విటమిన్ "సి" అధికంగా కలిగిన ఐదు అద్భుతమైన పండ్లు.. 

షేర్ చేయండి:
విటమిన్ "సి" అధికంగా కలిగిన ఐదు అద్భుతమైన పండ్లు.. 

సాక్షి లైఫ్ : శరీరానికి రోగ నిరోధక శక్తి పెంపు కోసం విటమిన్ "సి" చాలా కీలకమైన పోషకంగా పరిగణిస్తారు. "సి" విటమిన్ అనగానే సాధారణంగా మనకు వెంటనే గుర్తుకు వచ్చే ఫ్రూట్ ఆరెంజ్. అయితే, ఆరెంజ్ కంటే ఎక్కువ విటమిన్ "సి" కలిగిన పండ్లు కొన్ని ఉన్నాయి. వాటిని ప్రతి రోజూ మన ఆహారంలో చేర్చుకుంటే, సప్లిమెంట్ల అవసరం ఉండదు అంటున్నారు వైద్యనిపుణులు.

 

ఇది కూడా చదవండి..పైనాపిల్ లో దాగి ఉన్న ఆరోగ్య ప్రయోజనాలు..

ఇది కూడా చదవండి..పేస్‌మేకర్ హార్ట్ పేషెంట్లకు ఎప్పుడు అవసరం..?

ఇది కూడా చదవండి..గుండె జబ్బులు రాకుండా ఉండడానికి వైద్య నిపుణులు చెప్పిన చిట్కాలు..

ఇది కూడా చదవండి..గుండె స్పందన తగ్గినప్పుడు కనిపించే లక్షణాలు..

 

-ఉసిరికాయ (Amla)..  

భారతీయ ఆయుర్వేదంలో ప్రముఖ స్థానం ఉంది ఉసిరికాయకు. 100 గ్రాముల కాయలో దాదాపు 600 మిల్లీగ్రాముల విటమిన్ "సి" కలిగి ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచడంలో తోడ్పడడంతోపాటు, జీర్ణవ్యవస్థకు, చర్మానికి ఎంతో మేలు చేస్తుంది.

- జామపండు (Guava)..  

తక్కువ ఖర్చుతో లభించే జామపండులో 100 గ్రాములకు సుమారు 228 మిల్లీగ్రాముల విటమిన్ "సి" ఉంటుంది. దీనిని తినడం వల్ల చక్కటి చర్మం, బలమైన ఇమ్యూనిటీ, రక్తపోటు నియంత్రణ వంటి లాభాలు ఉన్నాయి.

- కివి (Kiwi)..  

విదేశీ పండు అయిన కివిలో 92 మిల్లీగ్రాముల విటమిన్ "సి" ఉంటుంది. చర్మం ప్రకాశించేందుకు, జీర్ణవ్యవస్థ మెరుగుపడేందుకు ఇది బాగా ఉపయోగపడుతుంది.

-రెడ్ క్యాప్సికం (Red Bell Pepper).. 

ఈ కూరగాయలో 127 మిల్లీగ్రాముల విటమిన్ "సి" ఉంటుంది. క్యాన్సర్, గుండెజబ్బులు వంటి అనారోగ్య సమస్యల నుంచి రక్షణ కల్పించడంలో ఇది సహాయపడుతుంది.

-స్ట్రాబెర్రీ (Strawberry).. 

ఈ రుచికరమైన పండులో 100 గ్రాములకు 58.8 మిల్లీగ్రాముల విటమిన్ "సి" ఉంటుంది. యాంటీఆక్సిడెంట్ల సమృద్ధిగా ఉండే ఈ పండు, చర్మానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ పండ్లను రోజూ ఆహారంలో చేర్చడం ద్వారా, శరీరానికి కావలసిన విటమిన్ "సి" అందుతుంది. దీంతో జలుబు, ఫ్లూ లాంటి సాధారణ వ్యాధులు దూరంగా ఉంటాయి.   

 

ఇది కూడా చదవండి..హిమోగ్లోబిన్‌ పెంచే బెస్ట్ ఫుడ్..?

ఇది కూడా చదవండి..కొత్తిమీర ఆరోగ్యానికి ఒక అద్భుతమైన ఔషధం..

ఇది కూడా చదవండి..గుండె జబ్బులు పెరగడానికి ఇవే కారణం..

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.