బెల్లీ ఫ్యాట్ తో సోరియాసిస్ ప్రమాదం..తాజా అధ్యయనంలో వెల్లడి.. 

షేర్ చేయండి:
బెల్లీ ఫ్యాట్ తో సోరియాసిస్ ప్రమాదం..తాజా అధ్యయనంలో వెల్లడి.. 

సాక్షి లైఫ్ : ఇటీవలి పరిశోధనలు ఆందోళన కలిగించే అంశాన్ని వెల్లడించాయి. శరీరంలో, ముఖ్యంగా కడుపు చుట్టూ పేరుకుపోయిన కొవ్వు మీ రూపాన్ని ప్రభావితం చేయడమే కాకుండా, "సోరియాసిస్" వంటి తీవ్రమైన చర్మ వ్యాధి ప్రమాదాన్ని గణనీయంగా పెంచుతుందని తేలింది. దీనర్థం, బెల్లీ ఫ్యాట్ అనేది కేవలం దుస్తులు బిగుతుగా మారడం లేదా జీన్స్ సరిపోకపోవడానికి సంబంధించిన సమస్య మాత్రమే కాదు, మీ అంతర్గత ఆరోగ్యానికి కూడా ముప్పు వాటిల్లుతుందని ఈ కొత్త అధ్యయనం స్పష్టం చేసింది.

 

ఇది కూడా చదవండి..రక్తహీనత నివారణకు దానిమ్మ సరైన పరిష్కారం.. 

ఇది కూడా చదవండి..వర్షాకాలంలో అజీర్ణ సమస్యతో బాధపడుతున్నారా..? ఈ ఆహారాలను తినకండి.. 

 

బెల్లీ ఫ్యాట్ - సోరియాసిస్ తో లింక్..  

కొత్త అధ్యయనం కేవలం ఊబకాయం మాత్రమే కాదని, శరీరంలో కొవ్వు పేరుకుపోయే విధానం కూడా ప్రధాన సమస్య అని సూచిస్తుంది. తాజా పరిశోధనలో, బెల్లీ ఫ్యాట్ సోరియాసిస్ ప్రమాదంతో గట్టి సంబంధం కలిగి ఉందని గుర్తించారు.

అధ్యయనం ఏం చెబుతోంది?

లండన్‌లోని కింగ్స్ కాలేజ్ శాస్త్రవేత్తలు ఈ పరిశోధనను నిర్వహించారు. UK నుండి 3.3 లక్షలకు పైగా వ్యక్తుల డేటాను విశ్లేషించారు. వీరిలో 9వేల మందికి పైగా సోరియాసిస్‌తో బాధపడుతున్నారు. ఈ అధ్యయనం నడుము తుంటి నిష్పత్తి (Waist Hip Ratio), బెల్లీ ఫ్యాట్ నిష్పత్తి, నడుము చుట్టుకొలత, మొత్తం బెల్లీ ఫ్యాట్ తో సహా 25 విభిన్న శరీర కొవ్వు కొలతలను పరిగణనలోకి తీసుకుంది.

పరిశోధనలో వెల్లడైన కీలక అంశం ఏమిటంటే, నడుము దగ్గర పేరుకుపోయిన కొవ్వు సోరియాసిస్ ప్రమాదంతో ఎక్కువగా ముడిపడి ఉంది. మనం సాధారణంగా ఉపయోగించే బాడీ మాస్ ఇండెక్స్ (బిఎంఐ) ఈ ప్రమాదాన్ని అంత ఖచ్చితంగా అంచనా వేయలేకపోయిందని అధ్యయనం పేర్కొంది.

నిపుణుల అభిప్రాయం ఏమిటి..?

ఈ పరిశోధనలో పాల్గొన్న ప్రధాన రచయిత డాక్టర్ రవి రామేసూర్ మాట్లాడుతూ, "కొవ్వు పరిమాణం మాత్రమే కాకుండా, అది శరీరంలో ఎక్కడ పేరుకుపోతుందో కూడా సోరియాసిస్ ప్రమాదాన్ని ప్రభావితం చేస్తుందని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. ముఖ్యంగా నడుము చుట్టూ ఉన్న కొవ్వు ఈ వ్యాధికి చాలా దగ్గరగా ఉంటుంది. దీనికి చికిత్స,నివారణ వ్యూహాలలో మార్పులు కూడా అవసరం" అని తెలిపారు.

"ప్రపంచవ్యాప్తంగా ఊబకాయం పెరుగుతున్నందున, శరీరంలోని వివిధ భాగాలలో పేరుకుపోయిన కొవ్వు సోరియాసిస్ వంటి దీర్ఘకాలిక వ్యాధులను ఎలా ప్రభావితం చేస్తుందో తెలుసుకోవడం చాలా ముఖ్యమని సీనియర్ రచయిత్రి డాక్టర్ కేథరీన్ హెచ్. స్మిత్ తెలిపారు. ఈ ప్రభావం జన్యుపరమైన కారణాల వల్ల మాత్రమే కాకుండా, జీవనశైలికి కూడా సంబంధించినది." అని అన్నారు. 

 

ఇది కూడా చదవండి.. బొల్లి వ్యాధిని నయం చేయవచ్చా..?

ఇది కూడా చదవండి..వర్షాకాలంలో ఎలాంటి కూరగాయలు తీసుకోకూడదు అంటే..?

ఇది కూడా చదవండి..Rainy Season : వర్షాకాలంలో తప్పనిసరిగా తీసుకోవాల్సిన కొన్ని కూరగాయలు

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.