సాక్షి లైఫ్ : మట్టి పాత్రలలో ఆహారాన్ని వండడం సురక్షితమైన మార్గమని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ అండ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ (ఐసిఎమ్ఆర్-ఎన్ఐఎన్) వెల్లడించింది. అవి పర్యావరణ అనుకూలమైనవి మాత్రమే కాకుండా, తక్కువ నూనెతో వంటలు చేసుకోవచ్చని తెలిపింది. పోషకాలు కూడా తొందరగా పాడవ్వకుండా ఉంటాయని, ఆమ్ల ఆహారాన్ని రాగి, ఇనుము, అల్యూమినియం పాత్రలలో వండకూడదని వివరించింది
ఇది కూడా చదవండి.. లాలాజల ఉత్పత్తి తగ్గితే ఏం జరుగుతుంది..?
.
స్టెయిన్‌లెస్ స్టీల్ పాత్రలు..
స్టెయిన్‌లెస్ స్టీల్ పాత్రలు సురక్షితమైనవని ఐసిఎమ్ఆర్-ఎన్ఐఎన్ తెలిపింది. 170 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువ ఉష్ణోగ్రత వద్ద నాన్-స్టిక్ కుక్‌వేర్‌లో ఆహారాన్ని వండకూడదు. దీనివల్ల పూత దెబ్బతినడమేకాకుండా ఆహారంలో కలిసిపోయే ప్రమాదం కూడా ఉందని హెచ్చరించింది. టెఫ్లాన్ పూత లేని రాతి పాత్రలు, మట్టి పాత్రలు సురక్షితమైనవని తెలిపింది.