ఫిట్‌గా, ఆరోగ్యంగా ఉండడానికి కొరియన్ జీవనశైలి 7 అద్భుతమైన హెల్తీ  టిప్స్.. 

సాక్షి లైఫ్ : కొరియన్ జీవనశైలి సరళమైనది, అనుసరించడం సులభం. ఈ అలవాట్లను రోజువారీ జీవితంలో చేర్చుకుంటే ఆరోగ్యం, ఫిట్‌నెస్ రెండూ మెరుగవుతాయి," అని ఫిట్‌నెస్ నిపుణులు చెబుతున్నారు. కొరియన్లు తమ ఆరోగ్యం, ఫిట్‌నెస్‌తో ప్రపంచవ్యాప్తంగా అందరినీ ఆకట్టుకుంటారు. వారి జీవనశైలిలోని కొన్ని సరళమైన అలవాట్లు మనల్ని కూడా ఆరోగ్యవంతులుగా మార్చగలవు. కొరియన్ జీవనశైలి నుంచి 7 ఉత్తమ టిప్స్ ఇవిగో..!

ఇది కూడా చదవండి..డిప్రెషన్ ఉన్న వారిలో ఎలాంటి మార్పులు కనిపిస్తాయి..?

ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..?

 సమతుల ఆహారం.. 

కొరియన్ ఆహారంలో కూరగాయలు, రైస్, సీ ఫుడ్ ప్రధానం. ఫైబర్, ప్రోటీన్ ఎక్కువగా ఉండే ఈ ఆహారం జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. రోజూ రంగురంగుల కూరగాయలను తినడం అలవాటు చేసుకోండి.

 చిన్న పోర్షన్స్ తినడం..  

కొరియన్లు ఒకేసారి ఎక్కువ ఆహారం తినరు. చిన్న చిన్న పోర్షన్స్‌లో వివిధ రకాల వంటకాలను ఆస్వాదిస్తారు. ఈ అలవాటు అతిగా తినడాన్ని నివారిస్తుంది, బరువును నియంత్రిస్తుంది.

 క్రమం తప్పకుండా నడక.. 

కొరియన్లు చురుకుగా ఉండటానికి నడకను ఇష్టపడతారు. రోజూ కనీసం 30 నిమిషాలు నడవడం లేదా సైక్లింగ్ చేయడం వారి జీవనశైలిలో భాగంగా చేసుకుంటారు. కాబట్టి మీ రోజువారీ షెడ్యూల్‌లో నడక తప్పనిసరిగా ఉండాలి.

 తగినంత నీరు తాగడం.. 
 
కొరియన్లు నీరు, బార్లీ నీళ్లు వంటి ఆరోగ్యకరమైన పానీయాలను ఎక్కువగా తాగుతారు. ఇవి శరీరాన్ని హైడ్రేట్ చేస్తాయి, జీవక్రియను మెరుగుపరుస్తాయి. రోజూ 2-3 లీటర్ల నీరు తాగండి.

 స్కిన్‌కేర్‌..  

కొరియన్లు స్కిన్‌కేర్‌ను ఆరోగ్యంలో భాగంగా భావిస్తారు. సహజసిద్ధమైన ఉత్పత్తులతో చర్మ సంరక్షణను కాపాడనుకోవడం వారికి అలవాటు.  

 తక్కువ చక్కెర..  

కొరియన్ వంటల్లో చక్కెర తక్కువగా ఉంటుంది. సహజ స్వీటెనర్స్ లేదా తేనెను ఎక్కువగా ఉపయోగిస్తారు. డయాబెటిస్, ఊబకాయం నివారణకు చక్కెర తగ్గించడం మంచిది.

 సమాజంతో కలిసి ఉండటం.. 

కొరియన్లు కుటుంబం, స్నేహితులతో సమయం గడపడాన్ని ప్రాధాన్యం ఇస్తారు. ఇది మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది, ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. సామాజిక కార్యకలాపాల్లో పాల్గొనాలి.

 

ఇది కూడా చదవండి..ప్లేట్‌లెట్ కౌంట్ ను ఎలా పెంచుకోవచ్చు..? 

ఇది కూడా చదవండి..థ్రోంబోసైట్లు అంటే ఏమిటి..?

 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

Tags : mental-health lifestyle sedentary-lifestyle healthy-lifestyle poor-lifestyle healthy-lifestyle-tips healthy-lifestyle-habits healthy-lifestyle-tips-for-children 5-healthy-lifestyle-tips-for-children korean-diet-weight-loss korean-diets-to-lose-weight-fast lifestyle-medicine building-lifestyle digital-lifestyle
Newsletter

Please subscribe for more updates...!

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.

Get In Touch

Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034

040 2325 6000

life@sakshi.com

Follow Us

© News. All Rights Reserved. by sakshi.com