లవ్ హార్మోన్ మనిషికి ఎలా ఉపయోగపడుతుంది..?

సాక్షి లైఫ్ : సామాజిక బంధాలు, భావోద్వేగ సాన్నిహిత్యాన్ని ప్రోత్సహించడంలో "లవ్ హార్మోన్" ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. కౌగిలించుకున్నప్పుడు, తాకినప్పుడు ఆక్సిటోసిన్ స్థాయిలు పెరుగుతాయి, విశ్వాసం, సానుభూతి వంటి భావాలను పెంపొందిస్తుంది. ప్రసవ సమయంలో తల్లి పాలివ్వడంలో, ఆక్సిటోసిన్ తల్లి-శిశువుల బంధాన్ని బలపరుస్తుంది. లోతైన సంబంధాలను సృష్టించడంలో లవ్ హార్మోన్ పాత్రను ఎంతో కీలకమైంది. ఇది ప్రియమైనవారితో సన్నిహితంగా భావించేలా చేసే రసాయనం, ప్రేమించే  సామర్థ్యాన్నిపెంచుతుంది.

 ఇది కూడా చదవండి..పిల్లల్లో ఏకాగ్రతను పెంచే యోగాసనాలు.. 

ఇది కూడా చదవండి..మాన్ సూన్ సీజన్‌లో వచ్చే సాధారణ వ్యాధులు.. 

ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..?


ఆక్సిటోసిన్ ఒక శక్తివంతమైన న్యూరోపెప్టైడ్ లేదా ఒక చిన్న ప్రోటీన్ లాంటి అణువు. ఇది మెదడులో హార్మోన్‌గా, న్యూరోట్రాన్స్‌మిటర్‌గా పనిచేస్తుంది. ఇది హైపోథాలమస్‌ లో ఉత్పత్తి అవుతుంది. పిట్యూటరీ గ్రంధి ద్వారా విడుదల అవుతుంది. ఆక్సిటోసిన్‌ని "లవ్ హార్మోన్" అని కూడా అంటారు. అంతేకాదు "కడల్ హార్మోన్" అని కూడా దీనిని పిలుస్తారు. లవ్ హార్మోన్ అనేది లోతైన మానవ సంబంధాలను, భావోద్వేగ అనుభవాలను సులభతరం చేసే పదార్థం.
 
సెరోటోనిన్ స్థాయిలు..

ఆక్సిటోసిన్, డోపమైన్ ,సెరోటోనిన్ వంటివాటిని "హ్యాపీ హార్మోన్లు"గా భావిస్తారు. ఒక వ్యక్తి పట్ల ఆకర్షితులైనప్పుడు, మెదడు డోపమైన్‌ను విడుదల చేస్తుంది.  అప్పుడు సెరోటోనిన్ స్థాయిలు పెరుగుతాయి. ఆక్సిటోసిన్ ఉత్పత్తి అవుతుంది. అది సానుకూల భావోద్వేగాలను పెంచుతుంది.

ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..? 

ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..? 

ఇది కూడా చదవండి..మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..? 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

Tags : women-health newborn-babies music-lovers new-mothers mother-milk oxytocin love-hormone the-love-hormone oxytocin-is-the-hormone-that-makes-her-feel-good love-hormone-oxytocine oxytocine-hormone oxytocin-love-hormone how-to-increase-oxytocin-levels cuddle cuddle-hormone the-cuddle-hormone cuddles
Newsletter

Please subscribe for more updates...!

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.

Get In Touch

Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034

040 2325 6000

life@sakshi.com

Follow Us

© News. All Rights Reserved. by sakshi.com