How Social Relationships Impact the Brain : సామాజిక సంబంధాలు మెదడును ఎంతలా ప్రభావితం చేస్తాయో తెలుసా..?

షేర్ చేయండి:
How Social Relationships Impact the Brain : సామాజిక సంబంధాలు మెదడును ఎంతలా ప్రభావితం చేస్తాయో తెలుసా..?

సాక్షి లైఫ్ : మనిషి సామాజిక జీవి. నాలుగు గోడల మధ్య ఒంటరిగా గడపడం కంటే, నలుగురితో కలిసి మెలిసి ఉండటమే మెదడుకు మేలు చేస్తుందని తాజా పరిశోధనలు స్పష్టం చేస్తున్నాయి. మనం ఇతరులతో పంచుకునే నవ్వులు, కబుర్లు కేవలం సరదా కోసమే కాదు.. అవి మన మెదడు పనితీరును మెరుగుపరిచే అత్యద్భుతమైన ఔషధాలని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

 

 ఇది కూడా చదవండి..మంచి కొలెస్ట్రాల్ ను పెంచే దానిమ్మ.. 

ఇది కూడా చదవండి..ఓఆర్ఎస్ ఆరోగ్యానికి మంచిదేనా..? ఎనర్జీ డ్రింక్స్ వల్ల కలిగే అనారోగ్య సమస్యలు..? 

ఇది కూడా చదవండి.. టీ లో ఎన్నిరకాల వెరైటీలున్నాయో తెలుసా..? 

 

కలిసి ఉంటేనే.. 

మనం ఇతరులతో సంభాషించినప్పుడు లేదా సామాజిక కార్యక్రమా ల్లో పాల్గొన్నప్పుడు మెదడులోని వివిధ భాగాలు చురుగ్గా పనిచేస్తాయి. దీనివల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు చాలానే ఉన్నాయి. సామాజిక బంధాలు బలంగా ఉన్నవారిలో జ్ఞాపకశక్తికి కేంద్రం(Hippocampus) పరిమాణం తగ్గకుండా ఉంటుందని పరిశోధకులు గుర్తించారు.

ఒత్తిడికి చెక్..

 ఆత్మీయులతో బాధలను పంచుకోవడం వల్ల శరీరంలో 'కార్టిసాల్' వంటి ఒత్తిడి హార్మోన్లు తగ్గి, 'ఆక్సిటోసిన్' వంటి ఆనందాన్నిచ్చే హార్మోన్లు విడుదలవుతాయి. మెదడు చురుగ్గా ఉండటం వల్ల వయసుతో పాటు వచ్చే డిమెన్షియా, అల్జీమర్స్ వంటి వ్యాధుల ముప్పు గణనీయంగా తగ్గుతుంది.

ఒంటరితనం.. నిశ్శబ్ద శత్రువు.. 

నలుగురితో కలవకుండా ఏకాంతంగా ఉండేవారిలో మెదడు నిర్మాణం నెమ్మదిగా క్షీణించే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.సామాజిక సంబంధాలు తక్కువగా ఉన్నవారిలో మెదడులోని 'గ్రే మ్యాటర్' పరిమాణం తగ్గుతున్నట్లు ఎంఆర్ఐ స్కాన్లలో తేలింది.ఒంటరితనం వల్ల మెదడులో ఇన్ఫ్లమేషన్  (Inflammation) పెరిగి, అది కుంగుబాటుకు (Depression) దారితీస్తుంది.

రోజుకు కనీసం 15-20 నిమిషాల పాటు స్నేహితులతో లేదా కుటుంబ సభ్యులతో మనసు విప్పి మాట్లాడటం వల్ల మెదడు ఆరోగ్యం మెరుగుపడుతుంది. కొత్త వ్యక్తులతో పరిచయాలు పెంచుకోవడం మెదడుకు ఒక కొత్త వ్యాయామం లాంటిది. ఆరోగ్యకరమైన ఆహారం, వ్యాయామం ఎంత ముఖ్యమో.. మంచి సామాజిక సంబంధాలు కూడా అంతే ముఖ్యం. కాబట్టి, ఫోన్లకు పరిమితం కాకుండా ప్రత్యక్షంగా మనుషులతో మమేకమవ్వండి.. మీ మానసికంగా ఆరోగ్యంగా ఉండండి..!

 

ఇది కూడా చదవండి..ఆరోగ్యప్రయోజనాలు పొందాలంటే సలాడ్ ను ఏ టైమ్ లో తినాలి..?

ఇది కూడా చదవండి..బ్లడ్ క్యాన్సర్ ను గుర్తించడానికి ఎలాంటి పరీక్షలు చేస్తారు..?

ఇది కూడా చదవండి..విటమిన్ సి లోపించినప్పుడు కనిపించే ముఖ్య లక్షణాలు ఇవే.. 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.