మొలకలు తినడం వల్ల కలిగే అద్భుతమైన ప్రయోజనాలు.. 

షేర్ చేయండి:
మొలకలు తినడం వల్ల కలిగే అద్భుతమైన ప్రయోజనాలు.. 

సాక్షి లైఫ్ : ఆరోగ్యంగా ఉండాలంటే తప్పనిసరిగా ఆరోగ్యకరమైన అల్పాహారం తీసుకోవాలని పోషకాహార నిపుణు వెల్లడిస్తున్నారు. ముఖ్యంగా ఆరోగ్యకరమైన అల్పాహారం విషయంలో మొలకలు ఉత్తమమైనవి. వీటిలో సహజంగా మల్టీవిటమిన్స్ ఉంటాయి. కాబట్టి వీటిని ఆహారంలో చేర్చుకుంటే అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. అంతేకాదు మొలకల్లో అనేక విటమిన్లు, ఖనిజాలు ఉన్నాయి. ఇవి ఎంతో మేలుచేస్తాయి.. 

ఇది కూడా చదవండి..మార్నింగ్ వాక్ చేసేటపుడు ఈ ఆరు విషయాలు గుర్తుంచుకోండి..ఎందుకంటే..?

ఇది కూడా చదవండి..డిప్రెషన్ ఉన్న వారిలో ఎలాంటి మార్పులు కనిపిస్తాయి..?

ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..?

మొలకలు తినడం వల్ల ఆరోగ్యప్రయోజనాలు ఇవే.. 

ఉండాలంటే పౌష్టికాహారం తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు ఎప్పుడూ సలహా ఇస్తుంటారు. మొలకలు బరువు తగ్గించడంతోపాటు విటమిన్లు లోపం ఉన్నవారికి మల్టీవిటమిన్ లాగా పనిచేస్తాయి. అయితే, కొంతమంది కి దీనిని జీర్ణం అవ్వడం కొంచెం కష్టంగా అనిపించవచ్చు లేదా తిన్న తర్వాత ఉబ్బరం, గ్యాస్ సమస్యలు తలెత్తవచ్చు. అటువంటి పరిస్థితిలో, మొలకలను ఉడకబెట్టి తినొచ్చు.  

 సమృద్ధిగా పోషకాలు.. 

కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, జింక్,యాంటీ-ఆక్సిడెంట్లు వంటి ఖనిజాలతో పాటు విటమిన్ ఏ, బి, సి వంటి విటమిన్లు పుష్కలంగా ఉన్నాయి. మొలకలు అనేక పోషకాలతో కూడిన అద్భుతమైన సూపర్‌ఫుడ్. ఇవి రోజూ తింటే శారీరక రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.

 రిచ్ ప్రోటీన్.. 

మొక్కల ఆధారిత ఆహారం అంటే సోయాబీన్స్ , కిడ్నీ బీన్స్ వంటి మొక్కల ఆధారిత మొలకల్లో ప్రోటీన్‌ పుష్కలంగా ఉంటుంది.  శాకాహారులు లేదా మాంసాహారులకు ఇవి ఉత్తమమైన పోషకాలు. కండరాల దృఢత్వం, పెరుగుదల, మెదడు చురుకుగా పనిచేయడానికి ఉపకరిస్తాయి, మొత్తం శరీరం యొక్క సరైన అభివృద్ధికి ప్రోటీన్ ఒక ముఖ్యమైన పోషకం.

బరువు..  

తక్కువ కేలరీలు, అధిక పోషకాలు, అధిక ఫైబర్ కలిగిన మొలకలు ఎక్కువ కాలం పాటు కడుపు నిండిన అనుభూతిని అందిస్తాయి. తద్వారా ఆకలిని తగ్గిస్తాయి. బరువు తగ్గించడం, బరువు నిర్వహణలో కూడా మొలకలు కీలక పాత్ర పోషిస్తాయి.  

నిర్విషీకరణ.. 

ఎక్కువ ఫైబర్, నీటిని కలిగి ఉన్న మొలకలు శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుతాయి. ఇవి గట్ హెల్త్ కు ఉపకరించడమేకాకుండా, శరీరం నుంచి విషాన్నిబయటకు పంపడంలో సహాయపడతాయి.

గుండె ఆరోగ్యం.. 

ఫైబర్ , ప్రోటీన్ అధికంగా ఉండే మొలకలలో ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి, ఇవి కొలెస్ట్రాల్, రక్తపోటును తగ్గించడంలో సహాయపడుతాయి. తద్వారా గుండె సంబంధిత సమస్యలు రాకుండా ఉంటాయి. 

ఇది కూడా చదవండి..గోరువెచ్చని నీళ్లు తాగితే వెయిట్ లాస్ అవుతారా..? నిజమేనా..?  

ఇది కూడా చదవండి..పనీర్ తినడం వల్ల ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలున్నాయో తెలుసా..? 

ఇది కూడా చదవండి..అవకాడోతో కలిపి తినకూడని ఆహారపదార్థాలు ఏమిటి..?

 గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.