మైగ్రేన్ సమస్య ఎలాంటి వారికి ఎక్కువగా వస్తుంది..?
సాక్షి లైఫ్: మైగ్రేన్ అనేది టెన్షన్ కు సంబంధించింది. మైగ్రేన్ పెయిన్ కొంతమందికి యుక్తవయస్సులో తలెత్తుతుంది. 35 నుంచి 45 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవారిలో ఎక్కువగా ఈ సమస్య కనిపిస్తోంది. ఇది కొందరిలో హార్మోన్ల ప్రభావాల కారణంగా కూడా వస్తుంది. కొందరికి నిద్రలేమి కారణంగా కూడా మైగ్రేన్ సమస్య తలెత్తుతుంది.
ఇది కూడా చదవండి.. బ్లాక్ సాల్ట్ బెనిఫిట్స్ ఎన్నో..
నివారణ ఎలా..?
చలికి సున్నితంగా ఉండేవారిలో మైగ్రేన్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అటువంటి పరిస్థితిలో, శీతాకాలంలో తలనొప్పిని, ముఖ్యంగా మైగ్రేన్‌ను నివారించడానికి చలిగాలి తగలకుండా జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం. అంతేకాదు ప్రతిరోజూ వ్యాయామం చేయడం వల్ల సమస్య కొంతమేర తగ్గుతుంది. ఎందుకంటే వ్యాయామం సెరోటోనిన్ స్థాయిలను పెంచుతుంది. తద్వారా మైగ్రేన్ పెయిన్ కూడా తగ్గుతుంది.
ఇది కూడా చదవండి.. శక్తికి దంతాలకు లింకేంటి..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
