ప్రపంచ బొల్లి దినోత్సవం 2025: బొల్లి వ్యాధిని నయం చేయవచ్చా..?  

షేర్ చేయండి:
ప్రపంచ బొల్లి దినోత్సవం 2025: బొల్లి వ్యాధిని నయం చేయవచ్చా..?  

సాక్షి లైఫ్ : ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ బొల్లి దినోత్సవాన్ని ఈరోజు అంటే  జూన్ 25న, జరుపుకుంటున్నారు. ఈ దినోత్సవం ప్రధాన ఉద్దేశ్యం బొల్లి (విటిలిగో) గురించి ప్రజల్లో అవగాహన పెంచడం, ఈ సమస్యతో బాధపడుతున్న వారికి మద్దతు ఇవ్వడం, దీనికి సంబంధించిన సామాజిక అపోహలు తొలగించడం దీని ప్రధాన లక్ష్యం. సాధారణంగా 'తెల్ల మచ్చల వ్యాధి' అని పిలిచే బొల్లి గురించి, దాని చికిత్సా పద్ధతులు, కొన్ని ఆరోగ్య చిట్కాలను ఇప్పుడు తెలుసుకుందాం..

ఇది కూడా చదవండి..వర్షాకాలంలో ఎలాంటి కూరగాయలు తీసుకోకూడదు అంటే..?

ఇది కూడా చదవండి..Rainy Season : వర్షాకాలంలో తప్పనిసరిగా తీసుకోవాల్సిన కొన్ని కూరగాయలు

ఇది కూడా చదవండి..వర్షాకాలంలో అజీర్ణ సమస్యతో బాధపడుతున్నారా..? ఈ ఆహారాలను తినకండి.. 

 

బొల్లి – అపోహలు వీడి, అవగాహన పెంచుకుందాం..  

ప్రతి సంవత్సరం జూన్ 25న ప్రపంచ బొల్లి దినోత్సవాన్ని జరుపుకోవడం వెనుక ప్రధాన కారణం ఈ చర్మ పరిస్థితి గురించి ప్రజలకు సరైన సమాచారం అందించడమే. బొల్లి అనేది అంటువ్యాధి కాదు, స్పర్శ ద్వారా వ్యాపించదు. అయినా కూడా, అవగాహనా లేకపోవడం వల్ల, దీని గురించి అనేక అపోహలు ఇప్పటికీ ప్రచారంలో ఉన్నాయి. 

విటిలిగో అంటే ఏమిటి..?

విటిలిగో అనేది ఒక స్వయం ప్రతిరక్షక రుగ్మత. అంటే, ఇది మన రోగనిరోధక వ్యవస్థకు సంబంధించినది. ఈ సమస్య ఉన్నవారిలో, చర్మం రంగును నిర్ణయించే 'మెలనోసైట్లు' అనే కణాలు నాశనం అవుతాయి లేదా పనిచేయడం మానేస్తాయి. దీని ఫలితంగా శరీరంలోని వివిధ శరీర భాగాలపై తెల్ల మచ్చలు ఏర్పడతాయి.

వ్యాధి కాదు, శారీరక స్థితి మాత్రమే..!

విటిలిగోను ఒక వ్యాధిగా కాకుండా, కేవలం ఒక శారీరక స్థితిగా చూడాలని వైద్యనిపుణులు సూచిస్తున్నారు. ఇది ఎలాంటి నొప్పిని కలిగించదు. అంతేకాదు శరీరంలోని ఇతర అవయవాలకు ఎటువంటి హాని జరుగదు. అయితే, సమాజంలో దీని గురించి అపోహలు ఉన్నప్పుడు, ఇది ఖచ్చితంగా మానసికంగా ప్రభావాన్ని చూపుతుంది.

చికిత్స సాధ్యమే.. సరైన పద్ధతితో.. 

బొల్లికి ప్రస్తుతం అనేక రకాల చికిత్సా పద్ధతులు అందుబాటులో ఉన్నాయి. చికిత్స పద్ధతి మచ్చలు ఎక్కడ ఉన్నాయి..?, అవి ఎంత వేగంగా వ్యాపిస్తున్నాయి..?, రోగి వయస్సు, ఆరోగ్య స్థితిపై ఆధారపడి ఉంటుంది.

ఇది కూడా చదవండి..వారానికి రెండుసార్లు తీసుకోవడం ద్వారా అవకాడోతో గుండెపోటుకు చెక్.. !

ఇది కూడా చదవండి..హెపటైటిస్ " ఏ" నివారించడంలో వ్యాక్సిన్ పాత్ర ఎంత..? 

ఇది కూడా చదవండి..కిడ్నీ వ్యాధి లక్షణాలు: ఈ సంకేతాలను అస్సలు నిర్లక్ష్యం చేయవద్దు..

 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.