Be alert : ఫ్యాటీ లివర్ కారణంగా ముఖంపై కనిపించే 5 సంకేతాలు ఇవే..  

షేర్ చేయండి:

సాక్షిలైఫ్ : వేగంగా మారుతున్న జీవనశైలి, సరిలేని ఆహారపు అలవాట్లు ప్రస్తుతం ఫ్యాటీ లివర్ వ్యాధి బాధితులుగా మారుస్తున్నాయి. ఈ వ్యాధి వచ్చినప్పుడు శరీరంలో అనేక సంకేతాలు కనిపిస్తాయి, వాటిలో కొన్ని ముఖంపై కూడా కనిపిస్తాయి. ఈ సంకేతాలను అందరూ తప్పనిసరిగా తెలుసుకోవాలి, లేకపోతే దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యల బారీన పడాల్సి వస్తుంది.

 

ఇది కూడా చదవండి..కాలేయంలోని మలినాలను శుభ్రపరచడంలో సహాయపడే విజిటబుల్ జ్యూస్.. 

ఇది కూడా చదవండి..హిమోగ్లోబిన్‌ పెంచే బెస్ట్ ఫుడ్..?

ఇది కూడా చదవండి..కొత్తిమీర ఆరోగ్యానికి ఒక అద్భుతమైన ఔషధం..

ఇది కూడా చదవండి..గుండె జబ్బులు పెరగడానికి ఇవే కారణం..

 

 స్పైడర్ సిరలు (Spider Veins):

ఫ్యాటీ లివర్ ఉన్న వ్యక్తుల ముఖంలో, శరీరంలో విస్తరించిన సిరలు కనిపిస్తాయి. ఇవి సాలీడు వలను పోలి ఉంటాయి. వీటిని "స్పైడర్ వెయిన్స్" అంటారు. కాలేయంలో కొవ్వు పేరుకుపోవడం వల్ల రక్త ప్రవాహం మందగించి ఈ సిరలు స్పష్టంగా కనిపిస్తాయి.

- దురద (Itching):

ఫ్యాటీ లివర్ ఉన్న 5 మందిలో ఒకరికి ముఖంపై దురదగా అనిపించవచ్చు. ఇది లివర్ సంబంధిత సమస్యతో సంబంధం కలిగి ఉంటుంది.

- చర్మం నల్లబడడం (Skin Darkening):

ఫ్యాటీ లివర్ వ్యాధి సిర్రోసిస్‌గా మారితే, చర్మం నల్లబడే సమస్య వస్తుంది. ఇది ముఖ్యంగా మెడ వెనుక భాగంలో కనిపిస్తుంది. ఇన్సులిన్ నిరోధకత కారణంగా ఇది చోటుచేసుకుంటుంది.

-రోసేసియా (Rosacea):

ఫ్యాటీ లివర్ కారణంగా ముఖంపై వచ్చే ఎరుపు, మొటిమలు, ఇరిటేషన్  వంటి రోసేసియా లక్షణాలు పెరుగుతాయి. ఇది ముఖంలోని వెంట్రుకల రంధ్రాలలో వాపు ఏర్పడటం వల్ల సంభవిస్తుంది.

- కామెర్లు (Jaundice):

ఫ్యాటీ లివర్ చివరి దశలో కాలేయం బిలిరుబిన్‌ను సరిగ్గా ఫిల్టర్ చేయలేదు, ఫలితంగా చర్మం, కళ్ళలోని తెల్ల భాగం పసుపు రంగులోకి మారుతుంది. దీనిని కామెర్లుగా భావిస్తారు. ఈ లక్షణాలను గుర్తించి, సమయానికి చికిత్స తీసుకోవడం ముఖ్యం.

 

ఇది కూడా చదవండి..ప్రపంచంలోనే తొలిసారిగా గొర్రెలో బర్డ్ ఫ్లూ..  

ఇది కూడా చదవండి..పేస్‌మేకర్ హార్ట్ పేషెంట్లకు ఎప్పుడు అవసరం..?

ఇది కూడా చదవండి..గుండె జబ్బులు రాకుండా ఉండడానికి వైద్య నిపుణులు చెప్పిన చిట్కాలు..

ఇది కూడా చదవండి..గుండె స్పందన తగ్గినప్పుడు కనిపించే లక్షణాలు..

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.