Asthma Care in Summer: వేసవి కాలంలో ఆస్తమాతో.. జాగ్రత్త..! 

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది.. నిరంతరం వేధించే దగ్గు.. రొప్పు.. ఇవి ఉబ్బసం (ఆస్తమా) బాధితులు ఎదుర్కొనే ప్రధాన సమస్యలు. ప్రతి ఏటా మే నెలలో మొదటి మంగళవారం నాడు 'ప్రపంచ ఉబ్బసం దినోత్సవం' నిర్వహిస్తారు. ఈ ఏడాది నేడుఈ దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రజల్లో అవగాహన కల్పించేందుకు వైద్య నిపుణులు సిద్ధమయ్యారు.

 

ఇది కూడా చదవండి.. ఎసిడిటీని అంతమొందించే ఇంటి చిట్కాలు.. 

ఇది కూడా చదవండి.. రసాయనాలతో పండిన పుచ్చకాయను ఎలా కనుక్కోవచ్చు..

ఇది కూడా చదవండి..లవ్ హార్మోన్ అంటే ఏమిటి..?

 

ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO), గ్లోబల్ ఇనిషియేటివ్ ఫర్ ఆస్తమా (GINA) ఈ ఏడాది "ఆస్తమా బాధితులందరికీ ఇన్‌హేలర్లు అందుబాటులో ఉండాలి" అనే నినాదాన్ని ఇచ్చింది. చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు ప్రతి ఒక్కరికీ నాణ్యమైన వైద్యం, మందులు అందడం ద్వారా మరణాల ముప్పును తగ్గించవచ్చని ఈ నినాదం స్పష్టం చేస్తోంది.

వేసవిలో ఆస్తమా.. జాగ్రత్త..!

చలికాలంలోనే ఆస్తమా ఎక్కువవుతుందని చాలామంది భావిస్తారు. కానీ, వేసవిలో కూడా బాధితులకు సవాళ్లు ఎదురవుతాయి. గాలిలో పెరిగే పుప్పొడి రేణువులు, విపరీతమైన వేడి, తేమ, దుమ్ము, ధూళి వల్ల శ్వాసకోశ నాళాల్లో వాపు వచ్చి ఇబ్బంది పెడుతుంటుంది.

 ఐదు జాగ్రత్తలు..

ఆస్తమా బాధితులు వేసవిలో ఈ చిట్కాలు పాటిస్తే హాయిగా ఉండవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. 

ఇంట్లోనే ఉండండి.. 

 పుప్పొడి ఎక్కువగా ఉండే ఉదయం పూట, గాలి తీవ్రత ఎక్కువగా ఉన్న మధ్యాహ్న సమయాల్లో బయటకు వెళ్లకపోవడమే మంచిది. కిటికీలు మూసి ఉంచి ఏసీని వినియోగించడం మేలు.

ఇన్‌హేలర్ వెంట ఉంచుకోండి.. 

 అత్యవసర సమయంలో వాడే ఇన్‌హేలర్‌ను ప్రయాణాల్లోనూ, బయటకు వెళ్లినప్పుడు తప్పనిసరిగా వెంట ఉంచుకోవాలి. అది ఎక్స్‌పైరీ అయిందో లేదో ముందే చూసుకోవాలి.

పుష్కలంగా నీరు తాగాలి.. 

శరీరంలో తేమ తగ్గితే ఊపిరితిత్తుల్లో శ్లేష్మం గట్టిపడుతుంది. ఇది శ్వాస తీసుకోవడం కష్టం చేస్తుంది. రోజుకు సరిపడా నీరు తాగడం వల్ల శ్లేష్మం పలుచబడి శ్వాస సులభమవుతుంది.

ఇంట్లోని ఏసీ ఫిల్టర్లు, బెడ్ షీట్లు, పరదాలను క్రమం తప్పకుండా శుభ్రం చేయాలి. దుమ్ము, పెంపుడు జంతువుల వెంట్రుకల వల్ల వచ్చే అలర్జీలను నివారించాలి. లక్షణాలు తగ్గుముఖం పట్టాయి కదా అని సొంతంగా మందులు ఆపేయకూడదు. వైద్యులు సూచించిన మేరకు మందులు వాడటమే శ్రేయస్కరం.

 ఆస్తమా అనేది దీర్ఘకాలిక సమస్య అయినప్పటికీ, సరైన అవగాహన, క్రమశిక్షణతో కూడిన చికిత్స ద్వారా దీనిని పూర్తిగా నియంత్రించ వచ్చు. భయాందోళనలు వీడి, వైద్యుల సలహాలు పాటిస్తే ఆస్తమా బాధితులు కూడా సంతోషకరమైన జీవనాన్ని గడపవచ్చు.

ఇది కూడా చదవండి..విటమిన్ సి లోపించినప్పుడు కనిపించే ముఖ్య లక్షణాలు ఇవే.. 

ఇది కూడా చదవండి..The ‘3-F’ Formula for Digestive Health : గట్ హెల్త్  బాగుంటేనే సంపూర్ణ ఆరోగ్యం.. వైద్యనిపుణులు చెబుతున్న రహస్యాలివే!

ఇది కూడా చదవండి..ఆరోగ్యప్రయోజనాలు పొందాలంటే సలాడ్ ను ఏ టైమ్ లో తినాలి..?

ఇది కూడా చదవండి..మంచి కొలెస్ట్రాల్ ను పెంచే దానిమ్మ.. 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.