పొద్దున్నే నిద్ర లేవగానే అలసటగా అనిపిస్తుందా..? కారణాలు ఇవే కావచ్చు.. 

సాక్షి లైఫ్ : ఉదయం లేవగానే సహజంగా చాలా ఫ్రెష్‌గా అనిపిస్తుంది. కానీ కొంతమందిలో అలసటగా అనిపిస్తుంది.. అంతేకాదు పొద్దున లేచినప్పటి నుంచి ఏ పనీ చేయాలనిపించక పోవడంతోపాటు అలసిపోయినట్లుగా అనిపిస్తుంది. ఇలాంటి లక్షణాలను ఏమాత్రం అశ్రద్ధ చేయవద్దని  వైద్యనిపుణులు చెబుతున్నారు. ఇలా అలసిపోవడానికి అనేక కారణాలు ఉన్నాయి. పొద్దున్నే నిద్రలేవగానే అలసటగా అనిపించడం అనేది కొన్ని వ్యాధుల సాధారణ లక్షణం అని వారు సూచిస్తున్నారు. 

ఇది కూడా చదవండి..పుచ్చకాయ తినడం వల్ల కలిగే ఆరోగ్యప్రయోజనాలు తెలుసా..?

ఇది కూడా చదవండి..వరల్డ్ డైజెస్టివ్ హెల్త్ డే ఎలా మొదలైంది..?

ఇది కూడా చదవండి..వాక్సిన్ గురించి వాస్తవాలు- అవాస్తవాలు..  

డీహైడ్రేషన్ .. 

నిద్ర సరిగా పట్టకపోతే ఉదయాన్నే అలసటగా అనిపించవచ్చు. మనకు 7-8 గంటల నిరంతర నిద్ర అవసరం. డీహైడ్రేషన్ కూడా అలసటకు కారణం కావచ్చు. శరీరానికి తగినంత నీరు అందకపోతే అది శరీరంలోని అమినో యాసిడ్ స్థాయిలను ప్రభావితం చేస్తుంది. అమైనో ఆమ్లాలు లేకపోతే, సెరోటోనిన్‌ను మెలటోనిన్‌గా మార్చే ప్రక్రియ నిరోధించబడుతుంది.

మానసిక ఒత్తిడి.. 

అలాగే ఏదైనా హార్మోన్ల అసమతుల్యత కారణంగా కూడా అలసటగా అనిపిస్తుంది. ముఖ్యంగా థైరాయిడ్‌కు సంబంధించిన సమస్య అయితే  జీవక్రియను ప్రభావితం చేస్తుంది. ఆహారం ద్వారా సరైన మొత్తంలో శక్తి, పోషకాలు, విటమిన్లు శరీరానికి అందకపోతే అలసిపోయినట్లు అనిపించవచ్చని వైద్యనిపుణులు వెల్లడిస్తున్నారు. అలాగే, తీవ్రమైన మానసిక ఒత్తిడి లేదా డిప్రెషన్ కూడా అలసటకు కారణమవుతుంది.

ఇది కూడా చదవండి..ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ అంటే ఏమిటి..?  

ఇది కూడా చదవండి..టాటూ వేయించుకున్న వాళ్లు రక్తదానంచేయకూడదా..?

ఇలాంటి కచ్చితమైన ఆరోగ్య సమాచారాన్ని అనుభవజ్ఞులైన వైద్య నిపుణులు అందించే మరిన్ని విషయాలను గురించి మీరు తెలుసుకోవాలంటే సాక్షి లైఫ్ ను ఫాలో అవ్వండి..  

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

 

Tags : mental-health depression tensions mental-tensions stress brain-food sleep-paralysis sleep-quality morning sleeping-position sleep sleeping hypertension healthy-sleep obstructive-sleep-apnea feel-tired wake-up
Newsletter

Please subscribe for more updates...!

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.

Get In Touch

Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034

040 2325 6000

life@sakshi.com

Follow Us

© News. All Rights Reserved. by sakshi.com