Good Habits : కేవలం స్వీట్లు మానేస్తే సరిపోదు.. షుగర్ కంట్రోల్‌లో ఉండాలంటే ఈ అలవాట్లు తప్పనిసరి..!

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : మధుమేహం (diabetes)నేడు అన్ని వయసుల వారిని వేధిస్తున్న ప్రధాన ఆరోగ్య సమస్య. కేవలం తీపి పదార్థాలు తినడం వల్లే రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయని చాలామంది భావిస్తుంటారు. కానీ.. తీపికి దూరంగా ఉండి, క్రమం తప్పకుండా మందులు వాడుతున్నా కొందరిలో షుగర్ అదుపులోకి రాదు. దీనికి మన రోజువారీ జీవనశైలిలోని కొన్ని అలవాట్లే కారణమని ఆరోగ్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
 
అసలు షుగర్ ఎందుకు పెరుగుతుంది..?

ఇంటర్నేషనల్ డయాబెటిస్ ఫెడరేషన్ (IDF) అంచనాల ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా సుమారు 58.9 కోట్ల మంది మధుమేహం (diabetes)తో బాధపడుతున్నారు. మనం తీసుకునే ఆహారంలోని కార్బోహైడ్రేట్లు జీర్ణమై గ్లూకోజ్‌గా మారుతాయి. క్లోమగ్రంథి (Pancreas) ఉత్పత్తి చేసే 'ఇన్సులిన్' హార్మోన్ ఈ గ్లూకోజ్‌ను కణాలకు చేర్చి శక్తిగా మారుస్తుంది. శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తి తగ్గినా, లేదా కణాలు దానికి సరిగ్గా స్పందించకపోయినా (insulin resistance) రక్తంలో గ్లూకోజ్ పేరుకుపోయి షుగర్ స్థాయిలు పెరుగుతాయి. దీర్ఘకాలికంగా ఇది గుండె, కిడ్నీలు, కళ్లు, నరాలపై తీవ్ర ప్రభావం చూపుతుంది.

షుగర్ స్థాయిలు పెరగడానికి ప్రధాన కారణాలు..

1. నిరంతర ఒత్తిడి (Chronic Stress)..  

పని ఒత్తిడి, కుటుంబ సమస్యల వల్ల నిత్యం ఆందోళనకు గురయ్యే వారిలో రక్తంలో చక్కెర స్థాయిలు వేగంగా పెరుగుతాయి. ఒత్తిడి సమయంలో శరీరంలో 'కార్టిసాల్', 'అడ్రినలిన్' వంటి హార్మోన్లు విడుదలవుతాయి. ఇవి కాలేయంలో గ్లూకోజ్ ఉత్పత్తిని పెంచి, ఇన్సులిన్ పనితీరును దెబ్బతీస్తాయి. యోగా, ధ్యానం, వ్యాయామం ద్వారా ఒత్తిడిని జయించవచ్చు.

2. నిద్రలేమి(Lack of Sleep)..


రోజుకు ఏడు గంటల కంటే తక్కువ సమయం నిద్రపోవడం వల్ల శరీర జీవగడియారం (circadian rhythm) దెబ్బతింటుంది. ఫలితంగా ఇన్సులిన్, కార్టిసాల్ హార్మోన్ల సమతుల్యత లోపిస్తుంది. నిద్ర సరిపోకపోతే తీపి, అధిక క్యాలరీలు ఉండే ఆహారం తినాలనే కోరిక పెరిగి టైప్-2 డయాబెటిస్ ముప్పు ఎక్కువవుతుంది.

ఇది కూడా చదవండి..చిన్నారులలో అరుదైన జన్యుపరమైన వ్యాధుల నిర్ధారణకు సరికొత్త రక్త పరీక్ష.. 

ఇది కూడా చదవండి.. మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..? 

ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..? 

 

3. గంటల తరబడి ఉపవాసం..

బరువు తగ్గేందుకు ఇటీవల 'ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్' (Intermittent fasting)ట్రెండ్ పెరిగింది. అయితే ఇది అందరికీ సరిపడదు. ఎక్కువ సమయం ఆకలితో ఉండటం వల్ల శరీరంలో ఒత్తిడి హార్మోన్లు చురుకవుతాయి. ఇవి కాలేయాన్ని ప్రేరేపించి రక్తంలోకి అదనపు గ్లూకోజ్‌ను విడుదల చేసేలా చేస్తాయి. దీనివల్ల షుగర్ పెరిగే అవకాశం ఉంటుంది.

4. రాత్రిపూట ఆలస్యంగా భోజనం..

పగటిపూటతో పోలిస్తే రాత్రి వేళల్లో శరీరంలో ఇన్సులిన్ సున్నితత్వం తక్కువగా ఉంటుంది. రాత్రి ఆలస్యంగా బరువైన ఆహారం తీసుకోవడం, తిన్న వెంటనే నిద్రపోవడం వల్ల ఆహారం సరిగ్గా జీర్ణం కాక రక్తంలో గ్లూకోజ్ స్థాయులు అమాంతం పెరిగిపోతాయి.

ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..? 

ఇది కూడా చదవండి..రోజూ బెల్లం తింటే బరువు పెరుగుతారా..? 

 ఇది కూడా చదవండి..క్షయవ్యాధి ఏయే అవయవాలపై ప్రభావం చూపుతుంది..? 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.