జంక్ ఫుడ్ కూడా కార్డియాక్ అరెస్ట్ కారణమేనా..?
సాక్షి లైఫ్ : కార్డియాక్ అరెస్ట్ అనేది గుండె పనిచేయడం ఆగిపోయినప్పుడు ఈ పరిస్థితి ఏర్పడుతుంది. ఇది ప్రమాదకరమైన పరిస్థితి. ఎందుకంటే గుండె సరైన రీతిలో రక్తాన్ని పంపించకపోతే, మెదడు ఇతర అవయవాలకు ఆక్సిజన్ అందదు. దీంతో ప్రాణాలకే ముప్పు సంభవించవచ్చు. జంక్ ఫుడ్, అధిక చక్కర, మాంసం ఎక్కువగా తినడం. వంశపారంపర్య సమస్యలు: గుండె సంబంధిత జన్యుపరమైన లోపాలు. చదువుల ఒత్తిడి: అధిక ఒత్తిడి కారణంగా కూడా గుండె సమస్యలు వస్తున్నాయి. మెడిసిన్ సైడ్ ఎఫెక్ట్స్: కొన్ని మందుల వాడకం, అవలంబించకపోవడం. మయోకార్డిటిస్: గుండె పటిష్టత తగ్గడం.
ఇటీవల పెద్ద చిన్న అనే తేడాల్లేకుండా గుండె సంబంధిత సమస్యలు వస్తున్నాయి. ముఖ్యంగా చిన్నారుల్లో సైతం కార్డియాక్ అరెస్ట్ కేసులు ఎక్కువగా పెరుగుతున్నాయి. దీనికి కారణాలు ఏమిటి..? ఈ సమస్య రాకుండా ఉండాలంటే ఏమి చేయాలి..? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..?
ఇది కూడా చదవండి..లివర్ సంబంధిత సమస్యలను ఎలా గుర్తించాలి..?
ఇది కూడా చదవండి..40 ఏళ్ల తర్వాత ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకోవచ్చా..?
ఇది కూడా చదవండి..సైనసిటిస్ ఎన్నిరకాలున్నాయంటే..?
కార్డియాక్ అరెస్ట్ ముందు కనిపించే లక్షణాలు..
శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది
తరచూ అలసట
సరిగ్గా ఆహారం తీసుకోకపోవడం
ఛాతీ నొప్పి
అపస్మారక స్థితి
ఈ లక్షణాలు గుర్తించిన వెంటనే వైద్య సహాయం పొందాలి.
అప్పుడు ఏం చేయాలి..?
కార్డియాక్ అరెస్ట్ అనుకోకుండా వస్తుంది. అలాంటప్పుడు
సీపీఆర్: అపస్మారక స్థితిలో ఉంటే, వెంటనే సీపీఆర్ చేయాలి.
ఎమర్జెన్సీ చికిత్స: తక్షణం కార్డియాలజిస్ట్ దగ్గరికు తీసుకెళ్లి అవసరమైన చికిత్స అందించాలి. కార్డియాక్ అరెస్ట్ చిన్నారుల్లో కూడా వచ్చే అవకాశాలున్నాయి. కాబట్టి పాఠశాలల్లో, ఇళ్లలో తగిన జాగ్రత్తలు తీసుకోవల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రాథమిక చికిత్స, తగిన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఈ సమస్య నుంచి బయట పడవచ్చు.
ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనలకు బెస్ట్ సొల్యూషన్
ఇది కూడా చదవండి..సైనసిటిస్ ఎన్నిరకాలున్నాయంటే..?
ఇది కూడా చదవండి..మందులతో పని లేకుండా బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గేదెలా..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
