Rainy Season : వర్షాకాలంలో తప్పనిసరిగా తీసుకోవాల్సిన కొన్ని కూరగాయలు
సాక్షి లైఫ్ : వర్షాకాలంలో కూరగాయలను చాలా శుభ్రంగా కడగాలి, ఎందుకంటే వాటిపై మట్టి, సూక్ష్మక్రిములు ఉండే అవకాశం ఎక్కువ. బాగా ఉడికించాలి: బాగా ఉడికించి తీసుకోవడం మంచిది. ఇది ఇన్ఫెక్షన్ల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. సీజనల్ కూరగాయలు: సీజనల్ గా లభించే కూరగాయలను ఎంచుకోవడం ఎల్లప్పుడూ ఉత్తమం. అవి తాజాగా ఉంటాయి. వాటిలో పోషక విలువలు ఎక్కువగా ఉంటాయి.వర్షాకాలంలో జీర్ణక్రియ మందగించడం, నీటి ద్వారా సంక్రమించే వ్యాధుల ప్రమాదం ఎక్కువగా ఉండటం వల్ల ఆహారం విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని వైద్యనిపుణులు సూచిస్తున్నారు. కొన్ని కూరగాయలు ఈ సమయంలో ఆరోగ్యానికి మేలు చేస్తాయి. అవేంటంటే..?
ఇది కూడా చదవండి..వారానికి రెండుసార్లు తీసుకోవడం ద్వారా అవకాడోతో గుండెపోటుకు చెక్.. !
ఇది కూడా చదవండి..హెపటైటిస్ " ఏ" నివారించడంలో వ్యాక్సిన్ పాత్ర ఎంత..?
ఇది కూడా చదవండి..కిడ్నీ వ్యాధి లక్షణాలు: ఈ సంకేతాలను అస్సలు నిర్లక్ష్యం చేయవద్దు..
ఇది కూడా చదవండి..వర్షాకాలంలో అజీర్ణ సమస్యతో బాధపడుతున్నారా..? ఈ ఆహారాలను తినకండి..
వర్షాకాలంలో తీసుకోవాల్సిన కూరగాయలు..?
సొరకాయ : సొరకాయలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది, ఇది జీర్ణక్రియకు సహాయపడుతుంది. ఇందులో కేలరీలు తక్కువగా ఉంటాయి, పొట్ట నిండుగా ఉండేలా చేస్తుంది. ఐరన్, విటమిన్ బి, విటమిన్ సి కూడా ఇందులో ఉంటాయి, ఇవి రోగనిరోధక శక్తిని పెంచుతాయి.
బీట్‌రూట్ : బీట్‌రూట్ వర్షాకాలంలో ఆరోగ్యానికి చాలా మంచిది. ఇది మీ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. సీజనల్ వ్యాధులను ఇది నివారిస్తుంది.
కాకరకాయ : కాకరకాయలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. ఇందులో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు కూడా ఉన్నాయి.
బీన్స్ : వర్షాకాలంలో బీన్స్ తీసుకోవడం మంచిది. వీటిలో ఫైబర్, పోషకాలు ఉంటాయి.
దొండకాయ: దొండకాయ కూడా వర్షాకాలంలో తినదగిన కూరగాయ.
బీరకాయ : బీరకాయలో కేలరీలు తక్కువగా ఉంటాయి. ఫైబర్, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ఇది జీర్ణక్రియకు సహాయపడుతుంది.
పొట్లకాయ : పొట్లకాయలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది, ఇది శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచుతుంది. సులభంగా జీర్ణమవుతుంది.
గుమ్మడికాయ : గుమ్మడికాయలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి, ఇవి రోగనిరోధక శక్తిని పెంచుతాయి. ఇందులో విటమిన్ ఎ, సి, పొటాషియం,ఫైబర్ కూడా ఉంటాయి.
ములక్కాయ: ములక్కాయలో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. విటమిన్ ఏ, సి అధికంగా ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచడంలో ,శ్వాసకోశ ఆరోగ్యానికి తోడ్పడతాయి.
క్యారెట్: క్యారెట్ ను కూడా ఈ సమయంలో తీసుకోవచ్చు. అయితే బాగా కడిగి, ఉడికించి తీసుకోవాలి. టమాటా : టమాటా రోజువారీ ఆహారంలో చేర్చుకోవచ్చు.
ఇది కూడా చదవండి..ఆహారంలో అవకాడోను ఎలా చేర్చుకుంటే మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలు అంటే..?
ఇది కూడా చదవండి..బ్యాడ్ ఫుడ్ కాంబినేషన్ : ఎలాంటి ఆహారాలను కలిపి తీసుకోకూడదు
ఇది కూడా చదవండి..శరీరంలో కొలెస్ట్రాల్ పెరిగితే ఏమవుతుంది..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..
