Molecular Psychiatry Journal Study : 35 ఏళ్లలోపు వారిలోనే 60 శాతం మెంటల్ హెల్త్ ఇష్యుస్.. : 'మాలిక్యులర్ సైకియాట్రీ' జర్నల్ లో వెల్లడి..
సాక్షి లైఫ్ : భారతదేశం యువశక్తికి మారుపేరు. కానీ, అదే యువత ఇప్పుడు మానసిక రుగ్మతల కోరల్లో చిక్కుకుంటోందని గణాంకాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఒకప్పుడు వృద్ధాప్యానికే పరిమితమని భావించిన మానసిక సమస్యలు, ఇప్పుడు కౌమార దశలోనే కమ్మేస్తున్నాయి. దేశంలోని మొత్తం మానసిక వ్యాధిగ్రస్తుల్లో 60 శాతం మంది 35 ఏళ్లలోపు వారే ఉండటం గమనార్హం. ప్రతిష్టాత్మక 'మాలిక్యులర్ సైకియాట్రీ' పత్రిక వెల్లడించిన వివరాలు ఈ పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతున్నాయి.
ఇది కూడా చదవండి..Latest study : పిల్లిని పెంచుకుంటే స్కిజోఫ్రెనియా ముప్పు రెట్టింపు..!
ఇది కూడా చదవండి.. క్షయవ్యాధి ఏయే అవయవాలపై ప్రభావం చూపుతుంది..?
ఇది కూడా చదవండి..ఆరోగ్యప్రయోజనాలు పొందాలంటే సలాడ్ ను ఏ టైమ్ లో తినాలి..?
చిన్న వయసులోనే బీజం..
ఇటీవల జరిగిన ఇండియన్ సైకియాట్రిక్ సొసైటీ సమావేశంలో నిపుణులు వెల్లడించిన ప్రకారం, మానసిక అనారోగ్యాలు ప్రారంభమయ్యే సగటు వయస్సు 19 నుంచి 20 ఏళ్లకు పడిపోయింది.
14 ఏళ్లకే దాదాపు 34.6 శాతం మందిలో ఈ రుగ్మతల లక్షణాలు మొదలవుతున్నాయి. 18 ఏళ్ల నాటికి.. సుమారు సగం మంది 48.4శాతం ఏదో ఒక మానసిక ఒత్తిడికి లోనవుతున్నారు. 25 ఏళ్ల వయసుకే మెజారిటీ కేసులు 62.5శాతం పూర్తిగా బయటపడుతున్నాయి.
యువతను వేధిస్తున్న ప్రధాన సమస్యలు..
ఏడీహెచ్‌డీ (ADHD)..ఏకాగ్రత కుదరకపోవడం, అతి చురుకుదనం వల్ల చదువులో వెనుకబడటం. భవిష్యత్తు గురించి, పరీక్షల గురించి విపరీతమైన భయం, ఆందోళన. ఆహారపు అలవాట్లలో అసమతుల్యత. ఒత్తిడి వల్ల అతిగా తినడం లేదా అసలు తినకపోవడం. ఈ మానసిక రుగ్మతలు కేవలం ఆలోచనలకే పరిమితం కావు. ఇవి యువత జీవితాలను మూడు రకాలుగా దెబ్బతీస్తున్నాయి.
విద్యా రంగంలో ముఖ్యంగా పరీక్షల్లో ప్రతిభ తగ్గడం, ఏకాగ్రత లోపించడం. వృత్తి జీవితం పరంగా ఉద్యోగాల్లో రాణించలేకపోవడం, పని ఒత్తిడిని తట్టుకోలేకపోవడం. వ్యక్తిగత బంధాల విషయంలో కుటుంబ సభ్యులు, స్నేహితులతో మనస్పర్థలు రావడం, ఒంటరితనం.
పరిష్కారమార్గం ఏమిటి..?
యువతలో పెరుగుతున్న ఈ ధోరణిని అరికట్టడానికి సామాజిక మార్పు అవసరమని వైద్యులు సూచిస్తున్నారు. తొలి దశలోనే గుర్తింపు.. పిల్లల ప్రవర్తనలో వచ్చే చిన్న మార్పులను కూడా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు గమనించాలి. మానసిక సమస్యలను దాచకుండా, వాటి గురించి స్వేచ్ఛగా మాట్లాడే వాతావరణం కల్పించాలి. సమస్య తీవ్రంగా ఉన్నప్పుడు సంకోచించకుండా సైకియాట్రిస్ట్ లేదా కౌన్సిలర్‌ను సంప్రదించాలి.
సోషల్ మీడియా వాడకం తగ్గించి, శారీరక వ్యాయామం, ధ్యానం అలవాటు చేసుకోవాలి. మానసిక ఆరోగ్యం అనేది విలాసం కాదు, అది ఒక ప్రాథమిక అవసరం. యువత తమ మనసులోని భావాలను పంచుకోవడానికి వెనకాడకూడదు. సకాలంలో స్పందిస్తే ఎంతటి క్లిష్టమైన సమస్యకైనా పరిష్కారం లభిస్తుందని సైకాలజిస్టులు చెబుతున్నారు.
ఇది కూడా చదవండి..లవ్ హార్మోన్ అంటే ఏమిటి..?
ఇది కూడా చదవండి..ఎలాంటి కొలెస్ట్రాల్ ఆరోగ్యానికి హానికరం..?
ఇది కూడా చదవండి..High grade fever : హై గ్రేడ్ ఫీవర్ అంటే..? ఎందుకు వస్తుంది..?
ఇది కూడా చదవండి..వేగంగా బరువు తగ్గించే ఓట్జెంపిక్ డ్రింక్ ట్రెండ్.. డైటీషియన్లు ఏమంటున్నారంటే..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
