Mental Health Problems : మానసిక ఆరోగ్య సమస్యలకూ విటమిన్-డి లోపానికి లింక్ ఏంటి..?
సాక్షి లైఫ్ : ఎముకల దృఢత్వానికి, మెరుగైన రోగనిరోధక శక్తికి అత్యంత కీలకమైన విటమిన్-డి లోపం ఈ రోజుల్లో యువతలో చాలా ఎక్కువగా కనిపిస్తోంది. సూర్యరశ్మి శరీరానికి తగినంతగా తగలకపోవడం, మారిన జీవనశైలి, ఆహారపు అలవాట్లే ఈ సమస్యకు ప్రధాన కారణాలని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
అసలు విటమిన్-డి లోపానికి ప్రధాన కారణాలు..
ఉదయం నుంచి రాత్రి వరకు స్కూళ్లు, కాలేజీలు, ఆఫీసులకే పరిమితం కావడం వల్ల యువతకు ఎండ తగిలే అవకాశాలు తగ్గిపోయాయి. ఒకవేళ బయటకు వచ్చినా సన్‌స్క్రీన్ లోషన్లు ఎక్కువగా వాడటం వల్ల చర్మం విటమిన్-డిని ఉత్పత్తి చేయలేకపోతోంది.
ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..?
ఇది కూడా చదవండి.. కాలేయ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారా..? మౌనంగా పెరుగుతున్న ఈ వ్యాధి గురించి తెలుసా..?
ఇది కూడా చదవండి.. మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..?
విటమిన్-డి సహజంగా లభించే ఆహార పదార్థాలు చాలా తక్కువ. కొవ్వు శాతం ఎక్కువగా ఉండే చేపలు, గుడ్డు పచ్చసొన, చీజ్ వంటివి మన రోజువారీ భోజనంలో తగినంతగా లేకపోవడం కూడా ఈ లోపానికి దారితీస్తోంది.
అధిక బరువు ఉన్నవారిలో, అలాగే శరీరం పోషకాలను సరిగ్గా గ్రహించలేని కొన్ని రకాల అనారోగ్య సమస్యలు ఉన్నవారిలో ఈ లోపం ఎక్కువగా ఉంటుంది. చర్మం రంగు ముదురుగా ఉన్నవారిలో విటమిన్-డి ఉత్పత్తి సహజంగానే కాస్త నెమ్మదిగా జరుగుతుంది.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు..
రక్త పరీక్షలో విటమిన్-డి స్థాయిలు..
రక్తంలో విటమిన్-డి స్థాయిలను బట్టి మన ఆరోగ్య పరిస్థితిని సులభంగా అంచనా వేయవచ్చు. రక్త పరీక్షలో విటమిన్-డి స్థాయి 20 లేదా అంతకంటే ఎక్కువ ఉంటే అది సాధారణ లేదా పూర్తి ఆరోగ్యకరమైన స్థితిని సూచిస్తుంది. ఒకవేళ ఈ స్థాయి 12 నుంచి 19 వరకు ఉంటే, శరీరంలో విటమిన్-డి కాస్త తక్కువగా ఉన్నట్లు నిర్ధారించుకోవాలి.
అలా కాకుండా ఈ స్థాయి 12 కంటే తక్కువగా పడిపోతే, దానిని విటమిన్-డి తీవ్రమైన లోపంగా పరిగణించాలి. ఈ స్థితిలో ఏమాత్రం అశ్రద్ధ చేయకుండా తప్పనిసరిగా వైద్యులను సంప్రదించి అవసరమైన చికిత్స తీసుకోవాలి. రోజూ ఉదయం లేదా సాయంత్రం వేళల్లో కనీసం 20 నుంచి 30 నిమిషాల పాటు లేత ఎండ శరీరానికి తగిలేలా చూసుకోవాలి.
వైద్యుల సలహా లేకుండా మెడికల్ షాపుల్లో దొరికే విటమిన్-డి సప్లిమెంట్లు వాడకూడదు. అవసరానికి మించి విటమిన్-డి శరీరంలో చేరితే ఇతర ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. కాల్షియంను శరీరం గ్రహించాలన్నా, మానసిక ఆరోగ్యం మెరుగ్గా ఉండాలన్నా విటమిన్-డి చాలా అవసరం.
ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..?
ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..?
ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
