Experts Warn of Serious Impact on Kidneys : కండల కోసం 'ప్రోటీన్' అతిగా వాడుతున్నారా..? కిడ్నీలపై తీవ్ర ప్రభావం నిపుణుల హెచ్చరిక..!
సాక్షి లైఫ్ : ప్రస్తుతం ఫిట్‌నెస్ ప్రపంచంలో 'ప్రోటీన్' ఒక స్టార్ న్యూట్రియెంట్‌గా మారిపోయింది. కండలు పెంచాలన్నా, బరువు తగ్గాలన్నా ప్రోటీన్ డైట్ ఒక్కటే మార్గమని సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం చూసి చాలామంది జిమ్ ప్రియులు ప్రోటీన్ పౌడర్లు, షేక్స్, బార్లపై అమితంగా ఆధారపడుతున్నారు. అయితే, 'ఎక్కువ తీసుకుంటే ఎక్కువ బలం' అనే సూత్రం అన్నివేళలా నిజం కాదని, ముఖ్యంగా ఇది మూత్రపిండాల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఇది కూడా చదవండి..మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..?
ఇది కూడా చదవండి..Shock for Tattoo Lovers..! టాటూస్ తో 29శాతం స్కిన్ క్యాన్సర్ ముప్పు..
ఇది కూడా చదవండి..Coconut Water : కొబ్బరి బొండం నీళ్లతో బరువు తగ్గొచ్చా..?
కిడ్నీలపై భారం ఎలా పెరుగుతుంది..?
మన శరీరంలో కిడ్నీలు ఒక వడపోత వ్యవస్థలా పనిచేస్తాయి. రక్తం నుంచి వ్యర్థాలను తొలగించడం, ద్రవాల సమతుల్యతను కాపాడటం వీటి ప్రధాన విధి. మనం తీసుకున్న ప్రోటీన్ జీర్ణమైన తర్వాత వెలువడే ఉప ఉత్పత్తులను వడపోసే క్రమంలో కిడ్నీలు మరింత కష్టపడాల్సి ఉంటుంది.
ప్రోటీన్ మోతాదు శరీర అవసరానికి మించి అకస్మాత్తుగా పెరిగిన ప్పుడు, కిడ్నీలపై పనిభారం విపరీతంగా పెరుగుతుంది. సహజ సిద్ధమైన ఆహారం కంటే, కృత్రిమ ప్రోటీన్ సప్లిమెంట్ల ద్వారా తీసుకునే అధిక మోతాదులే ఎక్కువ ప్రమాదకరమని వైద్యులు చెబుతున్నారు.
అసలు ఎందుకు ఈ క్రేజ్..?
బరువు తగ్గాలనుకునే వారు, కండలు పెంచాలనుకునే వారు క్యాలరీలను తగ్గిస్తూ ప్రోటీన్‌ను ఎక్కువగా తీసుకుంటారు. దీనివల్ల కండరాలు తగ్గకుండా ఉండటమే కాకుండా, కడుపు నిండుగా ఉన్న అనుభూతి కలుగుతుంది. దీంతో అథ్లెట్లు, జిమ్ ప్రియులు తమ ఆహారంలో ప్రోటీన్ మోతాదును భారీగా పెంచేస్తున్నారు.
నిపుణులు ఏమంటున్నారు..?
"ఆరోగ్యంగా ఉండి, కిడ్నీలు సక్రమంగా పనిచేసే వారికి పరిమిత మోతాదులో ప్రోటీన్ తీసుకోవడం సురక్షితమే. కానీ, కండల కోసం దీర్ఘకాలం పాటు అతిగా ప్రోటీన్ తీసుకోవడం వల్ల కిడ్నీల పనితీరు దెబ్బతినే అవకాశం ఉంది" అని వైద్యనిపుణులు వెల్లడిస్తున్నారు.
ఏదైనా పోషకాహారం సమతుల్యంగా ఉన్నప్పుడే ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. ప్రోటీన్ విషయంలోనూ అతిగా కాకుండా, శరీరానికి ఎంత అవసరమో వైద్యులు లేదా డైటీషియన్ల సలహా మేరకు తీసుకోవడం మంచిది.
ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..?
ఇది కూడా చదవండి..Obesity and inflammation : ఒబెసిటీకి ఇన్‌ఫ్లమేషన్‌కు లింక్ ఏమిటి..?
ఇది కూడా చదవండి..Brain health : మీ బ్రెయిన్ కంప్యూటర్ లాగా పనిచేయాలంటే ఈ ఆహారపదార్థాలు తినండి..
ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
