యూరిక్ యాసిడ్‌ను సహజంగా తగ్గించే 6 సూపర్‌ఫుడ్స్..
సాక్షి లైఫ్ : అధిక యూరిక్ యాసిడ్ స్థాయిలు (హైపర్‌యూరిసీమియా) గౌట్, కిడ్నీ స్టోన్స్, కీళ్ల నొప్పి వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు కారణమవుతాయి. హెల్త్‌షాట్స్‌లో ప్రచురితమైన ఒక నివేదిక ప్రకారం, కొన్ని సూపర్‌ఫుడ్స్‌ను ఆహారంలో చేర్చుకోవడం ద్వారా యూరిక్ యాసిడ్ స్థాయిలను సహజంగా తగ్గించవచ్చు.
ఇది కూడా చదవండి..మెటబాలిజం పెరగాలంటే.. ఈ ఆహారాలు, పానీయాలు తీసుకోండి!
ఇది కూడా చదవండి..చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించే పైనాపిల్ జ్యూస్..
ఇది కూడా చదవండి..ఆటిజంకు జీర్ణ వ్యవస్థకు, మెదడుకు సంబంధం : న్యూ స్టడీ
ఈ ఆహారాలు ప్యూరిన్‌లు (యూరిక్ యాసిడ్‌గా మారే సమ్మేళనాలు) తక్కువగా ఉండి, మూత్రపిండాల పనితీరును మెరుగుపరిచే పోషకాలతో నిండి ఉంటాయి. యూరిక్ యాసిడ్‌ను సహజంగా తగ్గించే 6 సూపర్‌ఫుడ్స్ ను గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
చెర్రీస్..
చెర్రీస్‌లో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు గల ఆంథోసైనిన్స్ ఉంటాయి, ఇవి యూరిక్ యాసిడ్ స్థాయిలను తగ్గించి, కీళ్లలో దాని స్ఫటికీకరణను నిరోధిస్తాయి. ఆర్థరైటిస్ అండ్ రుమటాలజీ జర్నల్‌లో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం, చెర్రీస్ తినడం ద్వారా గౌట్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. చెర్రీస్‌ను స్నాక్‌గా తినడం లేదా చక్కెర లేని చెర్రీ జ్యూస్ తాగడం ఉత్తమం.
అరటిపండ్లు..
అరటిపండ్లు ప్యూరిన్‌లు తక్కువగా కలిగి, పొటాషియం అధికంగా ఉంటాయి, ఇవి శరీరంలో ఆమ్ల, క్షార సమతుల్యతను కాపాడతాయి. అరటిపండ్లు హైడ్రేషన్‌ను కూడా ప్రోత్సహిస్తాయి.
ఆపిల్స్..
ఆపిల్స్‌లో డైటరీ ఫైబర్, మాలిక్ యాసిడ్ సమృద్ధిగా ఉంటాయి, ఇవి రక్తంలో యూరిక్ యాసిడ్‌ను శోషించి, తొలగించడంలో సహాయపడతాయి. ఆసియా పసిఫిక్ జర్నల్ ఆఫ్ క్లినికల్ న్యూట్రిషన్ ఆపిల్స్ యూరిక్ యాసిడ్‌ను తగ్గించడంలో ప్రభావవంతంగా ఉంటాయని తెలిపింది.
సిట్రస్ ఫ్రూట్స్..
నారింజ, నిమ్మకాయలు విటమిన్ "సి", సిట్రిక్ యాసిడ్‌లో సమృద్ధిగా ఉంటాయి, ఇవి మూత్రం ద్వారా యూరిక్ యాసిడ్ విసర్జనను పెంచుతాయి. విటమిన్ సి గౌట్ ప్రమాదాన్ని తగ్గిస్తుందని ఓ అధ్యయనంలో వెల్లడైంది.
కాఫీ..
ది అమెరికన్ జర్నల్ ఆఫ్ క్లినికల్ న్యూట్రిషన్లోని పరిశోధన ప్రకారం, కాఫీ తాగడం గౌట్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. అయితే, ఇతర అనారోగ్య సమస్యలు ఉన్నవారు కాఫీని తీసుకునే ముందు వైద్యులను సంప్రదించాలి.
గ్రీన్ టీ..
గ్రీన్ టీలోని పాలీఫెనాల్స్ వంటి యాంటీఆక్సిడెంట్స్ మూత్రపిండాల పనితీరును మెరుగుపరుస్తాయి. శరీరంలో వాపును తగ్గిస్తాయి. దీనిని మితంగా తీసుకోవాలని వైద్యనిపుణులు సూచిస్తున్నారు.
ఇది కూడా చదవండి..మీ ఆహారంలో బ్రౌన్ రైస్‌ని చేర్చుకునే మార్గాలు..
ఇది కూడా చదవండి..ఆరోగ్యంగా ఉండాలంటే రోజుకి ఎన్నిగుడ్లు తినాలి..?
ఇది కూడా చదవండి..చలికాలంలో రోగనిరోధక శక్తినిపెంచే మెగ్నీషియం..
ఇది కూడా చదవండి..మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
