అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు అందించే జాక్‌ఫ్రూట్..
సాక్షి లైఫ్ : ప్రపంచ ఆహార మార్కెట్‌లో జాక్‌ఫ్రూట్ ఉనికి పెరుగుతోంది. జాక్‌ఫ్రూట్ బంగ్లాదేశ్ ,శ్రీలంకకు జాతీయ పండు. భారతదేశంలోని తమిళనాడు,కేరళ రాష్ట్ర పండు జాక్‌ఫ్రూట్ అనే పదం పోర్చుగీస్ జాకీ నుంచి ఉద్భవించిందని చెబుతున్నారు. జాక్‌ఫ్రూట్ ఆరోగ్య ప్రయోజనాలను ప్రోత్సహించడానికి ఎంతగానో ఉపకరిస్తుంది.
ఇది కూడా చదవండి.. క్షయవ్యాధి ఏయే అవయవాలపై ప్రభావం చూపుతుంది..?
ఇది కూడా చదవండి.. మైగ్రేన్ పెయిన్ కు గుండెపోటుకు లింక్ ఏంటి..?
పనస పండు.. దీనినే జాక్‌ఫ్రూట్ అనికూడా పిలుస్తారు. ఇది అతిపెద్ద పండు. జాక్‌ఫ్రూట్‌లో అనేక విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇందులో ప్రోటీన్, కాల్షియం, ఐరన్, పొటాషియం కూడా ఉన్నాయి. జాక్‌ఫ్రూట్‌లోని అన్ని భాగాలు చాలా ఉపయోగకరంగా ఉంటాయి.ఈ ఫ్రూట్ తో చాలా రుచికరమైన ఉపయోగకరమైన వంటకాలను తయారు చేయవచ్చు.
థైరాయిడ్ బాధితులకు..
గుండె సమస్యలు, మధుమేహ వ్యాధిగ్రస్తులకు జాక్‌ఫ్రూట్ చాలా మంచిది. ఇది బిపిని తగ్గించడంలో సహాయపడుతుంది. రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. ఆస్తమా, థైరాయిడ్ బాధితులకు కూడా ఇది మంచి ఔషధం. పచ్చి జాక్‌ఫ్రూట్‌ను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయని, కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో జాక్‌ఫ్రూట్ గుజ్జు మంచిదని ఆరోగ్యనిపుణులు అంటున్నారు.
ఇలాంటి కచ్చితమైన ఆరోగ్య సమాచారాన్ని అనుభవజ్ఞులైన వైద్య నిపుణులు అందించే మరిన్ని విషయాలను గురించి మీరు తెలుసుకోవాలంటే సాక్షి లైఫ్ ను ఫాలో అవ్వండి..
ఇది కూడా చదవండి..కిడ్నీలు పనిచేయడం లేదని ఎలా తెలుసుకోవాలి..?
ఇది కూడా చదవండి.. టీ లో ఎన్నిరకాల వెరైటీలున్నాయో తెలుసా..?
ఇది కూడా చదవండి.. ఎలాంటి కొలెస్ట్రాల్ ఆరోగ్యానికి మంచిది..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
