గోళ్లలో ఈ 5 లక్షణాలు కనిపిస్తే లివర్ ప్రాబ్లమ్ ఉన్నట్టే.. 

షేర్ చేయండి:
గోళ్లలో ఈ 5 లక్షణాలు కనిపిస్తే లివర్ ప్రాబ్లమ్ ఉన్నట్టే.. 

సాక్షి లైఫ్ : నేటి బిజీ జీవితంలో ఆహారపు అలవాట్లు, జీవలనశైలి అలవాట్ల  కారణంగా అనేక రకాల వ్యాధులు పెరుగుతున్నాయి. వీటిలో ఒకటి ఫ్యాటీ లివర్ సమస్య. ఈ వ్యాధి కాలేయంలో అధిక కొవ్వు పేరుకుపోవడం వల్ల వస్తుంది, దీని ప్రారంభ సంకేతాలు గోళ్లలో కనిపిస్తాయి. ఈ లక్షణాలను విస్మరించవద్దు. వెంటనే వైద్యుడిని సంప్రదించండి.

ఇది కూడా చదవండి..30కి పైగా వ్యాధికారక క్రిముల జాబితాను విడుదల చేసిన వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్.. 

ఇది కూడా చదవండి..మలప్పురంలోని పాండిక్కాడ్ నుంచి సేకరించిన గబ్బిలాల నమూనాల్లో నిఫా వైరస్ యాంటీబాడీస్..

ఇది కూడా చదవండి..పొద్దున్నే నిద్ర లేవగానే అలసటగా అనిపిస్తుందా..? కారణాలు ఇవే కావచ్చు.. 

 

మనం ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటే, శరీరాన్ని అనేక తీవ్రమైన వ్యాధుల నుంచి రక్షించవచ్చని వైద్యనిపుణులు చెబుతున్నారు.   ఆరోగ్యకరమైన ఆహారం తీసుకున్నప్పుడు, శరీరానికి పూర్తి పోషకాహారం లభిస్తుంది. అయితే, నేటి కాలంలో ఇది సాధ్యం కాదు. దీని వెనుక చాలా కారణాలు ఉండవచ్చు. ఇంట్లో పనిచేసే ప్రతి ఒక్కరూ, సమయం లేకపోవడంవంటివి కావొచ్చు.

ఈ కారణంగా, ప్రజలు ఎక్కువగా ప్రాసెస్ చేసిన ఆహారాన్ని తీసుకోవల్సివస్తోంది. రెడీమేడ్ ఫుడ్ ను తీసుకోవడం వల్ల సమయాన్ని ఆదా చేసుకోవచ్చని భావిస్తారు. కానీ ఈ అలవాటు శరీరానికి తీవ్రమైన నష్టాన్ని కలిగిస్తుంది. దీని కారణంగా, చాలా మందిలో ఫ్యాటీ లివర్ సమస్య తలెత్తుతోంది. కాలేయంలో సాధారణం కంటే ఎక్కువ కొవ్వు పేరుకుపోయినప్పుడు ఫ్యాటీ లివర్ సమస్య వస్తుంది. ఈ వ్యాధిని సకాలంలో గుర్తించినట్లయితే, చికిత్స సాధ్యమవుతుంది.

ఏదైనా వ్యాధి వచ్చినప్పుడు, లేదా వచ్చేముందు శరీరం ముందుగానే కొన్ని సంకేతాలను ఇవ్వడం ప్రారంభిస్తుంది. వాటిని గుర్తించడం చాలా ముఖ్యం. వాస్తవానికి, గోళ్లలో కొన్ని మార్పులు కాలేయ సంబంధిత వ్యాధులను కూడా సూచిస్తాయి. ముఖ్యంగా గోళ్లలో కనిపించే కొన్ని సంకేతాలను గురించి మీరు అస్సలు విస్మరించకూడదు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. 

గోళ్ల రంగులో మార్పు.. 

కాలేయ సంబంధిత వ్యాధులు ఉన్నప్పుడు, గోళ్ల రంగు మారడం ప్రారంభమవుతుంది. కొన్ని సార్లు గోళ్ల రంగు చాలా పాలిపోయినట్లు లేదా పసుపు రంగులో కనిపించడం ప్రారంభమవుతుంది. ఈ లక్షణాలను గుర్తించినట్లయితే, వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.

పసుపు లేదా ఎరుపు గీతలు ఏర్పడటం

కొన్నిసార్లు, కాలేయ సంబంధిత వ్యాధుల విషయంలో, మన గోళ్లపై ఎరుపు లేదా పసుపు గీతలు ఏర్పడటం ప్రారంభమవుతుంది. మీరు ఈ గీతలను గమనిస్తుంటే, ఖచ్చితంగా కాలేయ పరీక్ష చేయించుకోవాలి. దీనిని విస్మరించడం వల్ల వ్యాధులు మరింతగా పెరిగే ప్రమాదం ఉంది.


తెల్లని మచ్చలు.. 

గోళ్లపై చిన్న తెల్లని మచ్చలు కనిపిస్తే, కాలేయ సమస్య ఉండవచ్చని అర్థం చేసుకోండి. ఇది ప్రోటీన్ లేకపోవడం లేదా కాలేయం సరిగ్గా పనిచేయకపోవడం వల్ల కూడా కావచ్చు. ఈ లక్షణాలు చాలా కాలం పాటు కనిపిస్తే, ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.

గోళ్లు విరిగడం..  

 కాలేయ వ్యాధి విషయంలో, గోళ్ల మందంలో కూడా మార్పులు కనిపిస్తాయి. దీని కారణంగా గోళ్లు సన్నగా, బలహీనంగా మారుతాయి. తద్వారా తరచుగా గోళ్లు విరిగిపోయే ప్రమాదం ఉంటుంది.

గోళ్ల ఆకారం మారడం..  

కాలేయ సంబంధిత వ్యాధుల విషయంలో, గోళ్ల ఆకారంలో కూడా మార్పులు కనిపిస్తాయి. గోరు ముందు భాగం పైకి లేచి లేదా కిందికి వంగి కనిపిస్తుంది.

 

ఇది కూడా చదవండి..ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ అంటే ఏమిటి..?  

ఇది కూడా చదవండి.. టాటూ వేయించుకున్న వాళ్లు రక్తదానంచేయకూడదా..? 

 

ఇలాంటి కచ్చితమైన ఆరోగ్య సమాచారాన్ని అనుభవజ్ఞులైన వైద్య నిపుణులు అందించే మరిన్ని విషయాలను గురించి మీరు తెలుసుకోవాలంటే సాక్షి లైఫ్ ను ఫాలో అవ్వండి..  

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.