Blood pressure in winter : చలికాలంలో రక్తపోటు పెరగడానికి కారణాలు..?
సాక్షిగా లైఫ్ : సాధారణంగా ఎండాకాలంలో తగ్గే రక్తపోటు (BP), చలికాలం రాగానే ఒక్కసారిగా పెరుగుతుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. చల్లటి వాతావరణం ఎంత హాయిగా అనిపించినా, అది మన రక్తనాళాలపై చూపే ప్రభావం వల్ల బీపీ పెరిగే అవకాశం ఉందని వైద్యనిపుణులు స్పష్టం చేస్తున్నారు. శీతాకాలంలో రక్తపోటు పెరగడానికి ప్రధానంగా 'వాసోకాన్స్ట్రిక్షన్' (Vasoconstriction) కారణమని వైద్యులు చెబుతున్నారు.
ఇది కూడా చదవండి..American Heart Association New Study : కొద్ది మోతాదులో మద్యం సేవనం.. గుండెకు మేలేనా..?
ఇది కూడా చదవండి..Winter season : చలికాలంలో హెర్బల్ క్రీములు సురక్షితమేనా..?
ఇది కూడా చదవండి..Sugar control : దీర్ఘకాలిక షుగర్ నియంత్రణకు ముఖ్యమైన ఆహార సూచనలు ఏమిటి..?
ఇది కూడా చదవండి..Peptide Therapy : కంటి ఇన్ఫెక్షన్లకు సరికొత్త చికిత్స..పెప్టైడ్ థెరపీ..
బీపీ పెరగడానికి కారణమేంటి..?
శీతాకాలంలో రక్తపోటు పెరగడానికి ప్రధానంగా 'వాసోకాన్స్ట్రిక్షన్' (Vasoconstriction) కారణమని వైద్యులు చెబుతున్నారు. చలి పెరిగినప్పుడు మన శరీరం లోపలి ఉష్ణోగ్రతను కాపాడుకోవడానికి రక్తనాళాలు సన్నబడతాయి. దీనివల్ల రక్తాన్ని పంపింగ్ చేయడానికి గుండె మరింత ఒత్తిడిని ఉపయోగించాల్సి వస్తుంది. ఫలితంగా రక్తపోటు పెరుగుతుంది. చలి అనేది శరీరానికి ఒక రకమైన ఒత్తిడి వంటిది. ఇది నాడీ వ్యవస్థను ఒక్కసారిగా ప్రేరేపించి, రక్తంలోకి అడ్రినలిన్, నార్-అడ్రినలిన్ వంటి హార్మోన్లను విడుదల చేస్తుంది. ఇవి గుండె వేగాన్ని, బీపీని అకస్మాత్తుగా పెంచుతాయి. చలికాలంలో శారీరక శ్రమ తగ్గడం, విటమిన్-డి లోపం కూడా బీపీ పెరగడానికి దోహదపడతాయి.
చలికాలంలో రక్తపోటు (సిస్టోలిక్) సగటున 5 నుంచి 10 mmHg వరకు పెరిగే అవకాశం ఉంది. ఇది సాధారణ వ్యక్తులకు పెద్ద సమస్య కాకపోయినా, ఇప్పటికే గుండె జబ్బులు, మధుమేహం లేదా మూత్రపిండాల సమస్యలు ఉన్నవారికి మాత్రం కాస్త ప్రమాదమని న్యూరాలజిస్ట్ లు వెల్లడిస్తున్నారు.
ఏం చేయాలి మరి..?
రక్తపోటు అదుపులో ఉండాలంటే ఈ చిన్నపాటి జాగ్రత్తలు తప్పనిసరి. నిరంతర పర్యవేక్షణ: బీపీని క్రమం తప్పకుండా చెక్ చేసుకుంటూ ఉండాలి. వైద్యులు సూచించిన బీపీ మందులను క్రమం తప్పకుండా వాడాలి. శరీరాన్ని ఎప్పుడూ వెచ్చగా ఉంచుకోవాలి. బయట చలి ఎక్కువగా ఉంటే, ఇంట్లోనే సులభమైన వ్యాయామాలు చేయాలి. ఆహారంలో ఉప్పు వాడకాన్ని తగ్గించుకోవడం చాలా ముఖ్యం. వృద్ధులు, ఇప్పటికే బీపీ సమస్య ఉన్నవారు చలికాలంలో మరింత అప్రమత్తంగా ఉండాలి. ఏమాత్రం తేడా అనిపించినా వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.
ఇది కూడా చదవండి..Anti-Aging Strategies : జీవ గడియారాన్ని వెనక్కి తిప్పే శాస్త్రీయ మార్గాలు..?
ఇది కూడా చదవండి..రాత్రి 9 గంటల తర్వాత డిన్నర్ చేయడం వల్ల కలిగే నష్టాలు ఇవే....?
ఇది కూడా చదవండి..రోజూ బెల్లం తింటే బరువు పెరుగుతారా..?
ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..?
ఇది కూడా చదవండి..Weight loss : బరువు తగ్గడం కోసం 'ఫేక్ ఫాస్టింగ్' ఉపయోగపడుతుందా..?
ఇది కూడా చదవండి..Diabetes : డయాబెటిస్ ను అదుపులో ఉంచుకోవడానికి ఎలాంటి ఆహార నియమాలు పాటించాలి..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
