సాక్షి లైఫ్ : వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ (డబ్ల్యూ హెచ్ ఓ)30కి పైగా వ్యాధికారక క్రిముల జాబితాను విడుదల చేసింది. కొత్తగా చేర్చిన జాబితాలో ఇన్‌ఫ్లుఎంజా ఏ, డెంగ్యూ, మంకీపాక్స్, కలరా,ప్లేగు వంటి వ్యాధులకు కారణమయ్యే కొత్త బ్యాక్టీరియా జాతులు ఉన్నాయి. వాటి అధిక వ్యాప్తి, వ్యాక్సిన్‌ల కొరతను గురించి తెలియజేస్తూ పరిశోధన, సంసిద్ధతకు ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) తదుపరి మహమ్మారిని ప్రేరేపించగల వ్యాధికారక జాబితాను విడుదల చేసింది. వ్యాధికారక క్రిముల సంఖ్య 30కి పైగా పెరిగింది.
ఇది కూడా చదవండి.. ఒత్తిడిని ఫుడ్ చేంజెస్ చేయడం ద్వారా తగ్గించవచ్చా..?
ఇది కూడా చదవండి..నోటి దుర్వాసనను తగ్గించే చిట్కాలు
ఇది కూడా చదవండి..ఆరోగ్యంగా ఉన్నవాళ్లకు ప్రోటీన్ సప్లిమెంట్లు అవసరంలేదంటున్న వైద్యులు..
ఇది కూడా చదవండి..మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..?
వ్యాధికారక క్రిములు..
" ప్రాధాన్యతా వ్యాధికారక క్రిములు, మహమ్మారి వ్యాధుల నుంచి ముందు జాగ్రత్తలు తీసుకోవడానికి ప్రజలలో అవగాహనా కలిగించేందుకు ఎంపిక చేశారు. ఎందుకంటే వీటిలో ఇంకా పూర్తిస్థాయి చికిత్స అందుబాటులో లేదు. కాబట్టి అంతా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నొక్కి చెప్పింది. ఏఈ వివరాలు జూలై 30న నేచర్ నివేదికలో ప్రచురించారు.
తీవ్రమైన వ్యాధులకు సంబంధించి..
ఎక్కువగా వ్యాపించే వ్యాధికారక క్రిములు, తీవ్రమైన వ్యాధులకు సంబంధించి వ్యాక్సిన్‌లు, చికిత్స పూర్తిస్థాయిలో అందుబాటులో లేవు. 2017, 2018లో దాదాపు డజను ప్రాధాన్యత కలిగిన వ్యాధికారకాలను గుర్తించినట్లు నేచర్ నివేదిక పేర్కొంది. 200 కంటే ఎక్కువ మంది శాస్త్రవేత్తలు 1,652 వ్యాధికారక జాతులపై సాక్ష్యాలను అంచనా వేయడానికి రెండు సంవత్సరాలుపాటు పరిశోధనలు చేశారు. జనాలపై ఎక్కువగా ప్రభావం చూపే వైరస్లు, కొన్ని బ్యాక్టీరియాలలో వేటిని జాబితాలోచేర్చాలో నిర్ణయించారు.
వ్యాధికారక కొత్త జాబితాలో ఇన్‌ఫ్లుఎంజా ఏ వైరస్, డెంగ్యూ వైరస్ ,మంకీపాక్స్ వైరస్ ఉన్నాయి. ఇది ఇటీవల యునైటెడ్ స్టేట్స్లో పశువులలో వ్యాప్తికి కారణమైన సబ్టైప్ H5తో సహా అనేక రకాల ఇన్ఫ్లుఎంజా ఏ వైరస్లను కలిగి ఉంది. ఐదు కొత్త బ్యాక్టీరియా జాతులు జోడించారు. ఇవి కలరా, ప్లేగు, డయేరియా, న్యుమోనియా వంటి వ్యాధులకు కారణమవుతాయి.
ఇటీవల భారతదేశంలో కనుగొన్న నిఫా వైరస్ కూడా ఈ జాబితాలో ఉంది. ఆగ్నేయాసియా ప్రాంతంలో ప్రాధాన్యత కలిగిన వ్యాధికారకాలైన విబ్రియో కలరా O139, షిగెల్లా డైసెంటెరియా సెరోటైప్ 1, హెనిపావైరస్ నిపాహెన్స్, బాండావైరస్ డాబియన్స్, ఆర్థోఫ్లావివైరస్ డెంగ్యూ , జికాన్స్, ఆల్ఫావైరస్ చికున్‌గున్యా, ప్రోటోటైప్ పాథోజెన్‌ల జాబితాను కూడా విడుదల చేసింది. ఇది "ప్రాథమిక-శాస్త్ర అధ్యయనాలు, చికిత్సలు, టీకాల అభివృద్ధికి మోడల్ జాతులుగా పని చేస్తుంది" అని నేచర్ నివేదిక వెల్లడించింది.
ఇది కూడా చదవండి..నెయ్యి వేడి నీటిలో కలిపి తాగితే ఆరోగ్యానికి ఎంత మంచిదో తెలుసా..?
ఇది కూడా చదవండి.. క్రానిక్ సైనసిటిస్ కు అక్యూట్ సైనసిటిస్ తేడా ఏంటి..?
ఇలాంటి కచ్చితమైన ఆరోగ్య సమాచారాన్ని అనుభవజ్ఞులైన వైద్య నిపుణులు అందించే మరిన్ని విషయాలను గురించి మీరు తెలుసుకోవాలంటే సాక్షి లైఫ్ ను ఫాలో అవ్వండి..
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
Tags :
Please subscribe for more updates...!
గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.
Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034
040 2325 6000
life@sakshi.com
© News. All Rights Reserved. by sakshi.com