Naturally Boost Serotonin : సెరోటోనిన్ పెంచే అమేజింగ్ విజిటబుల్స్..!
సాక్షి లైఫ్ : ప్రస్తుతం ఉరుకుల పరుగుల జీవితంలో ఒత్తిడి (Stress) అనేది ప్రతి ఒక్కరినీ వెంటాడుతున్న సమస్య. ఈ ఒత్తిడి దీర్ఘకాలంగా కొనసాగితే, మనసు ప్రశాంతంగా ఉండటానికి తోడ్పడే సెరోటోనిన్ (Serotonin) అనే 'సంతోషకరమైన హార్మోన్' (Feel-Good Hormone) స్థాయిలు తగ్గుతాయి. సెరోటోనిన్ తగ్గితే డిప్రెషన్, ఆందోళన వంటి సమస్యలు చుట్టుముట్టే ప్రమాదం ఉంది.
ఇది కూడా చదవండి..కిడ్నీలు పనిచేయడం లేదని ఎలా తెలుసుకోవాలి..?
ఇది కూడా చదవండి.. క్షయవ్యాధి ఏయే అవయవాలపై ప్రభావం చూపుతుంది..?
ఇది కూడా చదవండి.. ఫ్యాటీ లివర్ ఏ ఏ అవయవాలపై ప్రభావం చూపుతుంది..?
సెరోటోనిన్ పెంచే కూరగాయలు..
శరీరంలో 90శాతం సెరోటోనిన్ జీర్ణవ్యవస్థలోనే ఉత్పత్తి అవుతుంది. అందుకే, సరైన పోషకాలున్న ఆహారం తీసుకోవాలి. ముఖ్యంగా, సెరోటోనిన్ ఉత్పత్తికి అవసరమైన ట్రిప్టోఫాన్ (Tryptophan) అనే అమైనో యాసిడ్, విటమిన్ బి6, మెగ్నీషియం, ఫోలేట్ అధికంగా ఉండే కూరగాయలను మీ రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవాలి. ఇవి తీసుకోవడం ద్వారా మానసిక ఆరోగ్యం మెరుగవుతుందని అంటున్నారు పోషకాహార నిపుణులు.
పాలకూర (Spinach): మెగ్నీషియం, ఫోలేట్ అధికం. ఇవి ఒత్తిడి హార్మోన్ కార్టిసోల్‌ను తగ్గిస్తాయి. చిలగడ దుంప (Sweet Potato) కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్లు, విటమిన్ B6 వంటివి పుష్కలంగా ఉంటాయి. ఇవి ట్రిప్టోఫాన్‌ను మెదడుకు చేర్చడానికి తోడ్పడతాయి. బ్రోకలీ(Broccoli) సల్ఫోరాఫేన్ (Sulforaphane) అనే సమ్మేళనం మెదడు వాపును తగ్గిస్తుంది, మూడ్ ను మెరుగుపరుస్తుంది.
అవకాడో(Avocado)..ఆరోగ్యకరమైన కొవ్వులు, విటమిన్ B5 (Panthothenic Acid) ఒత్తిడిని తగ్గిస్తాయి. గుమ్మడికాయ(Pumpkin) విటమిన్ B6, ట్రిప్టోఫాన్, మెగ్నీషియం పుష్కలంగా లభిస్తాయి. ప్రశాంతమైన నిద్రకు సహాయపడుతుంది.
ఆకుకూరలు (Leafy Greens).. పాలకూరే కాకుండా మెంతికూర, తోటకూర వంటి వాటిలో ఫోలేట్ ఉంటుంది, ఇది సెరోటోనిన్ తయారీకి చాలా ముఖ్యం. కాలీఫ్లవర్(Cauliflower) కోలిన్ (Choline), విటమిన్ B6 అధికంగా ఉంటుంది. ఇవి మెదడు ఆరోగ్యం, జ్ఞాపకశక్తికి మంచిది. క్యారెట్(Carrots) బీటా కెరోటిన్, యాంటీఆక్సిడెంట్లు మెదడు కణాలను ఒత్తిడి నుంచి రక్షిస్తాయి. ఆస్పరాగస్ (Asparagus)లో ఫోలేట్, ఒమేగా-3 కొవ్వులు ఉంటాయి. ఇవి మూడ్ డిజార్డర్స్‌ను నివారించడంలో సహాయపడతాయి. ఒత్తిడిని కేవలం ఆహారంతోనే కాకుండా, రోజూ కనీసం 30 నిమిషాలు వ్యాయామం (Exercise), ధ్యానం (Meditation), తగినంత నిద్ర అంటే 7 నుంచి 8 గంటలు పొందడం ద్వారా కూడా అదుపులో ఉంచుకోవచ్చు.
ఇది కూడా చదవండి.. టీ లో ఎన్నిరకాల వెరైటీలున్నాయో తెలుసా..?
ఇది కూడా చదవండి..ఆరోగ్యప్రయోజనాలు పొందాలంటే సలాడ్ ను ఏ టైమ్ లో తినాలి..?
ఇది కూడా చదవండి..మంచి కొలెస్ట్రాల్ ను పెంచే దానిమ్మ..
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
