Digestive System : జీర్ణ వ్యవస్థకు ఈ 6 అలవాట్లే రక్ష.. గ్యాస్, అజీర్తికి చెక్ పెట్టండిలా..!
సాక్షి లైఫ్ : మనిషి ఆరోగ్యానికి పునాది జీర్ణవ్యవస్థ. మనం తిన్న ఆహారం సక్రమంగా జీర్ణమైతేనే శరీరానికి అవసరమైన పోషకాలు అందుతాయి. జీర్ణక్రియ మందగిస్తే అది కేవలం కడుపునొప్పి లేదా గ్యాస్ సమస్యలకే పరిమితం కాదు.. గుండె, మెదడు, రోగనిరోధక శక్తిపై కూడా తీవ్ర ప్రభావం చూపుతుంది. అందుకే ఆరోగ్యంగా ఉండాలంటే ముందుగా మన 'గట్'ను ఆరోగ్యంగా ఉంచుకోవాలి. నిపుణులు సూచిస్తున్న ఆ 6 కీలక సూత్రాలు ఇవే..
ఇది కూడా చదవండి..ఒత్తిడిని ఫుడ్ చేంజెస్ చేయడం ద్వారా తగ్గించవచ్చా..?
ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..?
ఇది కూడా చదవండి..హార్ట్ ఎటాక్ తర్వాత తొలి 60 నిమిషాలు ఎందుకంత కీలకం..?
ఇది కూడా చదవండి..Revisiting Old Books: మానసిక ఆరోగ్యానికి ' చదివిన పుస్తకాలు మళ్లీ చదవడం' దివ్యౌషధం..
1. పీచుతోనే పరిశుభ్రం..
ఆహారంలో ఫైబర్ ఎంత ఎక్కువగా ఉంటే జీర్ణవ్యవస్థ అంత చురుగ్గా ఉంటుంది. పీచు పదార్థం పేగులను ఎప్పటికప్పుడు శుభ్రం చేయడమే కాకుండా, అక్కడ పెరిగే మేలు చేసే బ్యాక్టీరియాకు అనువైన వాతావరణాన్ని కల్పిస్తుంది. తృణధాన్యాలు, ఆకుకూరలు, తాజా పండ్లను మీ భోజనంలో తప్పనిసరిగా చేర్చుకోండి.
2. తాగు నీరే కీలకం..
శరీరంలో నీటి శాతం తగ్గితే అది మలబద్ధకానికి దారితీస్తుంది. ఇది పేగుల్లోని మంచి బ్యాక్టీరియా మనుగడకు చేటు చేస్తుంది. రోజుకు కనీసం 8 నుంచి 10 గ్లాసుల నీరు తాగడం అలవాటు చేసుకోవాలి. నీటితో పాటు కొబ్బరి నీళ్లు, మజ్జిగ, నిమ్మరసం వంటి ద్రవపదార్థాలు జీర్ణక్రియను సులభతరం చేస్తాయి.
3. 'ప్రోబయోటిక్స్'..
పేగుల ఆరోగ్యాన్ని కాపాడే మంచి బ్యాక్టీరియాను పెంచడంలో ప్రోబయోటిక్స్ దివ్యౌషధంగా పనిచేస్తాయి. ఇంట్లో తయారుచేసిన పెరుగు, మజ్జిగ, పులియబెట్టిన పదార్థాలను తీసుకోవడం వల్ల జీర్ణశక్తి మెరుగుపడుతుంది. ఇది ఇన్ఫెక్షన్ల నుంచి కూడా కాపాడుతుంది.
4. గాఢ నిద్ర.. గట్ భద్రం..
నిద్రకు, జీర్ణవ్యవస్థకు అవినాభావ సంబంధం ఉంది. నిద్రలేమి వల్ల కలిగే మానసిక ఒత్తిడి నేరుగా పేగుల పనితీరుపై ప్రభావం చూపుతుంది. ప్రతిరోజూ 7 నుంచి 8 గంటల గాఢ నిద్ర ఉండటం వల్ల జీర్ణ అవయవాలు విశ్రాంతి పొంది, మరుసటి రోజుకు సిద్ధమవుతాయి.
5. ప్రాసెస్ చేసిన ఆహారానికి దూరం..
ప్యాక్ చేసిన ఆహారాలు, అధిక ఉప్పు, చక్కెర, నూనెతో కూడిన జంక్ ఫుడ్‌కు స్వస్తి చెప్పాలి. ఇవి పేగుల్లోని సూక్ష్మజీవుల సమతుల్యతను దెబ్బతీస్తాయి. చిరుతిండ్లు తినాలనిపిస్తే నట్స్, గింజలు లేదా పండ్ల వంటి సహజ సిద్ధమైన వాటిని ఎంచుకోవడం ఉత్తమం.
6. నెమ్మదిగా.. నమిలి తినండి..
జీర్ణక్రియ నోటి నుంచే ప్రారంభమవుతుంది. ఆహారాన్ని హడావిడిగా మింగేయకుండా, బాగా నమిలి తినడం వల్ల లాలాజలంతో కలిసి ఆహారం సులభంగా జీర్ణమవుతుంది. ఇది జీర్ణకోశంపై భారాన్ని తగ్గిస్తుంది. ఆరోగ్యకరమైన జీవనశైలితోనే జీర్ణ సంబంధిత సమస్యలను దూరం చేయవచ్చు. ఆహారపు అలవాట్లలో చేసే చిన్న చిన్న మార్పులే పెద్ద ఫలితాలను ఇస్తాయి.
ఇది కూడా చదవండి..నోటి దుర్వాసనను తగ్గించే చిట్కాలు
ఇది కూడా చదవండి..సిండ్రోమ్ Xకు ప్రారంభ దశలో ఎలాంటి చికిత్సను అందిస్తారు..?
ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..?
ఇది కూడా చదవండి..మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..?
ఇది కూడా చదవండి..కిడ్నీలు పనిచేయడం లేదని ఎలా తెలుసుకోవాలి..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..
