American Heart Association New Study : కొద్ది మోతాదులో మద్యం సేవనం.. గుండెకు మేలేనా..?
సాక్షి లైఫ్ : మద్యం ఆరోగ్యానికి హానికరం, ఏ మోతాదులో తీసుకున్నా ప్రమాదమేనని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) తో సహా అనేక సంస్థలు హెచ్చరిస్తున్న తరుణంలో.. అమెరికన్ హార్ట్ అసోసియేషన్ (AHA) తాజాగా విడుదల చేసిన ఒక నివేదిక కొత్త చర్చకు దారితీస్తోంది. 'తక్కువ మోతాదులో మద్యం సేవించడం గుండెకు మేలు చేయవచ్చు' అనే పాత సిద్ధాంతాన్ని అమెరికన్ హార్ట్ అసోసియేషన్ తన నివేదికలో తిరిగి ప్రస్తావించింది.
ఇది కూడా చదవండి..విటమిన్ సి లోపించినప్పుడు కనిపించే ముఖ్య లక్షణాలు ఇవే..
ఇది కూడా చదవండి..ఓఆర్ఎస్ ఆరోగ్యానికి మంచిదేనా..? ఎనర్జీ డ్రింక్స్ వల్ల కలిగే అనారోగ్య సమస్యలు..?
ఇది కూడా చదవండి.. ఎసిడిటీని అంతమొందించే ఇంటి చిట్కాలు..
అమెరికన్ హార్ట్ అసోసియేషన్ నివేదికలో ఏం ఉంది..?
ఇటీవలి అధ్యయనాలు ఏ మాత్రం మద్యం తీసుకున్నా ఆరోగ్యానికి ప్రమాదమేనని, క్యాన్సర్ వంటి ముప్పు పెరుగుతుందని తేల్చాయి. అమెరికన్ హార్ట్ అసోసియేషన్ గతంలో విడుదల చేసిన మార్గదర్శకాలు కూడా ఇదే విషయాన్ని నొక్కి చెప్పాయి.
తక్కువ మోతాదు (Low Amounts).. రోజుకు మోతాదు మించకుండా తక్కువ మొత్తంలో మద్యం తీసుకునేవారికి కరోనరీ ఆర్టరీ డిసీజ్ (Coronary Artery Disease), స్ట్రోక్ (Stroke) గుండె వైఫల్యం (Heart Failure) వంటి కొన్ని గుండె జబ్బుల ప్రమాదం తగ్గే అవకాశం ఉన్నట్లు పరిశోధనా ఫలితాలు సూచిస్తున్నాయని అమెరికన్ హార్ట్ అసోసియేషన్ తెలిపింది.
గతంలో దాదాపు 100కు పైగా పరిశోధనలు, పరిమితంగా మద్యం సేవించే వారిలో గుండె జబ్బుల ప్రమాదం తక్కువగా ఉన్నట్లు గుర్తించిన విషయాన్ని ఈ నివేదిక గుర్తు చేసింది. దీనికి గల కారణాలలో మంచి కొలెస్ట్రాల్ (HDL) స్థాయిలు పెరగడం ఒక కారణంగా పేర్కొన్నారు.
AHA హెచ్చరిక..!
మంచి కొలెస్ట్రాల్ (HDL) స్థాయిలు పెరగడం అనేది సానుకూల అంశమని అయితే ఇది పూర్తి స్థాయిలో రుజువు కాలేదని, దీనిపై మరింత లోతైన పరిశోధనలు (Randomized Trials) జరగాల్సిన అవసరం ఉందని అమెరికన్ హార్ట్ అసోసియేషన్ స్పష్టం చేసింది.
ఈ నివేదికలో ప్రధానంగా హెచ్చరించిన అంశాలు ఇవే..
ఎక్కువ మోతాదు ప్రమాదకరం: రోజుకు ఎక్కువ మోతాదు తీసుకుంటే గుండెకు, ఆరోగ్యానికి అనేక రకాలుగా హాని జరుగుతుందని, గుండె ఆరోగ్యం కోసం ఎవరూ కొత్తగా మద్యం సేవించడం మొదలు పెట్టకూడదు. ఆరోగ్యకరమైన జీవనశైలి, శారీరక శ్రమ, మంచి ఆహారం, పొగాకు మానేయడం గుండె ఆరోగ్యానికి ఉత్తమంఅని వైద్యనిపుణులు చెబుతున్నారు. తక్కువ మోతాదులో మద్యం తీసుకున్నా క్యాన్సర్ (Cancer) ముప్పు పెరుగుతుందని ఇతర అధ్యయనాలు నిరూపించాయి. ఈ రిస్కును కూడా పరిగణించాలి.
అమెరికన్ హార్ట్ అసోసియేషన్ నివేదిక పాత సిద్ధాంతాన్ని మళ్లీ తెరపైకి తెచ్చినప్పటికీ, గుండె ఆరోగ్యానికి మద్యం ఒక పరిష్కారం కాదని, మితంగా తాగేవారిలో ఆరోగ్యకరమైన అలవాట్లు (Diet, Exercise) కూడా ఉండటం వలన వారికి మేలు కలుగుతుందేమో అనే కోణంలో పరిశోధన జరగాలని నిపుణులు సూచిస్తున్నారు.
ఇది కూడా చదవండి.. నెయ్యి వేడి నీటిలో కలిపి తాగితే ఆరోగ్యానికి ఎంత మంచిదో తెలుసా..?
ఇది కూడా చదవండి.. రసాయనాలతో పండిన పుచ్చకాయను ఎలా కనుక్కోవచ్చు..
ఇది కూడా చదవండి.. షుగర్ ఉన్నవాళ్లు పైనాపిల్ తినకూడదా..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
