సాక్షి లైఫ్ : వాలీ ఫీవర్ (Valley Fever), శాస్త్రీయంగా కోసిడియోయి డోమైకోసిస్ (Coccidioidomycosis) గా పిలిచే ఈ వ్యాధి, ఇటీవల కాలంలో ప్రపంచవ్యాప్తంగా వేగంగా వ్యాపిస్తోంది. ఈ ఫీవర్ ముఖ్యంగా శ్వాసకోశాన్ని ప్రభావితం చేసే ఫంగల్ ఇన్ఫెక్షన్. అమెరికాలో పలుప్రాంతాల్లో మొదట కనిపించిన ఈ వ్యాధి కేసులు, ఇప్పుడు 20రాష్ట్రాల్లో పైగా నమోదవుతున్నాయి.
ఇది కూడా చదవండి..పురుషులతో పోలిస్తే..మహిళల్లో కంటి సంబంధిత సమస్యలు పెరగడానికి కారణాలేమిటి..?
ఇది కూడా చదవండి..బర్డ్ ఫ్లూ వైరస్ ఎన్ని డిగ్రీల సెల్సియస్ వరకు సజీవంగా ఉంటుంది..?
ఇది కూడా చదవండి..జాయింట్ పెయిన్స్ తగ్గించే సూపర్ ఫుడ్స్..
వ్యాధి లక్షణాలు..?
వాలీ ఫీవర్ లక్షణాలు సాధారణంగా ఫ్లూ వంటి లక్షణాలను కలిగి ఉంటాయి:
జ్వరం
వాంతులు
ఒళ్లు నొప్పులు..
తలనొప్పి..
శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది..
రాత్రి నిద్రలో చెమటలు పట్టడం..
చర్మంపై ఎర్రటి మచ్చలు రావడం..
ఈ లక్షణాలు సాధారణంగా 1 నుంచి 3 వారాల తర్వాత కనిపిస్తాయి. చాలా సందర్భాల్లో ఈ లక్షణాలు ఎలాంటి చికిత్స లేకుండానే తగ్గిపోతాయి. కానీ కొన్నిసార్లు, ఇది తీవ్రమైన శ్వాసకోశ సమస్యలు లేదా శరీరంలోని ఇతర భాగాలకు వ్యాపించే అవకాశం ఉండవచ్చని వైద్యనిపుణులు చెబుతున్నారు.