Bad Cholesterol : ఆరోగ్యకరమైన జీవనశైలి ఉన్నప్పటికీ చెడు కొలెస్ట్రాల్ పెరుగుతోందా..? అసలు కారణం ఇదే.. 

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటున్నా, క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తున్నా కొందరిలో చెడు కొలెస్ట్రాల్ (LDL) స్థాయిలు తగ్గకపోగా, మరింత పెరుగుతుంటాయి. మంచి జీవనశైలిని పాటిస్తున్నప్పటికీ కొలెస్ట్రాల్ ఎందుకు పెరుగుతుంది..? దీని వెనుక ఉన్న అసలు కారణాలు, నిపుణుల హెచ్చరికలు మీ కోసం..

 

ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..? 

ఇది కూడా చదవండి..ఈ 5 సప్లిమెంట్స్ కు డబ్బు దండగ అంటున్న వైద్యనిపుణులు..! 

ఇది కూడా చదవండి.. నెయ్యి వేడి నీటిలో కలిపి తాగితే ఆరోగ్యానికి ఎంత మంచిదో తెలుసా..? 

 

1. జీవనశైలి బాగున్నా కొలెస్ట్రాల్ ఎందుకు పెరుగుతుంది..?

అనేక సందర్భాల్లో, ఆహార నియమాలు సరిగ్గా ఉన్నప్పటికీ శరీరంలో కొలెస్ట్రాల్ పెరగడానికి జన్యుపరమైన లోపాలు (Genetics) ప్రధాన కారణంగా మారుతున్నాయి. దీనిని వైద్య పరిభాషలో ‘ఫ్యామిలియల్ హైపర్‌కొలెస్టెరోలేమియా’ అంటారు. వంశపారంపర్య ప్రభావం..కుటుంబంలో ఎవరికైనా అధిక కొలెస్ట్రాల్ లేదా గుండె జబ్బుల చరిత్ర ఉంటే, అది తర్వాతి తరాలకూ వచ్చే అవకాశం ఉంది. కాలేయ పనితీరు..ఈ సమస్య ఉన్నవారిలో, కాలేయం రక్తం నుంచి చెడు కొలెస్ట్రాల్‌ను సమర్థవంతంగా తొలగించలేదు. ఫలితంగా చిన్న వయసు నుంచే చెడుకొలెస్ట్రాల్ స్థాయిలు అధికంగా నమోదవుతాయి.

2. శారీరక శ్రమ లేని 'నిశ్చల' జీవనం..

ఎంత మంచి ఆహారం తిన్నా, రోజంతా ఒకే చోట కూర్చుని పనిచేసే అలవాటు ఉంటే కొలెస్ట్రాల్ పెరిగే ప్రమాదం ఉంది. మంచి కొలెస్ట్రాల్ తగ్గడం.. శారీరక శ్రమ లోపించినప్పుడు శరీరంలో మంచి కొలెస్ట్రాల్ (HDL) స్థాయిలు పడిపోతాయి. రక్తం నుండి చెడు కొలెస్ట్రాల్‌ను శుభ్రం చేయడంలో గుడ్ కొలెస్ట్రాల్  కీలక పాత్ర పోషిస్తుంది. నివారణ ఎలా..? నిత్యం కనీసం 30 నుంచి 45 నిమిషాల పాటు వేగంగా నడవడం (Brisk Walking), యోగా లేదా వ్యాయామం చేయడం ద్వారా చెడు కొలెస్ట్రాల్‌ను అదుపులో ఉంచవచ్చు.

3. 'ఆరోగ్యకరమైన' కొవ్వుల అతి వినియోగం..

నెయ్యి, డ్రై ఫ్రూట్స్, గానుగ నూనెలు ఆరోగ్యానికి మంచివే అయినప్పటికీ, వాటిని పరిమితికి మించి తీసుకోవడం కూడా ముప్పేనని వైద్యులు హెచ్చరిస్తున్నారు. శ్యాచురేటెడ్ ఫ్యాట్స్ (Saturated Fats): వీటిని అధికంగా తీసుకోవడం వల్ల కాలేయం ఎక్కువ కొలెస్ట్రాల్‌ను ఉత్పత్తి చేస్తుంది. జాగ్రత్తలు.. బేకరీ ఉత్పత్తులు, ప్యాకేజ్డ్ స్నాక్స్ మరియు వేపుళ్లలో ఉండే ట్రాన్స్ ఫ్యాట్స్‌కు ఎంత దూరంగా ఉంటే గుండె ఆరోగ్యానికి అంత మంచిది.మానసిక ఒత్తిడి (Stress)నిద్రలేమి కారణంగా శరీరంలో 'కార్టిసాల్' హార్మోన్ స్థాయిలు పెరుగుతాయి. ఇది పరోక్షంగా కొవ్వు జీవక్రియను దెబ్బతీసి, శరీరంలో చెడుకొలెస్ట్రాల్  పెరగడానికి కారణమవుతుంది.

4. ప్యాకేజ్డ్ ఆహారాల్లో దాగి ఉన్న చక్కెరలు..

ఆరోగ్యకరమైనవిగా ప్రచారమయ్యే కొన్ని ప్రోటీన్ బార్లు, పండ్ల రసాలు (Juices), ఇన్‌స్టంట్ బ్రేక్‌ఫాస్ట్ మిక్స్‌లలో చక్కెర, ప్రిజర్వేటివ్‌లు ఎక్కువగా ఉంటాయి. ఇవి కాలేయంపై అదనపు భారాన్ని పెంచి, ట్రైగ్లిజరైడ్లతో పాటు చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను వేగంగా పెంచుతాయి. కొలెస్ట్రాల్ నియంత్రణ అనేది కేవలం ఆహారానికే పరిమితం కాదు. క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవడం, ఒత్తిడిని తగ్గించుకోవడం, తగినంత నిద్రపోవడం, శారీరక శ్రమను జీవనశైలిలో భాగం చేసుకోవడం ద్వారానే గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి వీలుకలుగుతుంది.

ఇది కూడా చదవండి.. ఎసిడిటీని అంతమొందించే ఇంటి చిట్కాలు.. 

ఇది కూడా చదవండి..ఓఆర్ఎస్ ఆరోగ్యానికి మంచిదేనా..? ఎనర్జీ డ్రింక్స్ వల్ల కలిగే అనారోగ్య సమస్యలు..?

 ఇది కూడా చదవండి.. ఎలాంటి కొలెస్ట్రాల్ ఆరోగ్యానికి మంచిది..?

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.