ఆరోగ్యంగా ఉండేందుకు అద్భుతమైన జపనీస్ హెల్తీ హ్యాబిట్స్..  

షేర్ చేయండి:
ఆరోగ్యంగా ఉండేందుకు అద్భుతమైన జపనీస్ హెల్తీ హ్యాబిట్స్..  

సాక్షి లైఫ్ : జపాన్ ప్రజలు అనుసరించే కొన్ని ఆరోగ్యకరమైన అలవాట్లు వారి దీర్ఘాయుష్షుకు దోహదపడుతున్నాయి. అటువంటి వాటిలో ముఖ్యమైనవి కొన్ని.. మితంగా తినడం, పచ్చికూరలు, చేపలు, ఫెర్మెంటెడ్ ఆహారం..తీసుకోవడం, వ్యాయామం – వారి జీవనశైలిలో భాగం చేసుకోవడం,  మానవ సంబంధాలు – స్నేహం, కుటుంబ సభ్యులతో గడపడం, మానసిక ప్రశాంతతకు ప్రాధాన్యం ఇవ్వడం..

ఇది కూడా చదవండి..ప్రీక్లాంప్సియా అంటే ఏమిటి..? ఎలాంటి మహిళల్లో వస్తుంది..? 

ఇది కూడా చదవండి..Thyroid problems : థైరాయిడ్ సమస్యకు ప్రధాన కారణాలు..? 

ఇది కూడా చదవండి..జ్ఞాపకశక్తి తగ్గుతోందా..? అయితే అది జబ్బుకు సంకేతం కావచ్చు.. 

 

  మితంగా తినడం.. 

జపనీయులు పూర్తిగా కడుపు నిండా తినరు. కేవలం 80శాతం కడుపు నిండిన తర్వాత ఆహారం తీసుకోవడం ఆపేస్తారు. ఈ అలవాటు జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది, అధిక బరువు సమస్యలను దూరం చేస్తుంది.

 పచ్చికూరలు, చేపలు, ఫెర్మెంటెడ్ ఆహారం.. 

వారు ఎక్కువగా ప్రకృతికి దగ్గరగా ఉండే ఆహారాన్ని తీసుకుంటారు. చేపలు, టోఫూ, తాజా కూరగాయలు, మిసో సూప్ వంటివి వారి దైనందిన ఆహారంలో భాగం. ఇవి శరీరానికి ఎంతో మేలు చేస్తాయి.

 వ్యాయామం – వారి జీవనశైలిలో భాగం:

జిమ్‌కి వెళ్లకపోయినా, జపనీయులు రోజూ నడక, తై చి (Tai Chi) అంటే..? తోట పనులు వంటి క్రియాశీలక జీవనశైలిని అలవర్చుకుంటారు. ఇది వారి శరీరాన్ని చురుకుగా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. అంతేకాదు వ్యాయామాన్ని ఓ పనిగా కాకుండా, ఆనందంగా చేస్తారు.

 మానవ సంబంధాలు – స్నేహం, కుటుంబం..  

వారు ‘మొయాయ్’ (Moai) అనే సాంప్రదాయాన్ని పాటిస్తారు. ఇది చిన్న గ్రూపులుగా ఏర్పడి, ఒకరికొకరు ఆర్థికంగా, సామాజికంగా మద్దతు ఇచ్చుకునే పద్ధతి. దీనివల్ల మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది, ఒత్తిడి గణనీయంగా తగ్గుతుంది.

 మానసిక ప్రశాంతతకు ప్రాధాన్యం.. 

జపాన్ ప్రజలు ధ్యానం, ప్రకృతిలో నడక, రోజూ కృతజ్ఞతాభావంతో జీవించడం వంటి అలవాట్లతో తమ మనశ్శాంతిని కాపాడుకుంటారు. ఇది వారి మానసిక ఆరోగ్యానికి కీలకం.

ఇది కూడా చదవండి..విటమిన్ b12 లోపిస్తే శరీరంలో ఎలాంటి మార్పులు జరుగుతాయి..? 

ఇది కూడా చదవండి.. ఇన్‌స్టంట్ నూడుల్స్ సైడ్ ఎఫెక్ట్స్.. 

ఇది కూడా చదవండి.. సికిల్ సెల్ డిసీజ్ లక్షణాలు ఎలా వుంటాయి..?

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.