Ayurvedic Medicines : ఆయుర్వేదంలో అద్భుతాలు చేసే మన స్వదేశీ ఔషధాలు..
సాక్షి లైఫ్ : భారతదేశ ఖ్యాతి కేవలం చరిత్ర, సంస్కృతులకు మాత్రమే పరిమితం కాదు.. మన పురాతన జీవనశైలి, ఆయుర్వేద సంప్రదాయం కూడా మన ఘనమైన వారసత్వమే. మన ఇళ్లలో రోజూ వాడే ఎన్నో వస్తువులు ఆరోగ్యానికి మేలు చేసే దివ్యౌషధాలు. తులసి, వేప, పసుపు, ఉసిరి లాంటివి మనకు సులభంగా అందుబాటులో ఉంటూ మన ఆరోగ్యాన్ని కాపాడుతున్నాయి. ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే మన అద్భుతమైన సంప్రదాయ ఆయుర్వేద మూలికల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
ఇది కూడా చదవండి..కాలేయ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారా..? మౌనంగా పెరుగుతున్న ఈ వ్యాధి గురించి తెలుసా..?
ఇది కూడా చదవండి..లవ్ హార్మోన్ అంటే ఏమిటి..?
ఇది కూడా చదవండి..రోజూ బెల్లం తింటే బరువు పెరుగుతారా..?
ఇది కూడా చదవండి..Don’t Ignore Fever : సాధారణ జ్వరమే కదా అని నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలకే ముప్పు..! ఈ 5 లక్షణాలపై అవగాహన అవసరం..
1. తులసి.. ఇంటింటి సంజీవని..
భారతీయ ఇళ్లలో తులసి మొక్క తప్పనిసరిగా ఉంటుంది. దైవ పూజల్లోనే కాకుండా, ఆరోగ్య సంరక్షణలోనూ దీనికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. తులసి ఆకులతో చేసే కషాయం, టీ తాగడం వల్ల జలుబు, దగ్గు, గొంతు నొప్పి తగ్గుతాయి. జీర్ణక్రియను మెరుగుపరచడంలోనూ తులసి అద్భుతంగా పనిచేస్తుంది.
2. వేప..చర్మ, దంత సంరక్షణి..
మన దేశంలో వేప చెట్టుకు ప్రత్యేక స్థానం ఉంది. చర్మం, నోటి శుభ్రత కోసం పల్లెలు, పట్టణాల్లో ఇప్పటికీ వేప పుల్లలు, ఆకులను విరివిగా వాడుతుంటారు. చర్మ సమస్యలను దూరం చేయడంలో, క్రిములను నాశనం చేయడంలో వేపకు సాటి మరొకటి లేదు.
3. అశ్వగంధ..ఒత్తిడిని జయించే ఔషధం..
ఆయుర్వేదంలో అశ్వగంధ పేరు బాగా ప్రాచుర్యం పొందింది. మానసిక ఒత్తిడి, శారీరక అలసట, నిద్రలేమి వంటి సమస్యలను దూరం చేయడానికి దీన్ని ఉపయోగిస్తారు. అశ్వగంధ సొంతంగా సప్లిమెంట్ల రూపంలో తీసుకోకూడదు. మీకు ఏవైనా ఆరోగ్య సమస్యలు ఉన్నా, ఇతర మందులు వాడుతున్నా.. కచ్చితంగా వైద్యులు లేదా ఆయుర్వేద నిపుణుల సలహా తీసుకున్నాకే వాడాలి.
4. శతావరి..మహిళల ఆరోగ్యానికి వరం..
మహిళల ఆరోగ్యానికి శతావరి ఒక వరం లాంటిది. పురాతన కాలం నుంచి మహిళల పోషణ, వారి ప్రత్యేక ఆరోగ్య సమస్యల నివారణకు ఆయుర్వేదంలో దీన్ని ప్రధానంగా ఉపయోగిస్తున్నారు. శారీరక బలాన్ని, హార్మోన్ల సమతుల్యతను కాపాడటంలో ఇది కీలకంగా వ్యవహరిస్తుంది.
5. పసుపు..వంటగదిలో ఔషధ గని..
ప్రతి ఇంటి వంటగదిలో ఉండే పసుపు మన ఆరోగ్యానికి శ్రీరామరక్ష. కూరలకు రంగు, రుచిని ఇవ్వడమే కాకుండా.. ఎన్నో గృహ వైద్య చిట్కాల్లో దీన్ని తరతరాలుగా వాడుతున్నారు. చర్మ సంరక్షణ, జీర్ణక్రియ మెరుగుదల, శరీరంలో ఇన్ఫ్లమేషన్, నొప్పులను తగ్గించడంలో పసుపు దివ్యౌషధంగా పనిచేస్తుంది.
6. ఉసిరి.. విటమిన్-సి భాండాగారం..
ఉసిరికాయ రుచికి పుల్లగా ఉన్నప్పటికీ.. పోషకాల విషయంలో మాత్రం దీనికి తిరుగులేదు. ఇందులో విటమిన్-సి, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. జుట్టు రాలడం తగ్గించడానికి, రోగనిరోధక శక్తిని పెంచడానికి, జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడానికి ఉసిరి ఎంతో మేలు చేస్తుంది. దీన్ని జ్యూస్, పచ్చడి, క్యాండీ లేదా మురబ్బా రూపంలో రోజువారీ ఆహారంలో సులభంగా చేర్చుకోవచ్చు.
మువ్వన్నెల జెండాకు వందనం చేయడంతో పాటు, మన ప్రాచీన వైద్య విధానాన్ని, సంప్రదాయాలను గుర్తుచేసుకోవడం కూడా ఎంతో ముఖ్యం. తులసి, పసుపు, వేప లాంటివి మన రోజువారీ జీవితంలో భారతీయ ఆరోగ్య వారసత్వ మూలాలు ఎంత బలంగా నాటుకుపోయాయో తెలియజేస్తాయి.
ఇది కూడా చదవండి..Online Shopping Addiction : ఆన్‌లైన్ షాపింగ్ వ్యసనం వెనుక దాగి ఉన్న సీక్రెట్ సైకాలజీ ఏం చెబుతోంది..?
ఇది కూడా చదవండి..ఆరోగ్యప్రయోజనాలు పొందాలంటే సలాడ్ ను ఏ టైమ్ లో తినాలి..?
ఇది కూడా చదవండి..లవ్ హార్మోన్ అంటే ఏమిటి..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
