Ultra-Processed Food : సూపర్‌మార్కెట్ ఫుడ్‌లో 85% ‘అల్ట్రా-ప్రాసెస్డ్’.. ఆ రెండు వ్యాధులకు ప్రధాన కారణం ఇదే..!
సాక్షి లైఫ్ : నేటి ఆధునిక జీవనశైలిలో సూపర్ మార్కెట్లలో లభించే ప్యాకేజ్డ్ (నిల్వ ఉంచిన) ఆహారమే ప్రధానంగా మారింది. అయితే, ఈ ఆహారంలో అత్యధిక భాగం అంటే దాదాపు 85 శాతం 'అల్ట్రా-ప్రాసెస్డ్' అతిగా శుద్ధి చేసిన కేటగిరీకి చెందుతోందని ప్రముఖ పోషకాహార నిపుణుడు ప్రొఫెసర్ జిమ్ మాన్ ఆందోళన వ్యక్తం చేశారు. ఇది ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతోందని, ముఖ్యంగా ఊబకాయం (Obesity), మధుమేహం (Diabetes) వంటి దీర్ఘకాలిక వ్యాధులు పెరగడానికి ప్రధాన కారణంగా మారుతోందని ఆయన హెచ్చరించారు.
ఇది కూడా చదవండి..Anti-Aging Strategies : జీవ గడియారాన్ని వెనక్కి తిప్పే శాస్త్రీయ మార్గాలు..?
ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..?
ఇది కూడా చదవండి..Weight loss : బరువు తగ్గడం కోసం 'ఫేక్ ఫాస్టింగ్' ఉపయోగపడుతుందా..?
ప్రమాద ఘంటికలు..
అల్ట్రా-ప్రాసెస్డ్ ఫుడ్స్ (UPFs) అంటే అధిక స్థాయిలో రసాయన మార్పులు, రుచులు, రంగులు, ప్రిజర్వేటివ్‌లు కలిపి తయారుచేసిన పారిశ్రామిక ఆహారాలు. ఉదాహరణకు.. ప్యాకెట్ స్నాక్స్ ,చిప్స్, కూల్ డ్రింక్స్, పండ్ల రసాలు, తయారుగా ఉండే భోజనాలు (Ready-to-eat meals), కొన్ని రకాల బ్రెడ్, బిస్కెట్లు, కేకులు..
వీటిలో ఉప్పు, చక్కెర, అనారోగ్యకరమైన కొవ్వులు (Trans Fats) అధికంగా ఉండి, పీచు పదార్థం (Fiber) చాలా తక్కువగా ఉంటుంది. ఈ పదార్థాలు మన శరీరంలోకి చేరి తక్కువ సమయంలోనే కొవ్వుగా మారేందుకు దోహదపడతాయి.
నిపుణుల పరిశీలన ఏమంటోంది..?
ప్రొఫెసర్ మాన్ న్యూజిలాండ్‌కు చెందిన పోషకాహార నిపుణులు వంటి అంతర్జాతీయ నిపుణులు చేపట్టిన అధ్యయనాల ప్రకారం, ఆహార వ్యవస్థలో ఈ అల్ట్రా-ప్రాసెస్డ్ ఫుడ్స్(UPF)ల వాటా పెరగడం ప్రజారోగ్యానికి పెనుముప్పుగా మారుతోంది. ఈ ఆహారాల అధిక వినియోగం వల్ల అధిక బరువు (Overeating)..ఇవి రుచిగా ఉండి, ఎక్కువ తినేలా ప్రేరేపిస్తాయి.
పోషకాహార లోపం.. సహజ సిద్ధమైన పండ్లు, కూరగాయలు, తృణధాన్యాల స్థానాన్ని ఈ అల్ట్రా-ప్రాసెస్డ్ ఫుడ్స్ ఆక్రమించడంతో పోషకాలు లోపిస్తున్నాయి. గుండె జబ్బులు, టైప్ 2 మధుమేహం, అధిక రక్తపోటు వంటి 32 రకాల ఆరోగ్య సమస్యలకు ఇవి కారణమవుతున్నట్లు 'ది లాన్సెట్' జర్నల్‌లో ప్రచురించిన నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.
ఏం చేయాలి..?
ఈ ప్రమాదకర పరిస్థితిని ఎదుర్కోవాలంటే కేవలం వినియోగదారులపై భారం మోపకుండా, ప్రభుత్వాలు, ఆహార సంస్థలు కూడా కఠిన చర్యలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. లేబులింగ్ (Labeling).. ప్యాకెట్ల ముందు భాగంలోనే ఉప్పు, చక్కెర, కొవ్వు వివరాలు స్పష్టంగా ప్రదర్శించాలి. పిల్లలను లక్ష్యంగా చేసుకునే ప్రకటనలను నిషేధించాలి.
ఇంటి ఆహారానికి ప్రాధాన్యం ఇవ్వాలి. వీలైనంత వరకు ఇంట్లో వండిన తాజా, తక్కువ శుద్ధి చేసిన ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి.
ఇది కూడా చదవండి..Diabetes : డయాబెటిస్ ను అదుపులో ఉంచుకోవడానికి ఎలాంటి ఆహార నియమాలు పాటించాలి..?
ఇది కూడా చదవండి..రాత్రి 9 గంటల తర్వాత డిన్నర్ చేయడం వల్ల కలిగే నష్టాలు ఇవే....?
ఇది కూడా చదవండి..రోజూ బెల్లం తింటే బరువు పెరుగుతారా..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
