్రలేమి వంటి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వ్యక్తులు స్కిజోఫ్రెనియాతో సహా ఇతర మానసిక ఆరోగ్య సమస్యలను అభివృద్ధి చేసే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని వైద్యనిపుణులు చెబుతున్నారు. 

 పోషకాహార లోపాలు, ముఖ్యంగా అవసరమైన కొవ్వు ఆమ్లాలు, విటమిన్లు ,ఖనిజాలలో లోపాలు మెదడు పనితీరును దెబ్బతీస్తాయి. స్కిజోఫ్రెనియాకు జన్యు పరంగా ఎవరికైనా ఉంటే కుటుంబంలో మరెవరికైనా వచ్చే అవకాశం ఉంటుందని పరోశోధకులు వెల్లడిస్తున్నారు. 

దీర్ఘకాలిక ఒత్తిడి , జీవనశైలి న్యూరోఇన్‌ఫ్లమేషన్ , న్యూరోట్రాన్స్మిటర్ల  క్రమబద్దీకరణకు కారణమవుతాయి. ఇవి ఈ వ్యాధి సంభవించడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. కాబట్టి ప్రపంచ స్కిజోఫ్రెనియా దినోత్సవం సందర్భంగా మనం సమతుల్య ఆహారం, క్రమం తప్పకుండా శారీరక శ్రమ, తగినంత నిద్ర, ఒత్తిడిని తగ్గించడం ద్వారా ప్రమాదాన్ని తగ్గించడానికి అవకాశం ఉంటుందని మానసిక నిపుణులు చెబుతున్నారు. 

ఇది కూడా చదవండి.. పక్షవాతం రావడానికి కారణాలు..? 

 ఇలాంటి కచ్చితమైన ఆరోగ్య సమాచారాన్ని అనుభవజ్ఞులైన వైద్య నిపుణులు అందించే మరిన్ని విషయాలను గురించి మీరు తెలుసుకోవాలంటే సాక్షి లైఫ్ ను ఫాలో అవ్వండి..  

ఇది కూడా చదవండి.. ఆక్సిటోసిన్‌ పాల వల్ల కలిగే దుష్ప్రభావాలు.. 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.