Happy Foods : మూడ్‌ను మార్చే ‘హ్యాపీ ఫుడ్స్’..! డిప్రెషన్, ఆందోళనను దూరం చేసే ఆహార పదార్థాలపై తాజా పరిశోధనలు..

సాక్షి లైఫ్ : మనం తీసుకునే ఆహారం కేవలం ఆకలిని తీర్చడమే కాదు, మన ఆలోచనలను, భావోద్వేగాలను కూడా ప్రభావితం చేస్తుందని మీకు తెలుసా? మంచి ఆహారం..మంచి మనసు.. అనేది నేటి కాలంలో ఒక ఆరోగ్య సూత్రంగా మారిపోయింది. ఉదయాన్నే తాగే కాఫీ నుంచి, వంటింట్లో దొరికే గుడ్డు సోన వరకు కొన్ని రకాల పదార్థాలు మన మెదడులో 'ఫీల్ గుడ్' హార్మోన్లను విడుదల చేస్తాయని తాజా అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. ఆ విశేషాలు మీకోసం..

 

ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..? 

ఇది కూడా చదవండి.. నెయ్యి వేడి నీటిలో కలిపి తాగితే ఆరోగ్యానికి ఎంత మంచిదో తెలుసా..? 

ఇది కూడా చదవండి..ఓఆర్ఎస్ ఆరోగ్యానికి మంచిదేనా..? ఎనర్జీ డ్రింక్స్ వల్ల కలిగే అనారోగ్య సమస్యలు..?

 

1. కాఫీ..(coffee)

చాలామందికి కాఫీ తాగనిదే రోజూ గడవదు. ఇది కేవలం అలవాటు మాత్రమే కాదు, మెదడును చురుగ్గా ఉంచే ఒక ఔషధం కూడా. కాఫీలోని కెఫీన్ మెదడులో డోపమైన్, నొరెపినెఫ్రిన్ వంటి హార్మోన్ల విడుదలకు సహకరిస్తుంది. ఇవి ఏకాగ్రతను పెంచి, మూడ్‌ను తక్షణమే మెరుగుపరుస్తాయి. అయితే, పరిమితి దాటకుండా రోజుకు 2 నుంచి 3 కప్పుల వరకు తీసుకోవడం శ్రేయస్కరం.

2. గుడ్డు.. (Egg) మెదడుకు బలం.. 

గుడ్డులో ప్రోటీన్ మాత్రమే కాదు, మెదడు ఆరోగ్యానికి కావాల్సిన 'కోలిన్' (Choline) పుష్కలంగా ఉంటుంది. ముఖ్యంగా ఎర్రటి సోన (Egg Yolk)లో విటమిన్-డి, బి-విటమిన్లు ఉంటాయి. ఇవి మెదడులోని నరాల మధ్య సంకేతాలు వేగంగా అందేలా చేసి, ఒత్తిడిని తగ్గిస్తాయి. అందుకే గుడ్డును 'నేచురల్ మూడ్ బూస్టర్' అని పిలుస్తారు.

3. షిటాకే పుట్టగొడుగులు (Shiitake Mushrooms)..

ఈ రకమైన పుట్టగొడుగుల్లో విటమిన్-డి, అమినో యాసిడ్స్ మెండుగా ఉంటాయి. ఇవి శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచడమే కాకుండా, సెరోటోనిన్ (Serotonin) అనే హార్మోన్ ఉత్పత్తిలో కీలక పాత్ర పోషిస్తాయి. దీనివల్ల నిద్రలేమి, చిరాకు వంటి సమస్యలు తగ్గుముఖం పడతాయి.

4. విటమిన్-సి.. (Vitamin C)

నారింజ పండ్లలోని విటమిన్-సి కేవలం చర్మానికే కాదు, మానసిక ఉల్లాసానికి కూడా అవసరం. ఇది రక్తపోటును అదుపులో ఉంచి, స్ట్రెస్ హార్మోన్ అయిన 'కార్టిసాల్' స్థాయిలను తగ్గిస్తుంది. ఉదయాన్నే ఒక గ్లాసు ఆరెంజ్ జ్యూస్ తాగడం వల్ల రోజంతా ఉత్సాహంగా ఉండవచ్చు.

 
డార్క్ చాక్లెట్ ముక్క తినడం వల్ల మెదడులో ఎండార్ఫిన్లు విడుదలై సంతోషాన్ని కలిగిస్తాయి.

శరీరంలో నీటి శాతం తగ్గితే చిరాకు, తలనొప్పి వస్తాయి. కాబట్టి రోజుకు 3 నుంచి 4 లీటర్ల నీరు తప్పనిసరి.

ఓట్స్ రక్తంలోని చక్కెర స్థాయిలను స్థిరంగా ఉంచి, మూడ్ స్వింగ్స్ కాకుండా చూస్తాయి.

 ఆరోగ్యకరమైన ఆహారం మన శరీరానికే కాదు, మన ఆత్మవిశ్వాసానికి కూడా పునాది. కేవలం జంక్ ఫుడ్ మీద కాకుండా ఇలాంటి సహజసిద్ధమైన ఆహారంపై దృష్టి పెడితే మానసికంగా ఎంతో ఆరోగ్యంగా ఉండొచ్చు..  

 

ఇది కూడా చదవండి.. ఎసిడిటీని అంతమొందించే ఇంటి చిట్కాలు.. 

ఇది కూడా చదవండి..ఈ 5 సప్లిమెంట్స్ కు డబ్బు దండగ అంటున్న వైద్యనిపుణులు..! 

 ఇది కూడా చదవండి.. ఎలాంటి కొలెస్ట్రాల్ ఆరోగ్యానికి మంచిది..?

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

Tags : stress stress-food research best-food best-diet
Newsletter

Please subscribe for more updates...!

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.

Get In Touch

Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034

040 2325 6000

life@sakshi.com

Follow Us

© News. All Rights Reserved. by sakshi.com